E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: మీనాను కాపాడిన బాలు.. రోహిణి గుట్టు రట్టు.. ప్రభావతిని రెచ్చగొట్టిన రోహిణి..

Gundeninda GudiGantalu Today episode: మీనాను కాపాడిన బాలు.. రోహిణి గుట్టు రట్టు.. ప్రభావతిని రెచ్చగొట్టిన రోహిణి..
Advertisement

Gundeninda GudiGantalu Today episode January 26th: నిన్నటి ఎపిసోడ్ లో.. మీనా రెండోసారి తల్లి కాబోతుందని ఎలా తెలిసింది అన్న విషయాన్ని మొత్తానికి తెలుసుకుంటారు.. శృతి వల్లే తెలిసిందని అనుకుంటారు కానీ శృతికి మీనా చెప్పిందని తెలుసుకొని ప్రభావతి సీరియస్ అవుతుంది. మీనా నేను చెప్పాను నేనే ఆ విషయాన్ని చెప్పాను అని అనగానే ప్రభావతి రెచ్చిపోతుంది. నా కొడుకు కోడలు సంతోషంగా ఉండడం నీకు ఇష్టం లేదా ఎప్పుడూ ఏదో ఒకటి చెప్తూనే ఉంటావా అని ప్రభావతి సీరియస్ అవుతుంది.. అసలు ఈ పూల అమ్ముకునే దాన్ని నా ఇంటికి తెచ్చి పెట్టారు. ఇది ఎలాంటి గొడవలు పెడుతుందో చూసారా అని ప్రభావతి సత్యం పై సీరియస్ అవుతుంది.. అసలు నువ్వెందుకు ఇలా చేస్తున్నావే నిన్ను అని కొట్టబోతుంది ప్రభావతి. కానీ బాలు అడ్డుకుంటాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. మీనా రోహిణి ప్రగ్నెన్సీ గురించి చెప్పిందని తెలుసుకొని ప్రభావతి ఆగ్రహంతో ఊగిపోతుంది. మీనా ఇంట్లో గొడవలు పెట్టిందని కొట్టబోతుంది..బాలు ప్రభావతి చేయి పట్టుకుంటాడు.. రోహిణి మాత్రం మీనా కరెక్ట్ గా దొరికింది. ఇప్పుడు గనక మనం క్లాస్ పీకకపోతే మరోసారి ఇలాంటి పనులు చేస్తుంది అని అనుకుంటుంది.. ఎందుకు మీనా నీకు నేనంటే అంత కక్ష. ఎప్పుడూ ఏదో ఒకటి నా గురించి చెప్తూనే ఉంటావా అని రోహిణి అంటుంది. మొదటినుంచి మీనాకు డబ్బున్న వాళ్ళ అన్న.. చదువుకున్న వాళ్ళ అన్న ఇష్టం లేదు. అలా నా మీద అందుకే ఇలాంటి పగని పెంచుకొని అబద్ధాలు చెప్తుంది అని రోహిణి అంటుంది.

Advertisement

నువ్వు పైకి కనిపించే అంత మంచి దానివి కాదు అని రోహిణి మీనా అనే దారుణంగా తిడుతుంది. ఇలాంటి దానితో ఎలా ఉండాలి అత్తయ్య రేపు ఇంకొకటి చెప్తే మీరు నమ్ముకున్న ఉండరు కదా అని రోహిణి అంటుంది. మీనా చెప్పడం వల్లే ఇంట్లో తెలిసింది అది గుర్తుపెట్టుకోండి అంటూ బాలు అందరికి వార్నింగ్ ఇస్తాడు. రోహిణి మీనా ఇంకొకసారి నా విషయాలు జోక్యం చేసుకోకూడదు అని రెచ్చిపోయి మాట్లాడుతుంది కానీ మీనా మాత్రం మౌనంగా ఉంటుంది.

ఇలాంటి సమస్యలు ఇంకోసారి రాకుండా ఉండాలంటే ప్రతి విషయాన్ని బయటకు చెప్పాలని అంటాడు. అందరు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మీనా వంట గదిలోకి వెళ్లి ఏడుస్తుంది. అయితే బాలు అది చూసి ఫీల్ అవుతాడు. ఎందుకు మీనా బాధపడుతున్నావు అని అడుగుతాడు.. ఎందుకండీ ఎప్పుడూ నాకే ఇలా జరుగుతాయి అని మీనా కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఎవరు ఏదో అన్నారని నువ్వు ఎందుకు బాధపడుతున్నావు అని మీనాతో బాలు అంటాడు. నిప్పు లేనిదే పొగ రాదు. పార్లరమ్మ ఏదో దాస్తుందని నాకు మొదటినుంచి అనుమానం. పైకి కనిపించేంత మంచిది కాదు. ఒక కేడి అని నాకు ఎప్పుడో అర్థమైంది. మా అమ్మకే అర్థం కాలేదు అని అంటాడు..ఇప్పుడు కచ్చితంగా దీని గురించి బయట పెడతాను నేనున్నాను కదా నిజాన్ని బయటకి కక్కిస్తాను అంతవరకు నిద్రపోను అని బాలు అంటాడు.

Advertisement

ఇక వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడం చాటుగా విన్న రోహిణి బాలు మాట విని షాక్ అవుతుంది. ఇకమీదట నేను జాగ్రత్త పడకపోతే ఖచ్చితంగా ఈ బాలు నా బండారం మనోజ్ లాగే బయట పెట్టేస్తాడు. ఇప్పుడు ఎన్ని మాటలు అయితే నేను అన్నాను అంతకంతా నన్ను అంటారు అని అనుకుంటుంది.. ప్రభావతి దగ్గరకు వెళ్లిన రోహిణి ఇంట్లోంచి వెళ్ళిపోతే ఏ సమస్యలు రావని అనుకుంటుంది. ఆ విషయాన్ని ప్రభావతికి చెప్పగానే మీనా వాళ్లే బయటకు వెళ్తారు. మీరు ఉండాలని అంటుంది.

Also Read : ఆ సీరియల్స్ కు శుభం కార్డు పడ్డట్లే.. టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న పొదరిల్లు..

ఆ తర్వాత రోహిణి దగ్గరకు వచ్చిన మనోజ్ అమ్మ చెప్పింది. మనం వేరే కాపురం పెట్టడం ఎందుకు? కొద్ది రోజులు ఇక్కడే ఉందాం. బిజినెస్ డెవలప్ అయ్యాక ఆలోచిద్దాం అంటాడు. ఇక నీకు గర్భం ఉండి ఉంటే ఎన్నో నెల అని అడుగుతాడు. దానికి 4 అని చెప్తుంది. మనోజ్ ఎమోషనల్ అవుతాడు. ఇక సుమతికి ఇంట్లో జరిగిన విషయాన్ని మీనా చెప్తుంది. సుమతిని డాక్టర్ వెళ్లిపొమ్మని చెప్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో శృతి దెయ్యంగా మారి ప్రభావతి, మనోజ్ ను భయపెడుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×