E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతి పై బాలు సెటైర్.. శృతి, రవి మధ్య గొడవ.. పూలు అమ్ముకున్న ప్రభా..

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతి పై బాలు సెటైర్.. శృతి, రవి మధ్య గొడవ.. పూలు అమ్ముకున్న ప్రభా..
Advertisement

Gundeninda GudiGantalu Today episode February 26th : నిన్నటి ఎపిసోడ్ లో.. బాలు కారు ఎక్కిన విద్య రోహిణి గురించి అన్ని విషయాలు షేర్ చేసుకుంటుంది. బాలు కి అనుమానం కూడా వస్తుంది. రోహిణి చెప్పినట్లు బాలు ఫోన్ ని విద్య తీసుకుంటుంది.. కానీ అంతలోపే మీనా ఫోన్ చేయడంతో ఆ ఫోన్ ని మళ్లీ బాలు తీసుకుంటాడు.. ఇక బాలు మీనా తో దినేష్ దొరికినట్లు చెప్తాడు.. ఆ మాట విన్నా విద్యా షాక్ అవుతుంది. ఈ విషయం ఎలాగైనా సరే ఇంట్లో చెప్పాలని అనుకుంటాడు.. మాట చెప్పగానే వీడు ఇలాంటి గొడవలు కూడా తెచ్చి పెడుతున్నాడా అని ప్రభావతి అంటుంది.. వాడు కావాలనే ఇదంతా చేసాడు వాని పట్టుకొని వాడి నోటనే నిజం చెప్పేస్తాను అని బాలు అంటాడు.. ఇక తర్వాత రవి శృతి వెళ్తూ ఉంటే రవి బాస్ నీతూ కూడా అదే బండిపై వెళ్ళాలని అనుకుంటుంది.. కలిసి త్రిబుల్ రైడ్ వెళ్తే పోలీసులకు చిక్కుతారని ఎంతగా చెబుతున్నా సరే ఆమె వినకుండా బండి ఎక్కుతుంది.. మీనాతో ప్రభావతి ఛాలెంజ్ చేస్తుంది. మౌనికను తీసుకొని వస్తే నువ్వు ఏం చెప్తే అది చేస్తాను అని ప్రభావతి అంటుంది.. మీనా గెలిచి చూపిస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. ప్రభావతి ఇంట్లో ఉన్న పాత సామాన్లని దుప్పట్లని బయటపెడుతుంది.. ఏంటి ఎందుకు ఇవన్నీ బయట పెడుతున్నావు అని బాలు అడుగుతాడు.. లేదు మీ ఆవిడ లాగా ఓడిపోతుంది కదా అ పూల కంపెనీ పక్కన పెట్టేసి ఇంట్లో ఉన్న సామాన్లన్నీ రోజు కడుగుతూ ఇంట్లోనే ఉండాలి అని అంటుంది.. అప్పుడే ఇంట్లోకి వచ్చిన మీనా ఇవన్నీ ఏంటి ఇక్కడ పెట్టారు అని అడుగుతుంది. ఏంటి మౌనిక వాళ్ళని తీసుకొని వస్తానని శబదాలు చేశావు కదా రానన్నారా గెంటేసారా బయటికి తోసేసారా అని ప్రభావతి అడుగుతుంది.. మావయ్య గారు మీరు ఒకసారి అమ్మమ్మ గారికి ఫోన్ చేసి మౌనికకు వాళ్ళ ఆయనకు బట్టలు పెట్టాలి ఏమో అడగండి అని మీనా అంటుంది. మాట వినగానే ప్రభావతికి ఫీజులు ఎగిరిపోతాయి..

Advertisement

ప్రభావతి ఓడిపోయింది కాబట్టి మీనా గెలిచినట్లే పూలమ్మాల్సిందే అని బాలు అంటాడు.. ఇక అప్పుడు ఇంట్లోకి సుశీలమ్మ ఎంటర్ అవుతుంది.. అయితే అత్తయ్య మీరు వచ్చేసారా అని అనగానే సుశీల వచ్చి రాగానే ప్రభావతి పై సెటైర్లు వేస్తుంది.. సుశీల వచ్చిన తర్వాత బాలు రేపు నీకు ఒక విచిత్రం చెప్పబోతున్నాను అది చూసి నువ్వు తట్టుకోలేవు శీలా డార్లింగ్ అని అంటాడు.. అయితే షీలా నీ లోపలికి తీసుకోలేను నా బాలు శృతి మీనాల మధ్య నిజంగానే గొడవ జరిగిందా అని అడుగుతుంది.. మీనా బాలు ఇద్దరూ కలిసి నిజం చెప్తారు..

శృతి మీనా ఇద్దరు గొడవపడడం లేదు వాళ్ళిద్దరి మధ్య గొడవ ఉన్నట్లు ప్రభావతి నమ్మేటట్లు చేస్తుంది.. అందుకే ఇలా ప్రభావతి నమ్ముతుంది మా ఇద్దరి మధ్య ఎటువంటి గొడవలు లేవు అని అనగానే సుశీల మీ అమ్మని మంచిగా నే బోల్తా కొట్టించారు కదా అని అంటుంది.. తర్వాత సంజయ్ వస్తే మీరు మాత్రం గొడవపడకండి అని అని మీనా అంటుంది. ముందైతే ఒకలాగా ఉండేది పెళ్లయిన తర్వాత అతను మీ చెల్లెలు భర్త అండి మీరు గొడవ పడకుండా ఉండి ఒకసారి అతనితో మంచిగా మాట్లాడండి అతను మారిపోతాడు అని అంటుంది..

Advertisement

నా గురించి నీకు తెలియదా మీనా… నన్నెవరైనా ఏదైనా అంటేనే నేను వాళ్లని ఏదో ఒకటి అంటాను లేకపోతే ఏది అనను. అయినా కూడా మీరు ఆ ఫంక్షన్ అయిపోయింత వరకే అతనితో మంచిగా ఉండండి అని మీనా అంటుంది.. అవున్రా తను చెప్పింది కూడా నిజమే అతను ఎలాంటి వాడినా సరే నీ చెల్లెలు భర్త అంటే ఈ ఇంటికి అల్లుడు మనం తనని జాగ్రత్తగా చూసుకోవాలి అని సుశీల అంటుంది.. ఇక తర్వాత ప్రభావతి పూలమ్మినట్లు కలగ అంటుంది.. కానీ అది కలే అని కాస్త ఊపిరి పీల్చుకుంటుంది.. ఆ తర్వాత రోజు ఉదయం ప్రభావతి రెడీ అవ్వడం లేట్ అవుతుంది. బాలు ఆ పూల గంప నెత్తిన పెట్టి పూలని అమ్మాలని అంటాడు.. ఇక అందరూ కూడా ప్రభావతికి వ్యతిరేకంగా ఉండడంతో ప్రభావతి ఫీల్ అవుతుంది..

Also Read :అవనిపై పల్లవి రివేంజ్.. చక్రధర్ మాస్టర్ ప్లాన్.. స్టోరీలో ఊహించని ట్విస్ట్..

ఇక అందరూ కలిసి బొమ్మల కొలువు ఏర్పాటుచేసిన స్థలానికి వెళ్తారు.. అక్కడ ప్రభావతిని ఒక ఆట ఆడుకుంటాడు బాలు.. మీనా వాళ్ళ అమ్మ వస్తే ఇంట్లోని వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా పలకరిస్తారు.. కామాక్షి మాత్రం ఈ ఫార్మ్ హౌస్ ఎవరిదో నాకు తెలియదు బయట ఉన్నవన్నీ మా ఫ్రెండ్ వే అని అంటుంది.. శృతి వాళ్ళ అమ్మ కూడా రావడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు.. శోభ రాగానే వెళ్లి ప్రభావతి పరిగెత్తుకుంటూ వెల్కమ్ చెప్తుంది. ఇక శృతి శోభ కి ఒక అగ్గిపుల్ల ఇచ్చి ఎప్పుడొచ్చిన మా ఫ్యామిలీలో ఒక పొల్లేసి వెళ్తావు కదా ఇదిగో ఈ పుల్ల తీసుకొని వేసేసి వెల్లు అని అంటుంది.. ఇక అందరూ కూడా సంతోషంగా బొమ్మల కొలువు కోసం ఏర్పాటు చేయాలని అనుకుంటారు.. పిల్లలు కూడా రావడంతో అక్కడ ఒక సందడి వాతావరణం ఎలా ఉంటుంది.. మొత్తానికి బొమ్మలు కొలువు సరదాగా మొదలవుతుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×