E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: అడ్డంగా దొరికిన ప్రభావతి.. కన్నీళ్లు పెట్టుకున్న మీనా.. మనోజ్ కు కడుపుమంట..

Gundeninda GudiGantalu Today episode: అడ్డంగా దొరికిన ప్రభావతి.. కన్నీళ్లు పెట్టుకున్న మీనా.. మనోజ్ కు కడుపుమంట..
Advertisement

Gundeninda GudiGantalu Today episode june 19th : ఏంటి ప్రభా నువ్వు చేసింది కోడలు ఎదగాలని అనుకుంటే నువ్వు ఎందుకు తనని ఆపాలని అనుకుంటున్నావో తను నిన్ను ఎంతగా చూసుకుంటుందో నీకు తెలియదా.? ఇవాళ నాటకం ఆడి మీనాని ఆపావు.. అదే రేపు కాలు చేయి పడిపోతే నేను చూసే దిక్కు కూడా లేరు అని ప్రభావతిని తిడతాడు సత్యం.. కానీ నాన్న ఈవిడ వల్ల మీనాకి మంచే జరిగింది. ఎవరైనా కోడలు ఎదుగుతుంది అంటే సంతోషిస్తారు కానీ ఈవిడ మాత్రం ఈ కోడలు ఎదుగుతుంది అంటే మాత్రం కళ్ళల్లో నిప్పులు పోసుకుంటుంది అని బాలు దిమ్మతిరిగిపోయేలా షాక్ ఇస్తాడు. ఏది ఏమైనా కూడా మీనా కి మంచే జరిగింది. మరో నాలుగు డెకరేషన్ ఆర్డర్లు వచ్చాయి అని చెప్పగానే సత్యం సంతోషపడతాడు.. మీనా ఇక మీదట నుంచి ఎటువంటి పని ఇంట్లో చేయదు ఎవరికి ఏం కావాలంటే వాళ్ళు చేసుకోవాలి అని అందరికీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తాడు బాలు..

ప్రభా పై బాలు కౌంటర్స్..

ప్రభావతి మీనాని ఆపినందుకు గాను బాలు చాలా మంచి పని జరిగింది. మీనా ఇంట్లో ఉండి కూడా తన టాలెంట్ ఏంటో నిరూపించుకుంది అందుకే తనపై పూర్తి నమ్మకం ఇప్పుడు ఏర్పడింది అమ్మ చేసినందుకు థాంక్స్ చెప్పాలి అని ప్రభావతి పై బాలు కౌంటర్స్ వేస్తాడు.. ఏది ఏమైనా కూడా ఆంటీలు ఇంత క్రిమినల్ బ్రెయిన్ అని నేను అసలు ఊహించలేదు అని శృతి అంటుంది.. అమ్మే చేసింది అని అనుకోవడానికి కారణం ఏంటి అని అంటాడు మనోజ్.. ఆవిడ గారి నోటితోని మాట్లాడుతుంటే నేను విన్నాను.. అల్లారా చూసాను అని మీనా అనగానే మనోజ్ మౌనంగా ఉండిపోతాడు.. ఏది ఏమైనా కూడా ప్రభావతి మాత్రం అడ్డంగా దొరికిపోవడంతో సత్యం దిమ్మ తిరిగిపోయేలా క్లాస్ పీకుతాడు.

మీనా కన్నీళ్లు పెట్టుకుంది..

Advertisement

నన్ను ఎంతగా అవమానిస్తున్నా మౌనంగా ఉంటున్న.. ఎలా డబ్బులు లేవని నన్ను అవమానించిన సరే అయినా కూడా నా వల్లే కదా అని నేను ప్రతిదానికి సర్దుకుపోయే చేసి పెడుతుంటే.. నన్ను ఎంతగా ఆడుకున్నారు. అత్తగారు అని అజమాయిషీ చెలాయిస్తూ నన్ను ఎదగనివ్వకుండా చేస్తున్నారు కానీ నేను ఆవిడని ఎప్పుడూ కోపంగా చూడలేదు.. ఇవాళ నాకు చాలా బాధగా అనిపించింది అని మీనా బాలు దగ్గరికి వెళ్లి బాధపడుతుంది. నువ్వేం బాధపడకు మీనా నాకు మాత్రం చాలా సంతోషంగా ఉంది.. నువ్వు దగ్గర లేకపోయినా సరే అందరిని మేనేజ్ చేసి సరైన లీడర్గా నడిపించి పనిని సక్సెస్ అయ్యేలా చేశావు. నిజంగానే నువ్వు గ్రేట్ పులగం పని బాలు ప్రశంసలు వర్షం కురిపిస్తాడు.. అంతే కాదు మీనాకు వచ్చిన డబ్బుల్ని కూడా బాలు ఇవ్వడంతో చాలా సంతోషంగా ఉంటారు..

వంటగదిని మూసేసిన బాలు..

మీనా విలువ ఏంటో తెలియాలని ప్రభావతిని ఆకలితో ఈరోజు అలమటించేలా చేయాలి అని వంట జరిగి బంద్ చేయాలి అని అనుకుంటారు.. అనుకున్నట్లుగానే మీనా వంట చేస్తే అస్సలు ఒప్పుకోను అని బాలు వార్నింగ్ ఇస్తాడు. ఇక మీనా ఒడిలో కాళ్లు పెట్టుకొని బాలు నొక్కించుకుంటూ ఉంటాడు.. భార్య ఒడిలో ఇలా కాలుపెట్టుకొని నొక్కించుకుంటూ ఉంటే ఆనాటి పురాణాలు గుర్తుకు వస్తున్నాయి అని చాలా సంతోషంగా ఉంటాడు.. అయితే అందరూ టైం అయిందని ఆకలేస్తుంది అంటూ కిందకి దిగి వస్తారు.. ఇవాళ వంటగది మూసేసాము బంద్ అని అనగానే షాక్ అవుతాడు మనోజ్..

అయ్యో.. ప్రభావతి..

Advertisement

మీరు వంట చేయకపోతే మేము వంట చేసుకోలేమా ఏంటి నేను ఈరోజు వంట చేస్తాను. అందరూ తినండి ఆ తర్వాత అన్న వెంటనే అస్సలు మర్చిపోలేరు అని ప్రభావతి శబదాలు చేస్తుంది.. ఇక రోహిణి నాకు కొంచెం హెల్ప్ చెయ్యి ఇద్దరం కలిసి వంట చేద్దాము మనం ఈరోజు కడుపు నిండా తిందాము అని ప్రభావతి అంటుంది.. ఇక ఇద్దరూ కలిసి కూరగాయలు కట్ చేసి వంట చేసేందుకు అన్ని సిద్ధం చేస్తారు కానీ తీరా వంటగదిలోకి వెళ్లి చూడగానే గ్యాస్ బండ ఉండకపోవడంతో ప్రభావతి వాళ్ళు ఒక్కసారిగా షాక్ అవుతారు.. మీనానే డబ్బులు కట్టి గ్యాస్ బండ తెచ్చింది కదా.. ఇవాళ నుంచి అది కూడా బందు కట్టెల పొయ్యి మీద చేసుకోవాలి అని అనగానే అందరూ షాక్ అవుతారు. మొత్తానికి మీనా స్ట్రైక్ చేయడంతో ఇంట్లోని వాళ్ళందరూ ఆకలితో చిందులు వేస్తారు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Intinti Ramayanam Today Episode: సుబ్బారావు కోసం కమల్ మాస్టర్ ప్లాన్.. కమల్ గెటప్ అదుర్స్.. పల్లవికి మైండ్ బ్లాక్..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×