E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: బాలును ఇరికించేందుకు రోహిణి ప్లాన్.. మనోజ్ కు మరో దెబ్బ.. షాక్ లో ప్రభావతి..

Gundeninda GudiGantalu Today episode: బాలును ఇరికించేందుకు రోహిణి ప్లాన్.. మనోజ్ కు మరో దెబ్బ.. షాక్ లో ప్రభావతి..
Advertisement

Gundeninda GudiGantalu Today episode march 14th: నిన్నటి ఎపిసోడ్ లో.. బాలు లాస్ అని అంటున్నాడు కదా మరి మనోజ్ ని ఎందుకు నువ్వు ఊరికే ఏదో ఒకటి అంటుంటావు అని రోహిణి అంటుంది. కానీ మనోజ్ మాత్రం లక్ష రూపాయలు ఒక నెలకి ఇవ్వాలి అంటే కష్టంగా ఉంది అని మనోజ్ అంటాడు.. ఇక నోటు రాసి ఇవ్వాలి అని బాలు డిమాండ్ చేస్తాడు. మొత్తానికి నోట రాసి అందరి చేత సంతకాలు పెట్టిస్తాడు మనోజ్. ఆ తర్వాత సుమతి కి పెళ్లి సంబంధం వచ్చింది అని పార్వతీ ఫోన్ చేసి చెప్తుంది.

ఆ మాట వినగానే మీనా బాలు ఇద్దరూ కలిసి మేము ఈ పెళ్లి చూపులు దగ్గరుండి చేస్తామ అత్తయ్య అనేసి వాళ్ళ ఇంటికి రావడానికి రెడీ అవుతారు.. పార్వతి సుమతి పెళ్లిచూపులు గురించి చెప్పగానే బాలు మీనా అక్కడికి వెళ్ళిపోతారు.. ఇక బాలు దగ్గరుండి ఆ ఏర్పాట్లు అయినా చూడడంతో మీనా పార్వతి చాలా సంతోషంగా ఉంటారు.. ఆ పెళ్ళికొడుకు కి సుమతి బాగా నచ్చడంతో పెళ్లికి ఒప్పుకుంటాడు.. ఇక ఈ సంతోషకరమైన వార్తని ఎలాగైనా సరే ఇంట్లో చెప్పాలి అని చాలా సంతోషంగా ఇంటికి బయలుదేరుతారు బాలు మీనా. ప్రభావతి మాత్రం రోహిణి చెప్పిన 300 కోట్ల గురించి ఆలోచిస్తూ షాక్ లో ఉండిపోతుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. దినేష్ వచ్చాడని విద్య ఆరోహిణి కి ఫోన్ చేసి చెప్తుంది. అయితే ప్రభావతికి అడ్డంగా దొరికిపోయిన రోహిణి మాత్రం దినేష్ తన ఫాదర్ అసిస్టెంట్ అకౌంటెంట్ అని చెప్తుంది. రిలీజ్ అవ్వడానికి ఇంకొక నెల టైం పడుతుందని అన్నారట అందుకే నేను ప్రతిసారి నేల నెల అని అంటున్నానని రోహిణి అంటుంది. మరి మీ నాన్న ఆస్తులు ఒక మూడు కోట్లు అయినా ఉంటాయా? ఆస్తులు మీ నాన్న రిలీజ్ అయిన తర్వాత వస్తాయా అని అడుగుతుంది ప్రభావతి.. మూడు కోట్లు కాదు 300 కోట్లు ఉన్నాయి మా నాన్న వచ్చిన తర్వాత అవన్నీ మళ్ళీ రిలీజ్ అవుతాయి అని రోహిణి చెప్పగానే ప్రభావతి షాక్ అయిపోతుంది.. 300 కోట్ల అని కిందకి వెళ్ళిపోతుంది.

ప్రభావతిని ఆ స్థితిలో చూసిన సత్యం కాస్త టెన్షన్ పడినా సరే.. అప్పుడే ప్రభ వెళ్ళిపోదులే అని ఆలోచిస్తూ ఉంటాడు.. ప్రభా ఏమైంది ఎందుకు అలా బిగుసుకుపోయావు అని చెప్పగానే రోహిణి వాళ్ళ నాన్న ఆస్తులు ఎన్ని ఉన్నాయో తెలుసా అండి అని అడుగుతుంది.. వాళ్ల నాన్నతో అసలు మాట్లాడడమే లేదు ఆయన ఆస్తులు గురించి నాకు ఎలా తెలుస్తుంది అని సత్యం అంటాడు. ఆయనకు దాదాపు 300 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నాయట అవన్నీ మనోజ్ కి దక్కుతాయి కదా అని అంటాడు. అసలు ఏం మాట్లాడుతున్నావ్ ప్రభ కొంచమైన ఆలోచించి మాట్లాడుతున్నావా ఆయన ఆస్తులు మనోజ్ కి ఎలా వస్తాయి అని సత్యం అడుగుతాడు. ఆయనకు ఒక్కదాని ఒక కూతురైన రోహిణి కే కదా తన ఆస్తి అంతా వచ్చేది ఎందుకు మీరు అర్థం చేసుకోవడం లేదు అని అంటుంది ప్రభావతి..

Advertisement

ఇక రోహిణి దినేష్ పీడని ఎలాగైనా విడిపించేయాలి అని అనుకుంటుంది. ఆ వీడియో ఇస్తే గాని నువ్వు చేయలేవా వాడు నన్ను టార్చర్ చేస్తున్నాడు ఆ వీడియో నాకు దొరకడం లేదు అని గుణ దగ్గరికి వెళ్లి రోహిణి అంటుంది. సరే నేను ఎలాగోలాగా ఆ వీడియోని తెచ్చి నీకు ఇస్తాను నువ్వు ఆ దినేష్ పని పట్టు. అయిన బాలు వల్ల వాడు జైలుకు వెళ్లడం తెలిసింది.. ఇకపోతే బాలు పని పట్టాలి అంటే నువ్వు నాకు ఆ వీడియో ఇవ్వాలి అప్పుడే వాడిని మనం ఏదైనా చేయగలను అని గుణ అంటాడు.. ఇక తర్వాత షాప్ కి వెళ్ళిన రోహిణి అక్కడ మనోజ్ ఫ్రెండ్ మణికంఠ వచ్చి అతనికి అదిరిపోయే ఆఫర్ గురించి చెప్తాడు.. డీలర్స్ కొంతమంది వస్తున్నారు మనం చాలా రిచ్ గా కనిపించాలి తనకి ఒక గ్రాండ్ పార్టీని ఏర్పాటు చేయాలని చెప్తాడు.

Also Read :మాధవ్ ఇంటికి వచ్చిన గాయత్రి.. నారాయణ మాటకు కన్నీళ్లు.. ట్విస్ట్ ఇచ్చిన మహా…

మన పెళ్లిరోజుని ఇంతవరకు జరుపుకోవాలని మనం చాలా గ్రాండ్గా జరుపుకుందాం మనోజ్ అని రోహిణి సలహా ఇస్తుంది.. ఇకపోతే ఈ విషయాన్ని ఇంట్లో చెప్పాలి అని మనోజ్ రోహిణి చాలా సంతోషంగా ఇంటికి వస్తారు. అయితే బాలు మీనా మాత్రం సరదాగా ఉంటారు. మీనాకు ఎలాంటి అబ్బాయి కావాలని అనుకున్నావో చెప్పమని అడుగుతాడు బాలు. మీనా నాకు ఇలాంటి లక్షణాలున్న అబ్బాయి కావాలి అని అనగానే ఇప్పుడు నాకు పెళ్లి అయిపోయింది కదా ఇవన్నీ ఎందుకు లేండి అని అన్నా సరే బాలు మాత్రం నీ మనసులోని కోరికను చెప్పు మీనా అని అంటాడు.. మీ నాన్న తన కాబోయే భర్త ఎలా ఉండాలో చెప్పిన దాన్ని బట్టి బాలు షాక్ అవుతాడు.. ఇక అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. సోమవారం ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×