E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: ఫోన్ కోసం బాలు వేట.. దినేష్ ను కిడ్నాప్ చేసిన గుణ.. మీనాకు కన్నీళ్లు తప్పవా..?

Gundeninda GudiGantalu Today episode: ఫోన్ కోసం బాలు వేట.. దినేష్ ను కిడ్నాప్ చేసిన గుణ.. మీనాకు కన్నీళ్లు తప్పవా..?
Advertisement

Gundeninda GudiGantalu Today episode march 24th : నిన్నటి ఎపిసోడ్ లో.. ఇప్పుడు ఆ ముఖేష్ వస్తే 50 లక్షలు కట్టమని అంటాడేమో.. వీడు నన్ను నిండా ముంచేసాడు అని మనోజ్ భయపడిపోతూ ఉంటాడు.. నువ్వు చేసిన మోసానికి ఏం జరిగినా జరగొచ్చు ఇప్పుడు ఎందుకు ఆ ముఖేష్ వచ్చిన తర్వాతే ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచిద్దాం అతని ఏమంటాడో చూద్దామని సత్యం అంటాడు. దాంతో మిగిలిన వాళ్ళందరూ కూడా వెళ్లి  ఫ్రెష్ అయ్యి వస్తారు. మీనా బాలు కోసమని మజ్జిగను తీసుకొని వెళ్లి ఇస్తుంది. కానీ బాలు మాత్రం ఇదేంటి అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తాడు.. మీరు రాత్రి తాగి కూడా నిజం చెప్పేశారు.

అందుకు నేను మిమ్మల్ని ఏమీ అనడం లేదు అని మీనా అంటుంది. మీనా నాకు ఒక కాఫీ ఇస్తావా తలనొప్పిగా ఉంది అని శృతి అడుగుతుంది. తాగింది వీలైతే తలనొప్పి మనకు వచ్చేలా ఉంది అని మీనా అంటుంది.. బాలు నిజం చెప్పడం వల్లే మనోజు అడ్డంగా ఇరుక్కున్నాడు అని ప్రభావతి బాలుని దారుణంగా తిట్టేస్తుంది.. కానీ ముఖేష్ వచ్చి బాలు నిజం చెప్పడం వల్ల ఈ డీల్ ఇస్తున్నానని చెప్పడంతో ప్రభావతి ఏమి మాట్లాడకుండా వెళ్ళిపోతుంది. ఇక బాలు తన ఫోన్ ఎక్కడ పెట్టానో అని వెతుక్కుంటూ ఉంటాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. ఉదయం నుంచి నా ఫోన్ కనిపించడం లేదు. ఎక్కడ పెట్టానో అర్థం కావడం లేదు అని బాలు మేన ఇద్దరు కూడా ఆ ఫోన్ ఎక్కడుందో వెతుకుతూ ఉంటారు.. బాలు ఫోన్లో చాలా ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ఉంది దాన్ని ఎక్కడ ఎతకాలి అని అనుకుంటూ వెతుకుతూ ఉంటాడు. ఇంట్లో అంత వెతుకుతున్న టైంలో రోహిణి అక్కడికి వచ్చి ఏం పోయింది ఎక్కడ వెతుకుతున్నారు అని అంటుంది. పీకలు దాకా తాగితే ఇలానే అన్ని వస్తువులు పోయినా కూడా గుర్తుకు ఉండవు అని రోహిణి అనడంతో బాలు ఇప్పుడు నేను చాలా చిరాకు లో ఉన్నాను దయచేసి నన్ను గెలకొద్దు అని బాలు అంటాడు. ఫోన్ వెతుక్కునే పనిలో నువ్వుండు ఆ వీడియోని గుణ దగ్గరికి తీసుకెళ్లే పనిలో నేనుంటాను అని రోహిణి మనసులో అనుకుంటుంది.

ఇక రోహిణి ఆ ఫోన్ ని తీసుకొని గుణ దగ్గరికి వెళ్తుంది. ఇప్పుడు ఈ వీడియోని మనము ఆ గుణకి ఇచ్చినట్లు బాలుకు తెలిస్తే మనల్ని తొక్కుతుక్కు కొట్టి ముక్కలు చేస్తాడు అని విద్య టెన్షన్ పడిపోతూ ఉంటుంది. నువ్వేమీ టెన్షన్ పడకు ఆ బాలుకి అంత సీన్ లేదులే అని ఆ ఫోన్ ని గుణ దగ్గరికి తీసుకొని వెళ్తారు. ఆ తర్వాత నువ్వు ముందు ఆ దినేష్ ని కిడ్నాప్ చేస్తే నీకు ఫోన్ లో వీడియోని పంపిస్తాను అని రోహిణి అంటుంది. మా వాళ్లకి చెప్పి పంపించాను కదా.. వెంటనే వాళ్ళు వస్తారు నువ్వు ముందు ఆ వీడియోని పంపించు అని ఎంత చెప్తున్నా సరే.. రోహిణి మాత్రం ఆ వీడియోని దినేష్ ని తీసుకొచ్చిన తర్వాత పంపిస్తానని అంటుంది. నా మీద ఆ మాత్రం నమ్మకం లేకపోతే ఏం చేయలేను అని గుణ అనుకుంటాడు.

Advertisement

ఆ తర్వాత బాలు తన ఫోన్లో శివ ఇన్ఫర్మేషన్ ఉంది అని రాజేష్ కి చెప్పి ఆ ఫోన్ ని వెతకడానికి ఫంక్షన్ హాల్ కి వెళ్తారు. అక్కడ ఎంతగా వెతికినా సరే .. ఫోన్ కనిపించకపోవడంతో అందులో శివ వీడియో ఉందిరా అందుకే నేను టెన్షన్ పడిపోతున్నాను ఫోన్ గురించి కాదురా అని బాలు రాజేష్ తో అంటాడు.. ఇప్పుడిప్పుడే శివ గాడు దారిలో పడ్డాడు ఇప్పుడు ఈ వీడియో గనుక బయటపడితే వాడి జీవితం ఏమైపోతుంది అని బాధపడిపోతూ ఉంటాడు బాలు. ఇక బాలుకి ట్రిప్ రావడంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఇంటికి వచ్చిన బాలు ఆ ఫోన్ ఎక్కడ కనిపించలేదు అని అంటుంది.. ఫోను ఎక్కడ కనిపించకపోతే ఆ సిమ్ ని బ్లాక్ చేసేయండి ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దాము అని మీనా అంటుంది.

ఓన్లీ బ్లాక్ చేయడం ఇంపార్టెంట్ కాదు. అందులో ముఖ్యమైన వీడియో ఒకటి ఉంది అని మనసులో అనుకుంటాడు బాలు.. ఫోన్ పోయిందని బాధపడుతున్న బాలుని చూసి సత్యం ఫోన్ ఎక్కడికి పోతుంది లేరా.. ఇప్పుడు కాకపోతే రేపైనా దొరుకుతుంది కొత్త ఫోన్ కొనుక్కోరా నేను డబ్బులు ఇస్తాను అని సత్యం అంటాడు.. ఫోను కొనుక్కోవడం కాదు నాన్న అందులో ముఖ్యమైన వీడియో అని అనగానే ఏంటి ఈ వీడియోనా? ఏం వీడియో ఉంది అని నేను అడుగుతుంది.. వీడియో కాదు ముఖ్యమైన డేటా అది నాకు గుర్తుకు రాక వీడియో అని అన్నాను అని బాలు అంటాడు. అంత ముఖ్యమైన డేటా ఏముందండి అని మీనా అడుగుతుంది..

Also Read :

అందులో చాలా ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ఉంది అది బయటపడితే అదే వెళ్ళిపోతే కస్టమర్లకి ఎలా ఫోన్లు చేయాలి.. వాళ్ళు నన్ను ఎలా కాంటాక్ట్ అవుతారని బాధగా ఉంది అని బాలు అంటాడు. ఇక రోహిణి చెప్పినట్లుగా గుణ ఆ దినేష్ ని కిడ్నాప్ చేసి తీసుకొని వస్తాడు. గుణాన్ని చూస్తున్న రోహిణి అమ్మయ్య వాన్ని తీసుకొచ్చారు కదా అని అనుకుంటుంది.. వాడు మమ్మల్ని చూడకూడదు అని రోహిణి అనగానే మీరు వెళ్లి దాక్కోండి నేను వాడి సంగతి చూస్తాను అని గుణ అంటాడు. దినేష్ తనని ఎవరు కిడ్నాప్ చేశారు అర్థం కాక గింజుకుంటూ ఉంటాడు. రోహిణి మాత్రం ఆ వీడియోని పంపించి ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటుంది. నువ్వు సంతోషంగా ఉండడానికి మీనాని ఇబ్బంది పెట్టాలనుకోవడం తప్పు అని విద్య ఎంత చెప్తున్నా సరే రోహిణి మాత్రం మీనా బాధపడితే నాకేంటి సంబంధం అని అంటుంది. ఇక ఇంటికి వెళ్లిన బాలు ట్రిప్ ఉందని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో శివ వీడియో బయటపడుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×