E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: హాస్పిటల్ లో రోహిణి.. మీనాకు నిజం తెలుస్తుందా? సుమతికి జాబ్ ఆఫర్..

Gundeninda GudiGantalu Today episode: హాస్పిటల్ లో రోహిణి.. మీనాకు నిజం తెలుస్తుందా? సుమతికి జాబ్ ఆఫర్..
Advertisement

Gundeninda GudiGantalu Today episode January 10th: నిన్నటి ఎపిసోడ్ లో.. సుమతి పాసయ్యిందని మీనా ఇంట్లో వాళ్ళందరికీ చెప్తుంది.. ఒక ప్రభావతి తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా సుమతి పాసైనందుకు సంతోషంగా ఉంటారు.. రవి శృతిలు కూడా సుమతి పాస్ అయిన విషయం తెలుసుకొని చాలా సంతోషపడతారు. ప్రభావతి వేసే సెటైర్లకు శృతి కౌంటర్ వేస్తుంది.. మొత్తానికి సుమతి పాస్ అయిందన్న విషయంలో బాలు మీనా మాత్రం చాలా సంతోషంగా ఉంటారు.. ఆ తర్వాత సుమతి పాస్ అయిందన్న సంతోషంతో గుడి దగ్గరకొచ్చే వాళ్ళందరికీ స్వీట్లు పంచుతుంది. అందరికీ స్వీట్ లిస్టు పాస్ అయిన విషయాన్ని చెప్తుంది.. బాలు మీనా గుడి దగ్గరికి రాగానే శివ వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ బాలు మాత్రం సుమతికి కంగ్రాజులేషన్స్ చెప్తాడు.. అందరూ కలిసి ఫోటోలు దిగుతారు. సుమతీ తన తండ్రిని తలుచుకొని ఎమోషనల్ అవుతుంది. అయితే శివని కూడా పాస్ అయ్యి డిగ్రీ తెచ్చుకుంటే మేము చాలా సంతోషంగా ఉంటామని నేను అంటుంది. ఎవరిని పట్టుకొని ఏం మాట్లాడుతున్నావ్ మీనా? అది జన్మలో జరగదు అని బాలు అనగానే శివ సీరియస్ అవుతాడు. రోహిణి ప్రెగ్నెంట్ అవ్వలేదని డాక్టర్ దగ్గరికి వెళ్లి చూపించుకుంటుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. డిగ్రీ పాస్ అయిన తర్వాత వెంటనే జాబ్ తెచ్చుకోవాలని సుమతి ఫిక్స్ అవుతుంది. దాంతో సుమతి ఓ ఇంటర్వ్యూకి వెళ్లాలని అనుకుంటుంది. మీనా, సుమతి ఇద్దరు కూడా ఇంటర్వ్యూ కోసమని ఒక హాస్పిటల్ కి వెళ్తారు. మీనా ఇంకాస్త చదువుకోవే మంచి ఉద్యోగం వస్తదని అంటుంది. కనీ సుమతి మాత్రం ఇప్పటికే నేను అమ్మకి చాలా భారం అయ్యాను జాబ్ చేస్తే అమ్మకి కాస్త హెల్ప్ అయింది అని అవుతాను అని అంటుంది. దాంతో మీనా కూడా నువ్వు చెప్పింది కూడా నిజమే కానీ ఇంకా చదివితే మంచి ఉద్యోగం వస్తుంది కదా అని ఎంత చెప్పినా సరే సుమతి వినదు.

Advertisement

సరే నీ ఇష్టం నువ్వు ఇంటర్వ్యూలో బాగా సెలెక్ట్ అవుతావు ఆ నమ్మకం నాకుంది అని నేను అంటుంది. అక్కడున్న రిసెప్షన్ లిస్టు దగ్గరికి వెళ్లి ఇంటర్వ్యూ కోసం వచ్చానండి ఎక్కడికి వెళ్లాలి అని అడుగుతారు.. వాళ్లు పైన వెళ్లి ఫ్లోర్ ఇంచార్జ్ ను కలవండి అని చెప్తారు.. సుమతి ఫ్లోర్ ఇంచార్జ్ దగ్గరికి వెళ్లి ఇంటర్వ్యూ కోసమని చెప్తారు. మీనా నువ్వేమీ కంగారు పడకు ఈ జాబ్ నీకు కచ్చితంగా వస్తుంది భయపడకుండా ఇంటర్వ్యూలో పాల్గొను అని అంటుంది. సుమతి లోపల ఇంటర్వ్యూ కి వెళ్ళగానే అటు రోహిణి అపాయింట్మెంట్ తీసుకున్న డాక్టర్ దగ్గరికి వెళుతుంది.

డాక్టర్ని కలిసిన రోహిణి కి నాకు ఆల్రెడీ ఒక బిడ్డ పుట్టారు. అప్పుడు ఇటువంటి కాంప్లికేషన్స్ లేవు బట్ ఇప్పటికీ నేను తల్లి కాలేకపోతున్నాను అని అంటుంది.. డాక్టరు మీకు కొన్ని టెస్ట్ లు చేయాలి అని రోహిణి టెస్టులు చేస్తారు. అయితే రోహిణి వచ్చిన రిపోర్ట్లలో అన్ని పాజిటివ్ గానే ఉండడంతో డాక్టర్ మీకేం ప్రాబ్లం లేదు మీకు ఒత్తిడి ఎక్కువగా ఉంది అది మాత్రమే తగ్గించుకుంటే సరిపోతుంది అని అంటారు. దాంతో సరే డాక్టర్ గారు అని మందులు తీసుకోవడానికి బయటకు వస్తుంది. అక్కడే ఉన్న విద్యా దగ్గరికి వెళ్ళిన రోహిణి ఏంటి సమస్య ఏమీ లేదంటానా అని అడుగుతుంది..

Advertisement

ఎటువంటి రోగాలు లేవంట కేవలం స్ట్రెస్ ఎక్కువగా ఉందంట దాన్ని తగ్గించుకుంటే ఫలితం ఉంటుంది అని డాక్టర్ చెప్తున్నారు. నీకు ఉన్నదే స్ట్రెస్ కదా.. నువ్వు అసలే దుబాయ్ లో పుట్టి పెరిగావు కదా.. నువ్వు రోజు ఏదో ఒకటి చెప్పాలి కదా ఇంట్లో అందుకే నీకు ఈ స్ట్రెస్ మొదలైనట్టుంది అని విద్య కావాలని రోహిణి రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది. ఆ తర్వాత రోహిణి విద్యను అందుకే నీకు పెళ్లి కాలేదు అని అనగానే.. నీ మొగుడు లాంటి తింగరోడైతే నాకొద్దు తల్లి జీవితంలో పెళ్లి కాకపోయినా పర్వాలేదు ఇలానే ఉండిపోతాను అని విద్య అంటుంది. మనోజ్ చాలా మంచివాడే ఎందుకలా మాట్లాడుతున్నావు అని విద్యను రోహిణి అంటుంది.

Also Read : ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ నటీనటులు.. ఎవరెవరు ఎంత సంపాదిస్తున్నారు..?

ఆ తింగరోడు కాబట్టి నిన్ను భరిస్తున్నాడు అదే వేరే వాళ్ళైతే అసలు భరించే వాళ్లే కాదు.. నీ ఆటలు సాగుతున్నాయి. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా చింటూ గురించి ఇంట్లో చెప్పేసేయ్ ముందు నువ్వు ప్రెగ్నెంట్ అవ్వు అని విద్యా సలహాలు ఇస్తుంది.. ముందు మందులు తీసుకున్న పదా అని విద్యా రోహిణి ఇద్దరు మందుల షాప్ దగ్గరికి వెళ్తారు. మాలలు కట్టడానికని వెళ్లిన మీ నాకు సుమతి ఫోన్ చేస్తుంది. నేను ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాను అక్క అని సంతోషంగా చెప్తుంది. ఇంటర్వ్యూ గురించి పూర్తి వివరాలను మీనా తోపంచుకుంటుంది. అప్పుడే అక్కడ మెడికల్ షాప్ దగ్గర రోహిణి ఉండడం చూసి సుమతి అక్క రోహిణి వెటర్నరీ హాస్పిటల్ కి వచ్చింది. ఇక్కడ రోహిణికి ఏం పని అర్థం కావడం లేదు అని సుమతి అనగానే మీనా షాక్ అవుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×