// // Gundeninda GudiGantalu Today episode: నగల కోసం కన్నీళ్లు పెట్టుకున్న కామాక్షి.. సుందరి పెళ్లి ఫిక్స్.. ప్రభావతికి మైండ్ బ్లాక్.. -->
E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: నగల కోసం కన్నీళ్లు పెట్టుకున్న కామాక్షి.. సుందరి పెళ్లి ఫిక్స్.. ప్రభావతికి మైండ్ బ్లాక్..

Gundeninda GudiGantalu Today episode: నగల కోసం కన్నీళ్లు పెట్టుకున్న కామాక్షి.. సుందరి పెళ్లి ఫిక్స్.. ప్రభావతికి మైండ్ బ్లాక్..
Advertisement

Gundeninda GudiGantalu Today episode june 26th: ప్రభావతి వాళ్ళు రంగా వాళ్ళ ఇంటికి వెళ్తారు. కామాక్షి సుందరికి పెళ్లిచూపులని ఒంటినిండా నగలు వేసి అలంకరిస్తుంది. ఆ నగలలో సుందరి చూసుకుంటూ మురిసిపోతూ ఉంటుంది. అబ్బాయి నగలని చాలా బాగున్నాయి పెద్దమ్మ అంటూ సుందరి వాటిని చూసుకుంటూ ధరించిపోతుంది ఇక ప్రభావతీ వాళ్ళు సుందరి పెళ్లిచూపులని వస్తారు.. అయితే సుందరి అక్కడికి రా వచ్చిన తర్వాత కనిపించలేదు అని కామాక్షి చాలా బాధపడిపోతూ ఉంటుంది. సుందరి ఎక్కడికి వెళ్లిందో అర్థం కావడం లేదు. దాని ఒంటినిండా నా నగలే ఉన్నాయి. ఎన్నో లక్షలు పెట్టి కొనుక్కున్నాను.. నా నగలు పోయాయి అని బాధపడిపోతుంది కామాక్షి.. సుందరికి పెళ్లి ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పాలి ఇలా పెళ్లి సంబంధం చూడటానికి వచ్చేటప్పుడు వెళ్ళిపోతే ఏం బాగుంటుంది అని అందరూ సుందరిని తిడుతూ ఉంటారు..

కామాక్షిని కొట్టిన రంగ…

మీనా బాలు కూడా సుందరి ఫ్రెండ్ ని అడిగి సుందరి ఎక్కడుంది ఎవరిని ప్రేమించింది అని తెలుసుకుంటారు. ఇక కామాక్షి వాళ్ళ దగ్గరికి వచ్చి సుందరి ఎవరినో ప్రేమించిందంట తను వాడితోని వెళ్లి ఉంటుంది మీరు ఏమి కంగారు పడకండి మేము వెతుకుతాము అని అంటారు.. ఇక సుందరి గురించి తెలుసుకున్న బాలు మీన రంగ వాళ్ళ ఇంటికి వచ్చి అసలు విషయం బయట పెడతారు. కామాక్షి మాత్రం నా నగలు పోయాయా ఇంటికి ఆ సుందరి ఎక్కడ అని భయపడిపోతూ ఉంటుంది.. అసలు ఎక్కడుందిరా సుందరిని రంగా కంగారు పడుతుంటే కామాక్షి మాత్రం నా నగలు ఏమయ్యాయి ముందు నా నగలను చూడరా అని కామాక్షి అనగానే రంగా దీన్ని చంపేస్తాను అని అంటాడు..

బాలుకు మాటిచ్చిన రంగ..

Advertisement

అమ్మాయి ప్రేమించిన అబ్బాయి ఎవరో తెలియకుండా ఎలా పెళ్లి చేయాలో అర్థం కావడం లేదు రా అని రంగా బాధపడిపోతూ ఉంటాడు.. అసలు అమ్మాయి వెళ్ళిపోవాలి అని అనుకునే ముందు ఒక్క మాట చెప్తే ఆ సంబంధం గురించి నేనే మాట్లాడేవాడిని కదా.. ఇప్పుడు నా మాట పోయింది పరువు పోయింది.. మరి సుందరిని ఎలా తీసుకురావాలి.. ఇంతకీ ఆ సంబంధం వాళ్లు ఎలాంటి వాళ్ళు ఏంటో వాళ్ళ బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసుకోవాలి కదా.. గుడ్డిగా అమ్మాయిని నమ్మి వాళ్ళ చేతులు పెట్టలేము కదా అని బాలు తో రంగా అంటాడు.. నువ్వేం కంగారు పడకు మావ నేను దగ్గరుండి వాళ్ళ గురించి తెలుసుకొని వస్తాను.. వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసుకొని వాళ్లతో సంబంధం గురించి మాట్లాడి వస్తాను అని అంటాడు.. సరే రా నువ్వు ఎలా అంటే అలా నువ్వు ఏం చెప్తే అదే నేను వింటాను అని మాటిస్తాడు.

మాణిక్యం దొరికిపోతాడు..?

అటు బాలు వాళ్లు ఆ సంబంధం మాట్లాడటానికి అని బయటికి వస్తారు.. మనము ఇప్పుడు వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్లాలి అండి అని మీనా అంటుంది.. ఎలాగైనా సరే వాళ్ళ గురించి తెలుసుకొని సుందరి పెళ్లి గురించి మాట్లాడాలి. తన జీవితాన్ని నిలబెట్టాలి అని బాలు మీన ఇద్దరు కూడా వాళ్ళ ఇంటికి వెళ్లడానికి బయలుదేరుతారు.. పెళ్ళికొడుకు తరఫునుంచి మటన్ కొట్టు మాణిక్యం అమ్మాయి వాళ్ళ ఇంటికి వస్తారు.. అయితే స్వీట్లు మర్చిపోయామని మళ్లీ వెనక్కి వెళ్ళడంతో బాలు వాళ్లకి దొరకకుండా మాణిక్యం తప్పించుకుంటాడు.. బాలు వాళ్ళు కూడా పెళ్లి కొడుకు వాళ్ళ ఇంటికి వెళ్తారు.. ఇటు మాణిక్యం రంగ వాళ్ళ ఇంటికి వెళ్తాడు..

బాలు మాటతో పెళ్లి సంబంధం ఖాయం..

Advertisement

పెళ్ళికొడుకు వాళ్ళ ఇంటికి వెళ్లిన బాలు వాళ్ళ నాన్న చాలా కోపంగా ఉండడం చూసి అతన్ని ఎలాగైనా సరే కూల్ చేసి పెళ్లి గురించి మాట్లాడాలి అని అనుకుంటాడు.. పిల్లల మనసుని అర్థం చేసుకునే వాళ్ళకి పెళ్లి చేస్తే రేపు మన పరువు పోకుండా మన మర్యాద కూడా కాపాడుకున్న వాళ్ళం అవుతాము అని బాలు అతనికి తెలిసేలా చెప్తాడు.. అప్పుడే మాణిక్యం ఫోన్ చేసి పెళ్లికూతురు అమ్మాయి వాళ్ళు కూడా చాలా మంచి వాళ్ళు బావ అని చెప్పగానే బాలు మాట విన్న అతను పెళ్లి చేయడానికి ఒప్పుకుంటాడు.. మంచి రోజు చూసుకుని పెళ్లి సంబంధం మాట్లాడడానికి అని వచ్చేస్తాము అని వాళ్ళ అంటారు.. సుందరిని ఇంటికి తీసుకొని వచ్చినా బాలు వాళ్ళు తనని చూసి కామాక్షి కంగారు పడిపోతుంది. నగలు తనకు రావడంతో చాలా సంతోషంగా ఉంటుంది. కానీ బాలు చెప్పిన మాట విని రంగా చాలా సంతోషంగా ఉంది అని అంటాడు..

ప్రభావతి కి సత్యం వార్నింగ్..

రాత్రి బాలు వాళ్ళు ఇంటికి రాగానే ప్రభావతి వచ్చారా ఊరినంతా ఉద్ధరించి వచ్చారా అంటూ వెటకారంగా మాట్లాడుతుంది. మేము దగ్గరుండి అన్ని చేసుకున్నాం కాబట్టి వాళ్లకి సంతోషం మిగిలింది.. లేదంటే మావయ్యకి బాధ మాత్రమే మిగిలేది.. అప్పుడే అక్కడికి వచ్చిన సత్యం ఏమైందిరా వచ్చిన పని పూర్తయిందా అసలు సుందరి ఎక్కడికి వెళ్ళింది అని అడుగుతాడు.. సుందరి ప్రేమించిన అబ్బాయి వాళ్ళతోనే ఉండింది నాన్న సంబంధం ఖాయం అయింది వాళ్ళు చాలా మంచి వాళ్ళు అని చెప్పగానే సత్యం చాలా సంతోషంగా ఫీల్ అవుతాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Intinti Ramayanam Today Episode: పల్లవి మారిపోయిందా..? ఇదేం ట్విస్ట్.. భరత్ మాటకు మీనాక్షికి మైండ్ బ్లాక్..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×