E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతిపై శృతి ఫైర్.. రెచ్చిపోయిన బాలు.. హమ్మయ్య ప్రభావతి ఫుల్ హ్యాపీ..

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతిపై శృతి ఫైర్.. రెచ్చిపోయిన బాలు.. హమ్మయ్య ప్రభావతి ఫుల్ హ్యాపీ..
Advertisement

Gundeninda GudiGantalu Today episode January 31st: నిన్నటి ఎపిసోడ్ లో.. శృతి సంగతి ఎలాగైనా సరే వాళ్ళ అమ్మకు చెప్పి కంట్రోల్ లో పెట్టించాలి అని ప్రభావతి అనుకుంటుంది. రోహిణి ప్రభావతి కలిసి డాన్స్ స్కూల్ కి వెళ్తారు.. అక్కడ కామాక్షి డాన్స్ నేర్పిస్తూ ఉంటే ప్రభావతి ఏంటి గంతులు వేపిస్తున్నావు అని సీరియస్ అవుతుంది.. మీరు వెళ్లి కాసేపు రెస్ట్ తీసుకోండి అని ప్రభావతి అంటుంది.. అయితే అందులోని ఇద్దరు స్టూడెంట్స్ మాత్రం తమ ప్రేమాయణానికి లైన్ క్లియర్ అయిందని అనుకుంటారు. ఒక గదిలోకి వెళ్లి తలుపు వేసుకుంటారు. ఆ తర్వాత ప్రభావతి దగ్గరికి శోభ రావడంతో కామాక్షి నా ఇంటికి వస్తే నేనెందుకు లేయాలి అని ప్రభావతితో అంటుంది. శోభ రాగానే మీ అమ్మాయి గురించి మాట్లాడడానికి మిమ్మల్ని పిలిచాను అని అంటుంది.. మా అమ్మాయి ఏం చేసింది ఎందుకు పిలిచారు.. మా స్టేటస్ని మర్చిపోయి మీకు తగ్గట్లేదు బతుకుతుంది కదా ఇక మీద ఎందుకు నన్ను పిలిచి కంప్లైంట్ ఇస్తున్నారు అని శోభా అడుగుతుంది..

మీ అమ్మాయి మీనా తో కలిసి అత్తన్న మర్యాద కూడా లేకుండా ప్రవర్తిస్తుంది. తన ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడంతో పాటుగా నన్ను లెక్కచేయకుండా ఉంటుంది.. తను ఏం చేసినా చెల్లుతుందని అనుకుంటుందేమో.. కానీ మీరు కొంచెం భయం చెప్పాలి అని అనగానే.. శోభ మాత్రం మీకు అంతా బరువు అయితే మా కూతురు మా ఇంటికి పంపించేసేయండి తను ఇష్టమొచ్చినట్టు తను ఉంటుంది అని ప్రభావతికి దిమ్మ తిరిగిపోయి షాక్ ఇస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. శోభ కోపంగా వెళ్లడం చూసిన బాలు ఏంటి ఆవిడ కోపంగా వెళుతుంది ఏం జరిగింది అని అడుగుతుంది. మీనా మాత్రం ఏం జరగలేదని చెప్తుంది.. మీరేమీ కంగారు పడకండి.. అంటూ ఎంత చెప్తున్నా సరే బాలు మాత్రం అస్సలు వినడు.. పక్కనున్న ఆవిడ అసలు విషయం చెప్పడంతో బాలు కోపంగా ఇంటికి వెళ్లి తేల్చుకోవాలి అని అంటాడు.. ఇప్పుడు గొడవలు ఎందుకులెండి అని మీనా ఎంత చెప్తున్నా కూడా బాలు మాత్రం వినడు. ప్రభావతి శృతి రవి ఇంటికి రావడంతో ఇంట్లో పెద్ద రచ్చ చేస్తుంది.. శృతి మాత్రం ప్రభావతిని దారుణంగా తిట్టేసి లోపలికి వెళ్లి పడుకుంటానని అంటుంది. ఆవిడకి నేనంటే కనీసం మర్యాద కూడా లేదు రా అని రవితో అంటూ ఉంటే శృతి అంతేనమ్మా నేను చెప్పిన కూడా వినదు అని రవి అంటాడు..

ఇవాళ నేను మీ అత్త గారితో కలిసి మాట్లాడాను అని రవితో అంటుంది ప్రభావతి.. ఏం మాట్లాడావ్ ఎందుకు మాట్లాడవు అని రవి అంటాడు. మీ ఆవిడ ఆ పూలు అమ్ముకునే దాంతో కలిసి నన్ను తక్కువ చేసి మాట్లాడుతుంది.. నేనంటే కనీసం లెక్క కూడా చేయకుండా ప్రవర్తిస్తుంది అందుకే వాళ్ళ అమ్మకి చెప్పాను అని అనగానే.. అప్పుడే బాలు ఇంటికి ఆవేశంగా వస్తాడు. ఏమైంది ఎందుకు అంత కోపంగా ఉన్నావు అని అంటే అరే లేచిపోయినోడా నీ పెళ్ళాం ఎక్కడ రా అని బాలు అడుగుతాడు. శృతి ఏం చేసింది అన్నయ్య అని రవి ఎంతగా అడుగుతున్న సరే ఏం చేసిందో అక్కడే తేల్చుకుంటాను అని బాలు మీనా కోపంగా లోపలికి వెళ్తారు. బాలు శృతి దగ్గరికి వెళ్లి నా భార్యను అంటే అస్సలు ఊరుకునేది లేదు అని అంటాడు.

Advertisement

అయితే శృతి ఏం మాట్లాడుతున్నారు రవి? మీ అన్నయ్య కాబట్టి ఊరుకుంటున్నాను అని మాట్లాడుతుంది. ఇన్ని రోజులు పాలు డికషన్ లాగా కలిసిపోయిన ఈ నలుగురు ఇప్పుడు గొడవ పడుతున్నారంటే నాకు చాలా సంతోషంగా ఉంది అని.. ప్రభావతి ముఖం వెలిగిపోతుంది. ఆనందంలో భరతనాట్యం చేస్తుంది ప్రభావతి. ప్రభావతి చాలా సంతోషంగా ఉండడం చూసిన సత్యం ఏం జరుగుతుంది ఇంట్లో అని అడుగుతాడు. ఏం జరుగుతుందో మీకు అర్థం కావడం లేదా మీ కొడుకులు కోడలు గొడవ పడుతున్నారు అని అంటుంది.

అక్కడ గొడవ పడుతుంటే నువ్వు ఆపకుండా ఇక్కడేం చేస్తున్నావు అని సత్యం అంటాడు.. నేను ఏ దాంట్లోనూ మధ్యలో దూరద్దు అని మీరే అన్నారు కదా అందుకే ఇక్కడ చూస్తూ కూర్చున్నాను అని ప్రభావతి అంటుంది. అసలు ఎందుకు గొడవ పడుతున్నారో చెప్పు అని సత్యం ఎంతగా అడుగుతున్నా సరే ప్రభావతి మాత్రం నాకేం తెలుస్తుంది అని అంటుంది. ఇక తర్వాత బాలు ఆవేశంగా కిందకి వస్తాడు.. ఏమైందిరా అని అడిగితే ఎవరో లేనిపోనివి చెప్పి గొడవలు పెడుతున్నారు. నా భార్య ని ఏమైనా అంటే అసలు ఊరుకునేది లేదు అని అంటాడు. అలాగే మీనా కూడా నా భర్తను ఎవరైనా ఏదైనా అంటే నేను అసలు ఊరుకోను అని అంటుంది..

Also Read: ప్రభావతిపై శృతి ఫైర్.. రెచ్చిపోయిన బాలు.. హమ్మయ్య ప్రభావతి ఫుల్ హ్యాపీ..

ఇంట్లో అసలు ఏం జరిగిందో చెప్పండి అంటే ఏం లేదు నాకు ట్రిప్ ఉంది నేను వెళ్తున్నానని బాలు అంటాడు. మీనా బాలు ఎందుకు గొడవ పడుతున్నారో తెలియదు కానీ ఏదో జరిగింది అని సత్యం అనుకుంటాడు. సత్యం టెన్షన్ పడుతుంటే ప్రభావతి మాత్రం నాకు ఇప్పుడు చాలా హాయిగా ఉంది అని లోలోపల సంతోషపడుతుంది. రోహిణి తల్లికి ఏమైందో అని టెన్షన్ పడిపోతూ హాస్పిటల్ కి వెళుతుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. ఇక రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×