// // Gundeninda GudiGantalu Today episode: శివ జీవితంతో ఆడుకున్న రోహిణి.. మీనా కోసం బాలు ఫైట్.. శివను కాపాడిన బాలు.. -->
E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: శివ జీవితంతో ఆడుకున్న రోహిణి.. మీనా కోసం బాలు ఫైట్.. శివను కాపాడిన బాలు..

Gundeninda GudiGantalu Today episode: శివ జీవితంతో ఆడుకున్న రోహిణి.. మీనా కోసం బాలు ఫైట్.. శివను కాపాడిన బాలు..
Advertisement

Gundeninda GudiGantalu Today episode march 28th : నిన్నటి ఎపిసోడ్ లో.. రోహిణి ఆ వీడియో చూపించగానే ఒక్కసారిగా మీనా కూడా షాక్ అయిపోతుంది.. ఇంట్లోని వాళ్ళందరూ కూడా షాక్ అయిపోవడంతో పార్వతి ఒక్కసారిగా కూలి పోతుంది.. అయితే మీనా శివాని కొడుతుంది. అలాగే సుమతి కూడా ఎందుకురా ఇలా చేశావు. అక్క జీవితం నాశనం చేయాలని చూసావా ఏంటి అని సుమతి కూడా కొడుతుంది. అయితే ప్రభావతి ఆపండి మీ నాటకాలు మీ దొంగబుద్ధులు ఎవరికి తెలియదు.. అందుకే వీళ్ళు నా ఇంట్లోకి రానివ్వలేదు అని ప్రభావతి అంటుంది.. వీన్ని పోలీసులకు అప్పజెప్తాను అని ప్రభావతి అనగానే అందరూ షాక్ అయిపోతారు.. ఇదంతా మాకు ఎప్పుడు జరిగిందో కూడా తెలియదు అత్తయ్య అని మీన ఎంతగా బ్రతిమలాడుతున్నా సరే ప్రభావతి మాత్రం మీద అంత దొంగల కుటుంబం అని దారుణంగా అవమానిస్తుంది..

ప్రభావతి అసలు వినకుండా అందరినీ తిడుతుంది.. ఇలాంటి దుర్మార్గున్ని ఎలా వదిలేయమంటావు. వీడొక దొంగ కాబట్టి.. వీడిని నా ఇంటి గుమ్మం కూడా తొక్కనివ్వట్లేదు అని ప్రభావతి అంటుంది.. బైక్ దొంగతనం చేసి పెద్ద కూతురు పెళ్లి చేశారు. ఇప్పుడు ఈ లక్ష రూపాయలు డబ్బుతో చిన్నదాని పెళ్లి చేయాలనుకుంటున్నారు వీన్ని ఊరికే వదిలిపెట్టేదే లేదు పోలీసులకు అప్పజెప్పి అప్పుడు నా పగని తీర్చుకుంటాను అని ప్రభావతి అంటుంది.. మీరిద్దరూ కలిసి ఇలా ఎంత మందిని మోసం చేస్తారు వీడికి బుద్ధి రావాలంటే ఖచ్చితంగా పోలీసులుకు అప్పజెప్పాలి. జైలుకు పంపించాలి అని ప్రభావతి రెచ్చిపోతుంది.. అక్కడున్న బస్తీ జనాలు ప్రభావతిని అడ్డుకోవడంతో రోహిణి ప్రభావతి అక్కడి నుంచి బయటకు వచ్చేస్తారు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. శివని పార్వతి దారుణంగా తిడుతుంది. నా పెద్ద కూతురు జీవితం కాపురం నాశనం అయిపోయింది. దాని అత్త నా ఇంట్లోకి రానివ్వను అని అంటుంది. దాని జీవితం ఎటు పోతుందో ఏంటో అర్థం కావడం లేదు అని పార్వతి కన్నీళ్లు పెట్టుకుంటుంది.. పెద్ద కూతురి కాపురం ఏమవుతుందో తెలియడం లేదు.. చిన్న కూతురు నీ వెతుక్కుంటూ వచ్చిన సంబంధం కూడా చెడిపోతుందేమో అని పార్వతి కంగారు పడిపోతూ ఉంటుంది.. ఇదంతా నేను కావాలని చేయలేదమ్మా ఆవిడ అలా నన్ను అవమానించిందని చేశాను అంతే అని శివ ఎంత చెప్తున్నా సరే పార్వతి మాత్రం ఇప్పుడు ఏం చేయమంటావో చెప్పురా అని అంటుంది.. ఆయన ఫోన్లో ఆ వీడియో ఉంది అంటే నేను నమ్మలేకపోతున్నాను. నిజమే అక్క బావకి ఈ విషయం ఎప్పుడో తెలుసు అని శివ బాలు గురించి నిజాన్ని బయటపెడతాడు.

ఏంట్రా నువ్వు మాట్లాడేది. కట్టుకున్న భార్యని నాకే ఈ విషయం ఇన్ని రోజులు చెప్పలేదు.అది కూడా నా పుట్టింటి వాళ్ళ విషయం చెప్పలేదు అంటే నాకు ఆశ్చర్యంగా ఉంది ఎలా తెలుసురా అని శివ ని మీనా అడుగుతుంది.. బాలు కి ఒకసారి ఫోటో షాప్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వ్యక్తి ఆ సీసీ కెమెరా ఫుటేజ్ ని ఇచ్చాడని బాలు బావ చెప్పాడు. అప్పటినుంచి నన్ను ఆ గుణతో తిరగదని వార్నింగ్ ఇస్తూ వస్తున్నాడు. గుణ మీద చెయ్యి చేసుకోవడంతో నేను అడ్డుగా వెళ్లడంతో నా చేతులు విరగొట్టాడు. ఆ తర్వాత నాకు బావ ఈ విషయాన్ని చెప్పాడు.. మీ అక్కకు చెప్తే మీ గురించి తలుచుకొని బాధపడిపోతుంది అందుకే మీ అక్క కూడా నేను చెప్పలేదు అని బావ అన్నాడు అని శివ అంటాడు..

Advertisement

నా పుట్టింటి పరువు ని కాపాడడానికి నాకు కూడా విషయం చెప్పకుండా ఆయన మనసులోనే ఇన్ని రోజులు దాచుకున్నాడా..? అయ్యో అల్లుడు నేనే ఎన్ని మాటలు అన్నానో.. ఆయన చేసిన మంచిని మర్చిపోయి ఆయన గురించి నోటికొచ్చినట్టు మాట్లాడను నాకు అసలు బుద్ధి లేదు అని పార్వతి బాధ పడిపోతుంది.. అసలు ఆయన ఫోన్ కనిపించలేదు. ఆ ఫోన్లో ఆ వీడియో ఉనింది అంటే ఎవరో కావాలని నిన్ను ఇరికించడానికి ఇలా చేశారు అని మీనా అంటుంది.. అప్పుడే ఇంటికి వచ్చిన బాలు నాన్న తిరుమల కి వెళ్ళొచ్చాను తిరుపతి ప్రసాదం నాకు కస్టమర్ తీసిచ్చాడు అని అంటాడు..

దర్శనం చాలా బాగా జరిగింది నాన్న ఇదిగో ప్రసాదం అని అనగానే అందరూ మౌనంగా ఉంటారు.. ఏంటి ఈవిడ వంట ఏమైనా చేసిందా? అందరూ అలా మౌనంగా ఉన్నారు అని బాలు అడుగుతాడు. మీనా ఎక్కడ మీనా అని గట్టిగా కేకలు వేస్తాడు. కానీ మీనా మాత్రం ఇంట్లో లేదు అని ప్రభావతి చెప్తుంది. ఇంట్లో లేదు ఇకమీదట ఈ ఇంటికి రాదు అని ప్రభావతి చెప్పగానే మీనా ఏం తప్పు చేసింది ఎక్కడికి పంపించారు అని బాలు అడుగుతాడు.. నీకు ఈ విషయం తెలియదా ఏంటి అని మనోజ్ అంటాడు.. ఏ విషయం గురించి మాట్లాడుతున్నారు అని బాలు అడుగుతాడు..

Also Read :సర్టిఫికెట్ కోసం ఒంటరిగా వెళ్లిన మహా.. నారాయణ దెబ్బకు మహా ఫ్యూజుల్ అవుట్.. చక్రీకి కొత్త టెన్షన్..

అప్పుడు మనోజు శివ దొంగతనం చేసిన వీడియోని చూపిస్తాడు. ఆ వీడియోని పూర్తిగా చూడక తలికే బాలు ఈ వీడియో ఎక్కడిది అని అంటాడు. ఈ వీడియో ఎక్కడినుంచి వచ్చింది? ఎవరు పంపించారు అని అనగానే ఏమో ఎవరికి తెలుసు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే వైరల్ అవుతుంది అని మనోజ్ అంటాడు.. ఆ దొంగ ఇంట్లో నుంచి అమ్మాయిని నా ఇంటికి కోడలుగా అడుగుపెట్టనివ్వను అని ప్రభావతి అంటుంది.. ఇక తర్వాత మీనా ఎక్కడుంది అని అడిగితే వాళ్ళ ఇంట్లోనే ఉంది ఇక్కడికి తీసుకు రావాల్సిన అవసరం లేదు అని బాలుకి ప్రభావతి వార్నింగ్ ఇస్తుంది. రోహిణి మాత్రం బాలు మీనా ఈ దెబ్బతో బయటికి వెళ్లిపోతారు నా గతం గురించి బయట పెట్టే అవకాశం లేదు అని లోలోపల సంతోష్ పడిపోతూ ఉంటుంది. బాలు మాత్రం మీనా కోసం వాళ్ళ ఇంటికి వెళ్లడానికి రెడీ అవుతాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. ఇక సోమవారం ఎపిసోడ్లో శివని అరెస్ట్ చేయడానికి పోలీసులు వస్తారు ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×