E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: బాలుకు షాకిచ్చిన ఎస్సై.. బాలు జైలుకు వెళ్తాడా..? రోహిణిని ప్రభా క్షమిస్తుందా..?

Gundeninda GudiGantalu Today episode: బాలుకు షాకిచ్చిన ఎస్సై.. బాలు జైలుకు వెళ్తాడా..? రోహిణిని ప్రభా క్షమిస్తుందా..?
Advertisement

Gundeninda GudiGantalu Today episode march 8th: నిన్నటి ఎపిసోడ్ లో.. బాలు శివని కాలేజీలో మళ్లీ తిరిగి రప్పించేందుకు కాలేజీకి వెళ్తాడు.. కాలేజీని చూసి చాలా సంతోషంగా ఉంటాడు. కాలేజ్ అంటే ఇలా ఉంటుందా ఏ రోజు కాలేజీకి వచ్చిన మొహం కాదు నాది అందుకే ఇక్కడ చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటాడు.. శివ గురించి మాట్లాడాలని ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్తే అతను మాట్లాడ్డానికి ఇష్టపడడం లేదని చెప్తాడు. ఫ్యూన్ చెప్పిన కూడా బాలు వినకుండా ఏదో ఒకటి చేయండి తాతా అని బ్రతిమళాడుతాడు.. మొత్తానికి బాలు అయితే శివని కాలేజీకి పంపించే ప్లాన్ చేస్తాడు..

అయితే ప్రిన్సిపల్ వాళ్ళ ఇంటికి వెళ్లిన బాలు మీనా ఇద్దరు కూడా ఆ ప్రిన్సిపల్ ని ఎలాగైనా నమ్మించాలని అనుకుంటారు. బాలు తాగేసినట్టు నటిస్తాడు.. ఆ ప్రిన్సిపల్ బయటికి రావడం చూస్తున్న బాలు ఇంకాస్త ఎక్కువగా రెచ్చిపోతాడు.. మందు బాటిల్ తీసుకొని తాగినట్టు నటిస్తాడు. అంతేకాదు మీనాని దారుణంగా కొట్టేనట్టు ప్రయత్నిస్తాడు. అక్కడ నాటకం మాడి మరి ప్రిన్సిపాల్ ని ఎలాగోలాగా నమ్మించేస్తాడు. తమ్ముడు శివ బ్యాగులో నేను మందు బాటిల్ దాచుకుంటే వాడు తీసుకెళ్లి ఎక్కడో పడేసాడు ఎక్కడ పడేసాడు నాకు ముందు చెప్పు అని మీనాని కొడుతున్నట్లు బాలు నటిస్తాడు. ఇక మీనా కూడా బాలుకి ఏ మాత్రం తగ్గకుండా రెచ్చిపోతుంది. మీరు నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు అని మీనా ఒకవైపు అంటూనే. మరోవైపు నా పసుపు తాడు కూడా తాకట్టు పెట్టేసుకున్నారు మీరు తాగుడికి నేను చచ్చిపోతున్నాను అని అంటుంది.. మొత్తానికి ప్రిన్స్ పాల్ ను ఒప్పించేస్తారు.. కానీ బాలుకు పోలీసులు షాకిస్తారు.. పోలీస్ స్టేషన్ కు బాలు వెళ్తాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

Advertisement

ఇక ప్రోమో ఎపిసోడ్ విషయానికొస్తే.. మీనా బాలుల నాటకం మొత్తానికి రక్తికట్టేస్తుంది.. కానీ ప్రిన్సిపల్ మాత్రం బాలు నిజంగానే తాగుబోతు అని నమ్మేసి పోలీసులకి పట్టిస్తాడు. ఆ తర్వాత అసలు స్టోరీ మొదలవుతుంది. బాలు పోలీసులకు ఎంత చెప్తున్నా సరే వినకుండా వాళ్లు తాగొచ్చి ఒక అమ్మాయిని ఏడిపిస్తావా అని కొడతారు. మీనా బాలు ఇద్దరు కూడా ఈ నాటకం ఎక్కడ బయట పడుతున్నానని భయపడిపోతూ ఉంటారు. మీనా తెలివిగా బాలుని విడిపించుకోవడానికి అక్కడికి వచ్చి పోలీసులు దగ్గర విన్నవించుకుంటుంది.. అలా మొత్తానికి మీనా బాలుని విడిపించుకుని ఇంటికి తీసుకొస్తుంది. ఇక మనోజ్ మాత్రం వేరే బిజినెస్ గురించి మాట్లాడుతూ ఉంటాడు.

తన ఫ్రెండు చెప్పిన బిజినెస్ గురించి రోహిణి తో చెప్పాలని అనుకుంటాడు. కానీ రోహిణి మాత్రం బాలు ఫోన్ ని ఎలా కొట్టేయాలని ఆలోచిస్తూనే ఉంటుంది.. మొత్తానికి రోహిణి మాత్రం రెండోసారి కూడా ఫెయిల్అవుతుంది.. ఎలాగైనా సరే బాలు దగ్గరున్న వీడియోని కొట్టేసి ఆ గుణానికి పంపిస్తే దినేష్ పీడా విరగడయిపోతుంది బాలు పీడ కూడా పోతుంది అని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే రోహిణి దగ్గరకు వచ్చిన మనోజ్ తన ఫ్రెండు చెప్పిన బిజినెస్ గురించి చెప్పడానికి ప్రయత్నిస్తాడు.. కానీ రోహిణి మాత్రం ఇప్పుడు బాగానే ఉంది కదా కొత్త వాటిల్లో ఇన్వెస్ట్ చేసే రిస్కు తీసుకోవడం అవసరమా అనే మనోజ్తో ఎంత చెప్పినా సరే మనోజ్ మాత్రం నా ముందున్న దారి ఇదే అంటూ రోహిణి కి షాక్ ఇస్తాడు.

Advertisement

Also Read : ఇన్నాళ్లకు మంచి పని చేసిన నారాయణ.. మాధవ్, మహా షాక్.. మహా నిజం చెప్పేస్తుందా..?

ప్రభావతి శృతిని ఎలాగైనా సరే నా దారి లెక్క తెచ్చుకోవాలని ఆలోచిస్తూ ఉంటుంది. ఈ విషయం సత్యంతో చెప్తుంది. పొద్దున నేను తను ఆర్డర్ పెట్టుకున్న హెడ్సెట్ ని తీసానని నన్ను ఎన్ని మాటలు ఉందో తెలుసా అని బాధ పడిపోతుంది.. ఇక తర్వాత శృతికి నేనంటే కొంచెం కూడా భయం లేదు అని అంటుంది. మీనా అనుకున్నావా భయపడడానికి. తనని ఎన్ని మాటలు అన్నా కూడా మీనా మాత్రం మౌనంగా ఉంటుంది. ఇప్పుడు నీకు అర్థం అయిందా ఎవరు నీకు గౌరవం ఇస్తున్నారు అని సత్యం గడ్డి పెడతాడు.. ఇక శివ పరీక్షలు రాయడానికి కాలేజీకి వెళ్తాడు. గుణ ఎలా శివ పరీక్షలు రాస్తున్నాడు అని అనుకుంటాడు.. ఎలాగైనా సరే శివాని పరీక్షలు రాయినివ్వకుండా చేయాలి అని మరోసారి ప్లాన్ చేస్తాడు.. ఈసారి బాలు దగ్గరుండి శివాని ఎగ్జామ్ హాల్ కి తీసుకెళ్తున్నాడని తెలియడంతో గుణ సైలెంట్ అవుతాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. సోమవారం ఎపిసోడ్లో గుణ బాలుకి దొరుకుతాడా లేదా చూడాలి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×