E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: మీనాకు దిమ్మతిరిగే షాక్.. ప్రభావతి హడావిడి.. బాలుకు నిజం చెప్పిన మీనా..

Gundeninda GudiGantalu Today episode: మీనాకు దిమ్మతిరిగే షాక్.. ప్రభావతి హడావిడి.. బాలుకు నిజం చెప్పిన మీనా..
Advertisement

Gundeninda GudiGantalu Today episode May 1st: మీనా కి కొత్త శత్రువు వచ్చింది.. చింతామణి ఎంట్రీ ఇవ్వడంతోనే మీనా ఒక్కసారిగా స్టన్ఐపోతుంది.. ఎంతగా మీరు ఆర్డర్లు చేశారు అని ఆవిడ అడగ్గానే ఒక్క ఆర్డర్ చేశాను అని మీనా చెప్తుంది. ఏంటి ఒక్క ఆర్డర్ కే ఇంతగా ఇది అయిపోతున్నావా అయితే ఇక్కడ డెకరేషన్ కావలసిన కొటేషన్ ఇస్తే నేను కూడా దాని కొటేషన్ ఇస్తాను. ముందు ఆవిడ కొటేషన్ చూసి డబ్బులు ఎంత అవుతాయో చెప్పమనండి.. ఆ తర్వాత నేను కొటేషన్ ఇస్తాను అని ఆమె అంటుంది. ఇద్దరూ కలిసి మండపానికి కొటేషన్ రాసి ఇస్తారు. ఆవిడ కొటేషన్ తక్కువ ఉందని చెప్పగానే ఒక్కసారిగా షాక్ అవుతారు. మొత్తానికి ఈ ఆర్డరు మీనా చేయి జారిపోయేలా కనిపిస్తుంది.

మీనాకు దిమ్మతిరిగే షాక్..

 ఒక డెకరేషన్ ఆర్డర్ వచ్చిందని మీనా వెళ్లిన ఫంక్షన్ హాల్ లో చింతామణి ఎంటర్ అవుతుంది.. మీనాను ఈ యాడ నుంచి ఎలాగైనా తప్పించాలి అని చింతామణి పక్క ప్లాన్ ప్రకారం చేసుకుంటుంది. తన అసిస్టెంట్ ద్వారా డెకరేషన్ గురించి తెలుసుకున్న చింతామణి మీనా కన్నా తక్కువ కొటేషన్తో డెకరేషన్ ఇస్తానని చెప్తుంది. అంత తక్కువ కొటేషన్ తో డెకరేషన్ కష్టమని ఎంత చెప్తున్నా సరే.. చింతామణి మాత్రం చేసి చూపిస్తానని ధీమాగా చెప్తుంది.. ఇక మీద ఈ ఆర్డరు చేయి జారిపోతుంది అని అనుకుంటూనే మీకు నచ్చినట్లు చేయండి అని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది..

చింతామణి గురించి నిజం తెలుస్తుందా..?

Advertisement

 మీనా బయటికి వెళుతుండగా ఒక ఆవిడ వచ్చి మీనా తో మాట్లాడుతుంది.. ఏంటమ్మా ఈ ఫంక్షన్ ఆర్డర్ చింతామనికి వచ్చిందా..? ఆవిడ ఎలాంటిదో మీకు తెలీదు. ఈ ఏరియాలో ఎక్కడ ఆర్డర్లు ఉన్నా సరే.. . ఆమె తెలుసుకొని ఆ ఆర్డర్లు ఎలాగైనా సరే ఆమెకే వచ్చేలా చేసుకుంటుంది అని అంటుంది. ఆమెకు రావలసిన ఆర్డరు వేరే వాళ్ళకి వస్తే అస్సలు ఊరుకోదు ఎంతకైనా తెగిస్తుంది అని మీనాకు నిజం చెప్పడంతో మీనా టెన్షన్ పడిపోతూ ఉంటుంది.. ఇక ఆర్డర్ పోయింది అని తెలుసుకుని మీనా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది..

ప్రభావతి పై సత్యం సెటైర్స్..

 ప్రభావతి రెండు రోజులకి చీరలు ఏవి పెట్టుకోవాలో అర్థం కావడం లేదు అని మొత్తం చీరలు అన్నిటిని అక్కడ వేసి చూసుకుంటూ ఉంటుంది. ఏంటి ప్రభ ఇవాళ దుప్పట్లు ఉతకలేదా ఈ చీరలు వేసుకొని పడుకోవాలా ఏంటి అని సత్యం అడుగుతాడు. మనోజ్ కొన్న వీల్లా లో మనం రెండు రోజులు ఉండాలి కదా.. ఏ చీరలు పెట్టుకోవాలో నాకు అర్థం కావడం లేదు అని ప్రభ సత్యంని అడుగుతుంది. మీరు ఎలాగో చీరల గురించి చెప్పలేరు కానీ నేను రోహిణి దగ్గరికి వెళ్తాను అని ప్రభా అక్కడికి వెళ్ళగానే రోహిణి మనోజ్ ఇద్దరూ రొమాన్స్ లో మునిగిపోయి ఉంటారు. ప్రభా రాగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు.

బాలుకు నిజం చెప్పిన మీనా..

Advertisement

 పూలు కుడుతున్న మీనా దగ్గరికి శృతి వచ్చి రెండు రోజులకి ఎన్ని జతలు పెట్టుకోవాలో నాకు అర్థం కావట్లేదు మీనా.. ఎన్ని పెట్టుకోమంటావు అని అడుగుతుంది.. రెండు రోజులు కదా శృతి దానికి ఎన్ని సరిపోతాయో అన్ని పెట్టుకొని మీనా అనగానే శృతి సరే అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ప్రభావతి మాత్రం వంటగదిని శుభ్రం చేసి మొత్తం నీటిగా పెట్టు అని ఆర్డర్ వేసి వెళ్తుంది. ఇక బాలు ఏంటి ఇంట్లో హడావిడి అని అడుగుతాడు. అయితే శృతి అడిగితే మీ అమ్మగారు వచ్చి వంటగదిని శుభ్రం చేయమని వెళ్లారు అని బాలుతో చెప్తుంది. ఇక తర్వాత తనకు ఆర్డర్ పోయిందన్న విషయాన్ని చింతామణి గురించి బాలుకు చెప్తుంది.. పర్లేదు మీనా నువ్వు ఏమీ బాధపడవద్దు ఇలాంటివి సహజమే అని బాలు ధైర్యం చెప్తాడు..

విల్లాను చూసి ప్రభా షాక్..

విల్లా దగ్గరకు వెళ్ళగానే అంతా చూసి ప్రభావతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది.. ఎంత పెద్ద విల్లానో ఇది ఎంత పెద్దగా ఉందో అంటూ నోరు వెళ్ళబెట్టుకొని ప్రభావతి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది.. ఇక శృతి రవీలు కూడా ప్రభావతిపై సెటైర్లు వేస్తూ ఉంటారు. లోపలికి వెళ్ళగానే ఓనర్లు డబ్బులు లెక్క పెట్టుకోకుండా తీసుకొని డాక్యుమెంట్స్ ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్లిపోవాలని అనుకుంటారు. బయట అప్పుడే లోపలికి వచ్చిన బాలు మీనా కారుని ఆ ఓనర్ల డ్రైవరు గుద్దె అయిపోతాడు.. దాంతో బాలు కోపంతో వాళ్లతో గొడవకు దిగుతారు ఇక మనోజ్ వెళ్లి ఆ గొడవని సద్దుమణి ఇలా చేసి బాలుని లోపలికి తీసుకొని వస్తాడు. వాళ్లే ఓనర్స్ అని చెప్పగానే బాలు నాకు ఎక్కడో అనుమానంగా ఉంది అని అంటాడు.. ఇక ప్రభావతి తన హడావిడి మొదలు పెడుతుంది.. ఇంటికి కొత్త పేరు పెట్టాలని మనోజ్ ఒక స్వామిజిని పిలవాలని అనుకుంటాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Also Read :Podarillu Today Episode : గుండెలు పగిలే నిజం.. కన్నీళ్లు పెట్టుకున్న అన్నదమ్ములు.. ఇంట్లోంచి వెళ్లిపోయిన కన్నా..?

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×