E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: రాజేష్ కు మాటిచ్చిన బాలు.. మనోజ్ కు దిమ్మతిరిగే షాక్.. మీనా, బాలు మధ్య గొడవ..

Gundeninda GudiGantalu Today episode: రాజేష్ కు మాటిచ్చిన బాలు.. మనోజ్ కు దిమ్మతిరిగే షాక్.. మీనా, బాలు మధ్య గొడవ..
Advertisement

Gundeninda GudiGantalu Today episode February 9th: నిన్నటి ఎపిసోడ్ లో.. బాలు మీనా నిద్రపోతూ ఉంటే ఒక్కసారిగా బాలు ఉలిక్కిపడి లేస్తాడు. ఏమైంది ఎందుకు లేచావు అని నేను అడుగుతుంది. ఏం లేదు నాకు ఒక కల వచ్చింది. ఆ కలలో మనిద్దరం కొట్టుకుంటున్నాము. అందుకే నేను భయపడి లేచేసాను అని బాలు అంటాడు.. అయితే ఆ కలలో కూడా నేను మాట్లాడేది లేదు కదా అని నేను అడుగుతుంది.. అదేంటి నేను నీకు మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వడం లేదని ఫీల్ అవుతున్నావా ఏంటి అని ఇద్దరు కలిసి గొడవపడతారు.. చూశారా కళ నిజమే అయింది మనిద్దరం ఇప్పుడు గొడవ పడుతున్నామని మీనా అంటుంది.

ఇకపోతే ఇద్దరి మధ్య కాస్త రొమాంటిక్ టచ్ మొదలవుతుంది.. రోహిణి విద్య ఇద్దరు కలిసి సుగుణమ్మ కోసం ఒక ఇంటిని వెతకాలని అనుకుంటారు. అక్కడ ఒక ఇల్లు చూసి అక్కడ ఓనర్ తేడాగా ఉన్నాడని విద్య అంటున్న సరే రోహిణి మాత్రం ఇల్లు చాలా బాగుంది నాకు బాగా నచ్చింది అని అంటుంది. బాలు ట్రిప్ కోసమని వెళ్లగా అందరూ ఖాళీగా ఉండటం చూసి ఏంట్రా మీరందరూ ఖాళీగా కూర్చున్నారు అని అంటారు. ట్రిప్పులు వస్తే ఖాళీగా ఎందుకు కూర్చుంటాం…ఇవాళ ఒక్క ట్రిప్ కూడా పడలేదని కాళీగా కూర్చున్నాం అని అంటారు. అక్కడ ఉన్న రాజేష్ ను చూసి బాలు షాక్ అవుతాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. రాజేష్ మాత్రం అక్కడ పడిపోయి కనిపించడంతో ఏమైందిరా వీడు నిద్రపోతున్నాడా ఏంటి అని బాలు అడుగుతాడు. తాగొస్తే పడుకోక ఇంకేం చేస్తారు అని బాలు అంటాడు.. తాగి రావడమేంట్రా ఏం మాట్లాడుతున్నావ్ రా అసలు పగలు తాగడం ఏంటి అయినా తాగితే ఇద్దరం కలిసే తాగుతాం కదా.. అని అనగానే ఏమో వాడ్ని లేపి నువ్వే అడుగు అని వాళ్ళు అంటారు..రాజేష్ ని లేపి ఏం జరిగింది అని అడుగుతారు బాలు. కొడుకుగా పుట్టినందుకు మా నాన్న అమ్మ సంతోషాన్ని నేను చూడలేకపోతున్నాను అని రాజేష్ బాధపడతాడు.. ఏం జరిగిందో చెప్పురా ఎందుకలా మాట్లాడుతున్నావు అని బాలు అడుగుతాడు..

మా అమ్మ నాన్నలా షష్టిపూర్తి కార్యక్రమాన్ని చేయడానికి డబ్బులు లేవురా అదే నా బాధ అని రాజేష్ అంటాడు. డబ్బుల కోసం నువ్వు ఇంతగా బాధపడి తాగొచ్చావా ఇప్పుడు నీకు ట్రిప్ వస్తే ఏం చేస్తావ్ రా అని బాలు అంటాడు. డబ్బులు దొరకాలి కదరా నన్ను కన్నందుకు వాళ్ళని సంతోషంగా చూసుకోవాలని అనుకున్నాను. కానీ ఇలాంటి చిన్న చిన్న కోరికలు కూడా తీర్చలేక పోతున్నాను చవటని అని బాధపడిపోతూ ఉంటాడు.. నీకు డబ్బులే కదా నేను తెచ్చిస్తాను మీ అమ్మ నాన్నకి నువ్వు ఫంక్షన్ చేసుకో అనేసి బాలు మాట ఇస్తాడు. వీణ బట్టలు అరేస్తుంటే సాయం చేయడానికి బాలు వస్తాడు. ఏంటి ఇవాళ నా కష్టాన్ని చూడలేకపోతున్నారా ఏంటి సాయం చేస్తున్నారు అని నేను అడుగుతుంది.

Advertisement

నీ గురించి నేను ఎన్నెన్నో అనుకున్నాను కానీ నువ్వు సాయం చేయట్లేదు అని బాలు అంటాడు.. పాలు ఏదో కావాలని వచ్చినట్లు మీనాకు అర్థం అయిపోతుంది. దేనికోసం వచ్చారు ఏమైంది చెప్పండి అని మీన అడుగుతుంది.. నేను రాజేష్ కి లక్ష రూపాయలు డబ్బు ఇస్తానని మాటిచ్చాను. దాచిపెట్టిన వాటిలో ఒక లక్ష రూపాయలు తీసుకొని వచ్చి ఇవ్వవా అని మీనా తో బాలు అంటాడు. కానీ మీనా మాత్రం అవి మన రూమ్ కోసం దాచిపెట్టుకున్నవి ఇప్పుడు వాటిని ఖర్చు చేస్తే మన రూమ్ ఎలా కడతాము అని అంటుంది. ఇప్పుడు వాళ్ళందరికీ బిర్యానీలు పెట్టడానికి ఇవ్వాలని బాలును మీనా అడుగుతుంది. బాలు ఎంతగా చెప్పినా సరే మీనా మాత్రం డబ్బులు ఇవ్వడానికి అసలు ఒప్పుకోదు. మీనా ఎంత చెప్పినా కూడా వినకుండా లోపలికి వెళ్ళిపోతుంది.

Also Read : 20 లక్షలు అడిగిన రామరాజు.. ప్రేమకు ధీరజ్ సపోర్ట్.. సాగర్ పై నర్మదకు అనుమానం..

వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడం విన్న ప్రభావతి చాలా సంతోషంగా ఉంటుంది. ఎలాగైనా సరే వీళ్ళిద్దరిని విడగొట్టాలని అనుకుంటుంది. చూసావా నువ్విచ్చిన డబ్బులు నీకు ఇవ్వడానికే ఎంతగా ఇది చేసిందో.. నీ పెళ్ళాం గురించి ఇప్పటికైనా నీకు అర్థమైందా లేదా అని బాలు మీనాల కాపురంలో చిచ్చు పెట్టేస్తుంది. నువ్వు ఇచ్చిన డబ్బుల్ని ఇవ్వడానికి అంతగా ఇది చేస్తుంది అంటే నువ్వే ఆలోచించుకో దానికి ఎంత పొగరు అన్నది అని మీనా పై కావాలనే రెచ్చగొట్టేలా బాలుకి చెప్తుంది. బాలు మాత్రం మా ఇద్దరి మధ్య గొడవ పెట్టాలని ఆలోచించకు మేము ఎప్పుడూ గొడవ పడము. మేము ఇంతే నాకేం చాలా బాగా తెలుసు అని అంటాడు.. ఆ తర్వాత బాలు బయటకు వెళ్లి తన ఫ్రెండ్స్ ని డబ్బులు కావాలని అడుగుతారు. వాళ్లు నువ్వు ఇస్తానని చెప్పావు కదరా మరి ఒక మాట వాడికి ముందే చెప్పి ఉంటే ఈ సమస్యలు వచ్చేవి కాదు కదా అని అంటారు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. ఇక రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి…

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×