E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: రాజేష్ ను ఫాలో అవుతున్న బాలు.. మీనా కోసం గిఫ్ట్.. మళ్లీ కలిసిపోతారా..?

Gundeninda GudiGantalu Today episode: రాజేష్ ను ఫాలో అవుతున్న బాలు.. మీనా కోసం గిఫ్ట్.. మళ్లీ కలిసిపోతారా..?
Advertisement

Gundeninda GudiGantalu Today episode January 18th: నిన్నటి ఎపిసోడ్ లో.. రాత్రి బాలు తాగేసి వచ్చి పెద్ద రచ్చ చేస్తాడు.. అయితే ఏం మీనా మాత్రం బాలు తాగేసి మళ్ళీ వచ్చాడని చెప్పేసి చాలా బాధపడిపోతూ ఉంటుంది.. తాగుడు మానేశాను అని అనుకుంటున్నాను కానీ… మీనా ఎంత చెప్తున్నా సరే బాలు మాత్రం నా మాటకి విలువలేదు అంటే నాకు విలువివ్వనట్లే అని మీనాని బాధపెట్టేలా మాట్లాడుతాడు.. ఎంత చెప్తున్న సరే బాలు మాత్రం తాను చెప్పిందే కరెక్ట్ అని మీనాకు దూరం అవుతాడు.. ఏం లేచిన తర్వాత మీనా బాలు ఎలాంటి పని చెయ్యాలని చూసిన కూడా బాలు మాత్రం నాకు నువ్వు ఏ పని చెయ్యొద్దు అని మీ నాతో కఠినంగా మాట్లాడుతాడు..

మీరు ఎలాగైనా సరే నాతో మాట్లాడేలా చేసుకుంటాను అని మీనా అనుకుంటుంది కానీ బాలు మాత్రం నా విషయంలో ఎటువంటి జోక్యం చేసుకోవద్దు అని వార్నింగ్ ఇస్తాడు.. మీనా బాలు కారు కీస్ వంట గదిలో దొరికాయని చెప్తుంది.. కావాలనే నన్ను ఇరికించారు కదా అని అంటుంది. అయితే నేనేమీ మళ్ళీ ఇరికించలేదు మీ అమ్మగారే మీరు తాగిన విషయం చెప్పారు అని మీనా అంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..

Advertisement

ఇక ఇవాళ ప్రోమో విషయానికొస్తే.. కారు స్టాండ్ లో కోపంగా ఉన్న బాలు దగ్గరకు వచ్చిన రాజేష్ ఏంట్రా కోపంగా ఉన్నావ్ ట్రిప్ కు వెళ్లలేదా అని అడుగుతాడు.. ట్రిప్ కి వెళ్ళలేదు ఒక ట్రిప్ వచ్చింది. దాన్ని వేరే వాళ్ళకి ఇచ్చేశాను నా మనసేం బాగాలేదు రా అని అంటాడు.. మీనా వాళ్ళ తమ్ముడు బర్త్డే కి వెళ్లిందని నువ్వు ఇంకా బాధపడుతున్నావా అదే మనసులో పెట్టుకున్నావా? అని రాజేష్ అడుగుతాడు.. అప్పుడే అక్కడికి వచ్చిన పార్వతి మీనా నేను బలవంతం చేస్తే వచ్చింది. మీరు తప్పుగా అనుకోకండి అల్లుడుగారు నన్ను క్షమించండి అని అంటుంది.. పార్వతి ఎంత చెప్పినా సరే పాలు మాత్రం ఆ శివ కోసం మీరు ఏది చేయకండి అలా చేస్తే వాడు మారడు అని అంటాడు..

నేను మీ అమ్మాయిని ఏమి తప్పుగా అనలేదు మీరు ఇకనుంచి వెళ్ళండి నాకు ట్రిప్ వచ్చిందని బాలు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.. మాత్రం బాలు ఇలా అన్నాడు అని వాళ్ళ వీధిలోని వాళ్ళకి చెప్తుంది మీనా బాలు కూడా అందరిలాంటి మగాడే కదా.. తన మాట తన భార్య వినలేదు అని చాలా ఫీలయ్యాడు అని అక్కడున్న వాళ్ళందరూ అంటారు. శివ చెప్పిన మాట వినకుండా బలదూర్ తిరుగుతున్నాడని బాలు కోపంగా ఉన్నాడు.. నువ్వు బాలు మాట వినకుండా మీ పుట్టింటికి వెళ్లడం తప్పే.. భర్త చెప్పిన మాట భార్య వినకపోయినా.. భార్య చెప్పిన మాట భర్త వినకపోయినా ఎవరో ఒకరికి కోపం వస్తుంది.. ఇలాంటివి నువ్వే తెలుసుకోవాలి అని వాళ్లంటారు..

Advertisement

Also Read :ఆదివారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. వీటిని మిస్ అవ్వకండి..

రాజేష్ కూడా మీనా తప్ప ఏమీ లేదురా వాళ్ళ తమ్ముడి కోసమే వెళ్ళింది. కానీ నువ్వు కూడా కొన్ని విషయాలు అర్థం చేసుకోవాలి బాలు అని అంటాడు. కానీ మీనా నన్ను చాలా బ్రతిమలాడింది.. తాను చెప్పే విషయాన్ని కూడా నువ్వు అర్థం చేసుకోవాలి లేదంటే మాత్రం కచ్చితంగా గొడవలు జరుగుతాయి అని బాలు అంటాడు. సరే ఇప్పుడు ఏం చేయాలి అని అనగానే రాజేష్ తనకి ఇష్టమైన వస్తువుని తీసుకుని వెళ్లి ఇవ్వు అని అంటాడు. అటు మీనక్కడ బాలుకి ఇష్టమైన వంట చేయాలని అనుకుంటుంది. మీనా ఎలాగైనా సరే బాలుని మళ్లీ తన దారిలోకి తెచ్చుకోవాలని తనకి ఇష్టమైన వంటని చేస్తుంది.

ఈసారి బాలు చెప్పిన మాటని జవదాటకుండా ఉండాలి అని అనుకుంటుంది. బాలు కూడా మీనా కోసం ఒక చీర ని గిఫ్ట్ గా తెస్తాడు.. అది చూసిన మీనా మురిసిపోతుంది.. వీళ్లిద్దరూ కలిసిపోవడం చూసిన ప్రభావతి ఏంటి వీళ్లిద్దరు అప్పుడే కలిసిపోయారా అని షాక్ అవుతుంది.. ఈ మీనా ఏదో మందు పెట్టింది అందుకే వీడు మళ్ళీ దాని వంకే చూస్తున్నాడు అని ప్రభావతి అనుకుంటుంది. మొత్తానికి బాలు మీనలు మళ్లీ ఒకటి అవుతారని అర్థమవుతుంది. అక్కడితో ప్రోమో ఎండ్ అవుతుంది. ఇక సోమవారం ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×