E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: బాలు దగ్గర స్టూడెంట్ గా మీనా.. ప్రభాకు బుర్ర గిర్రున తిరిగింది.. అరుణ్, సుమతి లవ్ ట్రాక్..

Gundeninda GudiGantalu Today episode: బాలు దగ్గర స్టూడెంట్ గా మీనా.. ప్రభాకు బుర్ర గిర్రున తిరిగింది.. అరుణ్, సుమతి లవ్ ట్రాక్..
Advertisement

Gundeninda GudiGantalu Today episode june 25th: బాలు తన రెండు కార్లు తీసుకొని వచ్చి ఇంటి పక్కనే ఆఫీస్ ని ఓపెన్ చేస్తాడు.. సత్యం కార్ డ్రైవింగ్ స్కూల్ అని పెట్టగానే.. సత్యం నా పేరు ఎందుకు పెట్టావ్ రా అని అడుగుతాడు. కానీ బాలు మాత్రం నాకు అన్నీ మీరే కదా నాన్న అందుకే మీ పేరు పెట్టాను అని చెప్పగానే సత్యం చాలా ఎమోషనల్ అవుతాడు.. వీరిద్దరూ మాట్లాడుకున్న మాటలు ఎపిసోడ్కి హైలైట్ గా నిలుస్తాయి.. మొత్తానికి చాలా గ్రాండ్ గా కార్ డ్రైవింగ్ స్కూల్ ని ఓపెన్ చేస్తారు.. ఇక స్వీట్ దగ్గర వచ్చిన గోలతో ఇంట్లో వాళ్ళందరూ మనోజ్ రోహిణి ఒక ఆట ఆడుకుంటారు..

బాలుకు చెక్ ఇచ్చిన మీనా..

బాలు డ్రైవింగ్ స్కూల్ ఓపెన్ చేసి ఎన్ని గంటలైనా కూడా ఒక్కరు కూడా రాలేదు ఈగల్ తోలుకోవాల్సి వస్తుంది అని ప్రభావతి దారుణంగా మాట్లాడుతుంది.. మా ఆయన దగ్గర స్టూడెంటుగా నేను జాయిన్ అవుతున్నాను ఇప్పుడు ఎవరికైనా అభ్యంతరం ఉందా అని నేను అంటుంది.. అయితే మీనా స్టూడెంట్ గా డ్రైవింగ్ నేర్చుకోవాలి.. ఒకవేళ డ్రైవర్గా నేర్చుకోవాలి అని అనుకుంటే కచ్చితంగా నాకు డబ్బులు ఇవ్వాలి.. మీరు ఇక్కడే ఉండండి నేను ఇప్పుడే వెళ్లి డబ్బులు తీసుకొని వస్తాను అని మీనా వచ్చి చెక్ ఇస్తుంది. ప్రభావతి నడిమంతరపు సిరి రావడంతో దీనికి కళ్ళు నెత్తికెక్కయి చెక్కుతో కొడుతుంది ఒకప్పుడు చిల్లర ఎత్తింది అని దారుణంగా మాట్లాడుతుంది.. కానీ మీన మాత్రం దిమ్మ తిరిగిపోయేలా ప్రభావతికి షాక్ ఇచ్చింది.. నేను ఏమి రోహిణి లాగా 40 లక్షలు ఎత్తుకొని వెళ్లలేదు.. మీ పెద్దబ్బాయి లాగా నగలు మింగలేదు అని అందరికీ ఒకేసారి గడ్డి పెట్టేలా క్లాస్ పీకుతుంది..

మనోజ్ ను కొట్టిన రోహిణి..

Advertisement

మనోజ్ వల్ల రోహిణి మరోసారి అవమానంగా ఫీల్ అవుతుంది. మీ నాన్న మాటలు తలుచుకొని చాలా బాధపడిపోతుంది.. మీనా ఇలా మాట్లాడడంతో రవి చాలా గట్టిగానే గడ్డి పెట్టవు వదిన అని చెప్తాడు.. తర్వాత శృతిని కూడా డ్రైవింగ్ నేర్చుకుంటావా అని రవి అడుగుతాడు.. నాకు ఇప్పుడు డ్రైవింగ్ నేర్చుకొని కారు కొనాల్సిన అవసరం లేదు అని కొందరు లేకుండా మాట్లాడుతుంది.. ఒకవేళ మేము కారు కొన్న కూడా రవి డ్రైవింగ్ చేస్తాడు లేదంటే నేను డ్రైవర్ని పెట్టుకుంటాను అని చెప్పడంతో రోహిణి షాక్ అవుతుంది.. మీ ఆయన లాగా మాత్రం నేను కారుని దాచిపెట్టుకొని ఒకరోజు రెండు రోజులు వాడుకోను అని శృతి రోహిణికి దిమ్మతిరిగి పోయాలా షాకిస్తుంది.. పైకి వెళ్ళిన తర్వాత మీ వల్లే ఇంత అవమానం జరిగింది నాకు అని రోహిణి చాలా ఫీల్ అవుతుంది. అంతే కాదు మనోజ్ ని డిగ్రీ బోర్డు తీసుకొని కొడుతుంది..

నగలతో పారిపోయిన సుందరి..

తర్వాత రోజు ప్రభావతి వాళ్ళు రంగా వాళ్ళ ఇంటికి వెళ్తారు. కామాక్షి సుందరికి పెళ్లిచూపులని ఒంటినిండా నగలు వేసి అలంకరిస్తుంది. ఆ నగలలో సుందరి చూసుకుంటూ మురిసిపోతూ ఉంటుంది. అబ్బాయి నగలని చాలా బాగున్నాయి పెద్దమ్మ అంటూ సుందరి వాటిని చూసుకుంటూ ధరించిపోతుంది ఇక ప్రభావతీ వాళ్ళు సుందరి పెళ్లిచూపులని వస్తారు.. అయితే సుందరి అక్కడికి రా వచ్చిన తర్వాత కనిపించలేదు అని కామాక్షి చాలా బాధపడిపోతూ ఉంటుంది. సుందరి ఎక్కడికి వెళ్లిందో అర్థం కావడం లేదు. దాని ఒంటినిండా నా నగలే ఉన్నాయి. ఎన్నో లక్షలు పెట్టి కొనుక్కున్నాను.. నా నగలు పోయాయి అని బాధపడిపోతుంది కామాక్షి.. సుందరికి పెళ్లి ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పాలి ఇలా పెళ్లి సంబంధం చూడటానికి వచ్చేటప్పుడు వెళ్ళిపోతే ఏం బాగుంటుంది అని అందరూ సుందరిని తిడుతూ ఉంటారు.. బాలు మీనా మీరేం బాధపడకండి పిన్ని మేము అమ్మ ఎక్కడుందో తీసుకొని వస్తాము అని అంటారు..

మీనా, బాలుకు నిజం చెప్పిన అమ్మాయి..

Advertisement

బాలు మీనా ఇద్దరు కూడా సుందరి ఎక్కడుందో అని వెతుకుతూ ఉంటారు.. మటన్ కొట్టు మాణిక్యం తన అల్లుడు లేచిపోయాడు అని బాధపడిపోతూ ఉంటాడు. వాళ్ళిద్దరిని కలిపి బాధ్యత నాది మీరు కూడా పెద్దలుగా ఒప్పుకొని వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలి అని ఇంట్లో అందరికీ సద్ది చెప్పి తన అల్లుడిని వెతకడానికి బయలుదేరుతాడు. అటు మీనా బాలు కూడా సుందరి ఫ్రెండ్ ని అడిగి సుందరి ఎక్కడుంది ఎవరిని ప్రేమించింది అని తెలుసుకుంటారు. ఇక కామాక్షి వాళ్ళ దగ్గరికి వచ్చి సుందరి ఎవరినో ప్రేమించిందంట తను వాడితోని వెళ్లి ఉంటుంది మీరు ఏమి కంగారు పడకండి మేము వెతుకుతాము అని అంటారు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Also Read :Illu Illalu Pillalu Today Episodes: అడ్డంగా దొరికిపోయిన వల్లి.. ధీరజ్, ప్రేమ రొమాన్స్.. నర్మదకు యాక్సిడెంట్..?

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×