// // Gundeninda GudiGantalu Today episode: నిండా మునిగిన మనోజ్.. రోహిణి పై మనోజ్ సీరియస్.. షాకిచ్చిన ముకేష్.. -->
E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: నిండా మునిగిన మనోజ్.. రోహిణి పై మనోజ్ సీరియస్.. షాకిచ్చిన ముకేష్..

Gundeninda GudiGantalu Today episode: నిండా మునిగిన మనోజ్.. రోహిణి పై మనోజ్ సీరియస్.. షాకిచ్చిన ముకేష్..
Advertisement

Gundeninda GudiGantalu Today episode march 23rd : నిన్నటి ఎపిసోడ్ లో.. రాత్రంతా బాలు ఫోన్ కోసం వెయిట్ చేస్తుంది రోహిణి.. ఇంత ప్లాన్ చేసిన కూడా మనోజ్ కి తిట్లు పడుతున్నాయి కానీ బాలు దగ్గర నుంచి ఫోన్ కొట్టే లేకపోయని బాధ పడిపోతూ ఉంటుంది. ఇక ఏం జరిగినా కూడా సంతోషమే కదా నాన్న నాకు మంచి డీల్ వచ్చింది అనేసి అగ్రిమెంట్ ని చదువుతాడు మనోజ్.. అగ్రిమెంట్ క్యాన్సిల్ అయితే 50 లక్షలు కట్టాలని ఉంది అని అందులో రాసి ఉందని మనోజ్ షాక్ అవుతాడు. అసలు ముఖేష్ కి రాత్రి ఏం మాట్లాడావ్ రా ఎందుకు వెళ్లిపోయాడు రా నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు నా నెత్తి మీదకు వచ్చేలా ఉంది అని మనోజ్ బాలుని అడుగుతాడు. ఆ ముఖేష్ కి ఏం చెప్పారు రా ఎందుకు అతను వెళ్ళిపోయాడు అని మనోజ్ రవి, బాలును అడుగుతాడు. తాము పెద్ద వ్యాపారవేత్తలుగా నటిస్తూ అబద్ధాలు చెప్పామని, తనకు 40 కార్లు ఉన్నాయని, మీనాకు బొకే షాప్ లేదనీ, పార్లరమ్మకు ఏజెన్సీలు లేవనీ, అలాగే ఉన్నాయని, రవికి ఫైవ్ స్టార్ హోటల్స్ లేవని చెప్పాననీ అంటాడు. అతను ఒక హోటల్ లో చెఫ్ అని చెప్పినట్లు మనోజ్ కు చెప్తారు. ఆ మాట వినగానే మనోజ్ దిమ్మతిరిగిపోయేలా షాక్ అవుతాడు..

అసలు ఎవర్రా నిన్ను అనేశాలని చెప్పమన్నారు నువ్వు ఎందుకు చెప్పావు రా అసలు అని మనోజ్ సీరియస్ అవుతాడు..అబద్ధాలు చెప్పడం నాకు ఇష్టం లేకే నిజాలు చెప్పేసాను ఇప్పుడు ఏంటి? అని బాలు అడుగుతాడు.. అబద్ధాలు ఏం చెప్పారు రా మళ్లీ ఏం కొంప మీదకు తీసుకొచ్చారు రా అని సత్యం అడుగుతాడు. అబద్ధాలు ఏమీ చెప్పలేదు నాన్న అని ఎంత చెప్తున్నా సరే సత్యం మాత్రం అడుగు ఒట్టేసి నిజం చెప్పండి అని అడుగుతాడు.. ఇక అబద్ధం చెప్పలేక సత్యం కు అసలు నిజం చెప్తారు.. ఆ మాట వినగానే సత్యం ఒక్కసారిగా షాక్ అయిపోతాడు.. ఏంటి మీరు ఇలాంటి అబద్ధాలు కూడా చెప్తున్నారా కొంచెం కూడా బుద్ధి లేదా ఇలాంటి మోసాలు చేయడానికి అని క్లాసు పీకుతాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. ఇప్పుడు ఆ ముఖేష్ వస్తే 50 లక్షలు కట్టమని అంటాడేమో.. వీడు నన్ను నిండా ముంచేసాడు అని మనోజ్ భయపడిపోతూ ఉంటాడు.. నువ్వు చేసిన మోసానికి ఏం జరిగినా జరగొచ్చు ఇప్పుడు ఎందుకు ఆ ముఖేష్ వచ్చిన తర్వాతే ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచిద్దాం అతని ఏమంటాడో చూద్దామని సత్యం అంటాడు. దాంతో మిగిలిన వాళ్ళందరూ కూడా వెళ్లి ఫ్రెష్ అయ్యి వస్తారు. మీనా బాలు కోసమని మజ్జిగను తీసుకొని వెళ్లి ఇస్తుంది. కానీ బాలు మాత్రం ఇదేంటి అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తాడు.. మీరు రాత్రి తాగి కూడా నిజం చెప్పేశారు అందుకు నేను మిమ్మల్ని ఏమీ అనడం లేదు అని మీనా అంటుంది. మీనా నాకు ఒక కాఫీ ఇస్తావా తలనొప్పిగా ఉంది అని శృతి అడుగుతుంది. తాగింది వీలైతే తలనొప్పి మనకు వచ్చేలా ఉంది అని మీనా అంటుంది..

అప్పుడే ప్రభావతి సత్యం అక్కడికి వస్తారు. నువ్వేం కంగారు పడకు ప్రభా ఏమి కాదులే అని సత్యం తనని ఓదార్చే ప్రయత్నం చేస్తాడు.. కానీ బాలు ఏమైంది ఎందుకు అలా ఉంది అని అడుగుతాడు.. ఏమీ లేదురా ఆ ముఖేష్ వచ్చి ఇప్పుడు 50 లక్షలు కట్టమంటే ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలని మీ అమ్మ కంగారుపడుతుంది అని అంటాడు.. ఇదంతా వీడు వల్లే వీడు నా కడుపుని పుట్టకపోయిన బాగుండేదని ప్రభావతి బాలుని తిడుతూ ఉంటుంది. పైకెళ్ళిన మనోజు 50 లక్షలు ఎక్కడ నుంచి కట్టాలి అని కంగారు పడిపోతూ ఉంటాడు. ఇప్పుడు 50 లక్షలు తీసుకురమ్మంటే నేను ఎక్కడ నుంచి తీసుకురావాలి అని భయపడిపోతూ ఉంటాడు. అప్పుడు అక్కడికి వచ్చిన రోహిణి నువ్వు ఏం బాధపడకు మనోజ్ ఏం జరిగితే అది జరుగుతుంది అని అంటుంది.

Advertisement

ఇదంతా నీ వల్లే జరిగింది రోహిణి నువ్వు ఆ బాలు గారిని తీసుకురాకుండా ఉంటే బాగుండేది.. కానీ నువ్వు ఇలా చేయడం వల్లే వాడు అలా నిజాలు చెప్పేశాడు ఇప్పుడు నన్ను నిండా ముంచేసాడు అని మనోజ్ అంటాడు.. నేను మంచి జరుగుతుందని చెప్పాను ఇలా జరుగుతుందని నాకేం తెలుసు అని రోహిణి కూడా మనోజ్ పై సీరియస్ అవుతుంది. ఇక తర్వాత రోహిణి మనోజ్ ని ఫ్రెష్ అయ్యి రమ్మని చెప్తుంది.. అయితే మనోజ్ కోటులో ఉన్న బాలు ఫోన్ ని కొట్టేసి తన బ్యాగ్ లో పెట్టుకుంటుంది.. కింద అందరూ ఆ ముఖేష్ వస్తే ఏం చెప్పాలి అని టెన్షన్ పడిపోతూ ఉంటారు.

ఈ క్రమంలో ముఖేష్ కూడా అక్కడికి వచ్చి ఆ మోసగాడు ఎక్కడ అని అడుగుతారు.. అతనికి నేనిచ్చిన అగ్రిమెంట్ ని కూడా తీసుకొని రమ్మని చెప్పండి అని ప్రభావతికి చెప్తాడు.. ప్రభావతి వెళ్లి మనోజ్ ని తీసుకొని కిందకు వస్తుంది.. నువ్వు నన్ను చీట్ చేసి ఈ డీల్ ని కొట్టేయాలి అని అనుకున్నావు. సార్ వాడేం తప్పు చేస్తున్నావ్ అది నాదే తప్పు అవుతుంది నేను అందరిని మంచిగానే పెంచాను అని సత్యం అంటాడు.. ఇదే నా ఇండ్లు ఇదే నా కుటుంబం నేను మామూలు బస్సు డ్రైవర్ ని అని ముఖేష్ కి సత్యం నిజాన్ని చెప్పేస్తాడు.. వాడు ఏదైనా తప్పు చేశాడంటే అది నా తప్పు నన్ను క్షమించండి అని సత్యం అతని కి క్షమాపణ చెప్తాడు.. ఇక నేను జీవితంలో పైకి రావడానికి ఇలా అబద్ధం చెప్పాను తప్ప వేరే ఏ ఉద్దేశం లేదు అని మనోజ్ ఎంతగా చెప్తున్నా సరే.. మీ డీల్ క్యాన్సిల్ చేస్తున్నాను నాకు తిరిగి మీరు 50 లక్షలు కట్టాలి అని అంటాడు.. వాడి దగ్గర అంత డబ్బులు లేవు వాడు ఎలా కడతాడు అని బాలు కన్విస్ట్ చేసే ప్రయత్నం చేస్తాడు..

Also Read :మాధవ్ కు సారీ చెప్పిన కేశవ.. కన్నీళ్లు పెట్టుకున్న కన్నా.. హారికకు షాకిచ్చిన మహా..

మీ కుటుంబంలో అందరూ చాలా మంచి వల్లే తను మాత్రం వాళ్ళ అమ్మకి జిరాక్స్ కాపీల పుట్టాడు. బాలు మీ నోట్లోంచి ఊడి పడినట్టు అన్ని మీ అలవాట్లే వచ్చాయి తను నిజం చెప్పి మంచి పనే చేశాడు అని ఆ ముఖేష్ అంటాడు.. ఎప్పటికైనా మారతావని నమ్మకంతో నేను ఈ డీల్ బాలు సత్యం గారి వల్ల ఇస్తున్నాను అని అంటాడు. ఆ మాట వినగానే మనోజ్సం తోషంగా ఉంటాడు. మిగిలిన వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉంటారు. ప్రభావతి మాత్రం వాడు నేను చచ్చేంత వరకు ఇలానే ఉంటాడు అని వెళ్ళిపోతుంది.. ఇక వంట గదిలో ఉన్న మీనా దగ్గరికి బాలు వెళ్లి పరాచకాలు ఆడతాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో బాలు ఫోన్ ఎక్కడుందని వెతుకుతూ ఉంటారు. రోహిణి ఆ ఫోన్ కొట్టేసి గుణాకు ఇస్తుంది ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి…

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×