E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: అయ్యో బాలు అడ్డంగా ఇరుక్కున్నాడే.. మనోజ్ పరువు పోయింది.. తాగొచ్చిన శివ..

Gundeninda GudiGantalu Today episode: అయ్యో బాలు అడ్డంగా ఇరుక్కున్నాడే.. మనోజ్ పరువు పోయింది.. తాగొచ్చిన శివ..
Advertisement

Gundeninda GudiGantalu Today episode February 13 th: నిన్నటి ఎపిసోడ్ లో.. ఉదయం లేవగానే బాలు రాజేష్ వాళ్ళ అమ్మానాన్న షష్టిపూర్తికి వెళ్తున్నానని చెప్పగానే మీ నాన్న కూడా తీసుకెళ్లాలని సత్యం అంటాడు. సత్యం చెప్పడంతో మీనాని ఇష్టం లేకపోయినా బాలు అక్కడికి తీసుకొని వెళ్తాడు. ఎక్కడున్నావ్ వాళ్ళందరికీ మీనాని పరిచయం చేస్తాడు.. ఆ తర్వాత ఫస్ట్ పూర్తి జరగాల్సిన దంపతులు ఎలా ఉన్నారు ఏంటి అని బాలు వాళ్ళని అడుగుతాడు.. మీ ఫ్రెండ్ ఏం చేస్తున్నాడు మీ ఫ్రెండుకి తెలీదు. మీరు వెళ్లి ఒకసారి ఆయననే అడగండి అని రాజేష్ భార్య చెప్తుంది. మాకు ఎటువంటి ఫంక్షన్ వద్దు ఆకలేస్తుంది కాస్త భోజనం పెట్టండి అని రాజేష్ వాళ్ళ అమ్మానాన్న బాధగా అడుగుతారు.. ఏంటిది కనీసం భోజనం కూడా పెట్టట్లేదా ఏం జరుగుతున్న అమ్మాయి ఇక్కడ అని బాలు రాజేష్ భార్య ని అడుగుతాడు.. రాజేష్ చేసిన పనికి బాలు షాక్ అవుతాడు ఇక ఆ అవమానం తట్టుకోలేక ఇంటికి వచ్చేస్తాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే… మీనా ను సత్యం ఫంక్షన్ ఎలా జరిగింది అని అడుగుతాడు.. మీరు చూడలేదు ఇలాంటి ఫంక్షన్ ని ఎప్పుడు చూడలేదు అని మీనా కావాలని వెటకారంగా మాట్లాడుతుంది.. సత్యం భార్యతో వెళ్తే విలువ వేరేలా ఉంటుంది. నువ్వు ఎక్కడికి వెళ్లినా ఈసారి భార్యతోనే వెళ్ళు అని సలహా ఇస్తాడు.. అయితే మీనా ఏంటి అక్కడ జరిగిందానికి వెటకారంగా మాట్లాడుతున్నావా అని బాలు అంటాడు.. ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకొని ఇలాంటివి ఇంకొకసారి జరగకుండా చూసుకోండి అని మీనా స్వీట్ వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది..బాలు తనకు జరిగిన అవమానాన్ని గుర్తు చేసుకుంటూ మందు తాగడానికి పైకి వెళ్తాడు.. తనలోని అంతరాత్మ బయటకు వచ్చి మీనా చెప్పింది వినకపోతే నీకు ఇలానే జరుగుతుంది అని పెద్ద క్లాస్ పీకుతుంది..

Advertisement

భార్య చెప్పిన మాట వినింటే నీకు ఇప్పుడు లక్ష రూపాయలు బొక్క ఏవి కాదు కదా ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు అని బాలు అంతరాత్మ బాలు పై సీరియస్ అవుతుంది. ఇప్పటికైనా నువ్వు బుద్ధి తెచ్చుకుని మీనా చెప్పినట్టు వింటే బాగుపడతావు. లేదంటే మాత్రం నీకు ఇలాంటివి లక్షలు తిప్పలు వస్తూనే ఉంటాయి అని చెప్పగానే నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. నా గురించి నాకు తెలుసు అని బాలు అప్పటికి కూడా మారకుండా అంటాడు. నువ్వు ఇక నుంచి వెళ్ళిపోతావా లేదా అని మందు సీసా అని తీసుకొని కొట్టగానే ఆ సీసా పగిలిపోతుంది. అది చూసిన బాలు అయ్యో ఈ టైంలో మందు కూడా దొరకదు కదా అనవసరంగా పగలగొట్టేసాను అని అనుకుంటాడు. ఆ తర్వాత సుమతి టెన్షన్ పడిపోతూ శివా కి కాల్ చేస్తుంది. శివ మాత్రం ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో వీడు ఎక్కడికి వెళ్ళాడో అర్థం కావట్లేదు అమ్మ అని కంగారు పడిపోతూ ఉంటారు.

అప్పుడే శివ రావడంతో ఎక్కడికి వెళ్లావు రా గుణ దగ్గరికి వెళ్ళావా ఏంటి అని సుమతి అడుగుతుంది.. ఎక్కడికి వెళ్తే నీకెందుకు నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని శివ అంటాడు.. ఇలా మొండిగా మాట్లాడవంటే చంప పగులుతుంది ఎక్కడికి వెళ్లావు చెప్పు.. అని సుమతి ఎంతగా అడిగినా సరే శివ మాత్రం అసలు నిజాన్ని చెప్పడు.. ఇక శివ దగ్గర వాసన వస్తుందని సుమతి అడుగుతుంది ఏంటి తాగొచ్చావా వాసన వస్తుంది ఏంటి అని సుమతి అంటుంది. నీ పని ఏదో నువ్వు చూసుకో నా పని ఏదో నేను చూసుకుంటాను. నేను రోజు మీ బావ లాగా తాగి రాలేదు కదా ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని శివ అంటాడు. ఆ మాటకు పార్వతి కన్నీళ్లు పెట్టుకుంటుంది.

Advertisement

తర్వాత రోజు ఉదయం రాజేష్ ఇంట్లోకి రావడానికి ఇబ్బంది పడిపోతూ ఉంటాడు. ఏమైంది ఎందుకురా ఇంట్లోకి రావడానికి అంతగా ఇబ్బంది పడిపోతున్నావ్ అంటే నీ దగ్గర తీసుకున్న లక్ష రూపాయలు తో నేను చేసిన పనికి సిగ్గుగా ఉంది రా అందుకే నేను ఇంట్లోకి రాలేకపోతున్నాను అని రాజేష్ అంటాడు.. అయినా చెప్తున్న మాటని నేను వినకుండా ఇలా చేశాను ఇప్పుడు అప్పుల పాలయ్యాను. భార్యలు చెప్పింది ఎప్పుడూ భర్తలు వినరు కదరా.. ఇకమీదట నుంచి నేను నా భార్య చెప్పిన మాట వింటాను అని రాజేష్ అంటాడు కానీ బాలు మాత్రం తన ఇగోను చంపకోడు. అయినా చెప్తే నేను ఎందుకు వినాలి అని వెటకారంగా మాట్లాడుతాడు..

 

ఆ తర్వాత మీనా ఆడపిల్లలకి చదివి ఎందుకు అని అన్నారంట కదా.. ఈ రోజుల్లో ఆడపిల్లలకి చదువు చాలా ముఖ్యం అది మీరు మర్చిపోతున్నారు అని అంటుంది. ఇకమీదట ఆడపిల్లలకి చదువు ఉండాలని అర్థమైంది అమ్మ. నేను పాపని మంచి స్కూల్లో జాయిన్ చేసి మంచిగా చదువుకునేలా చేస్తాను అని రాజేష్ అంటాడు. ఆడపిల్లలకు చదువుకుని ఎందుకు అని ఎందుకంటావ్ రా.. మా మనోజ్ గాన్ని చూసావా మా అమ్మ అవన్నీ డిగ్రీల మీద డిగ్రీలు చదివించింది ఏం చేశాడు. గుడి ముందర అడుక్కుతింటున్నాడు ఆడపిల్లలకు చదివిస్తే మనకి తోడుగా ఉంటారు అని బాలు అంటాడు. ఏం వచ్చినా సరే వీడు మాత్రం నా పరువు తీస్తున్నాడు అని మనోజ్ అనుకుంటాడు.

Also Read : సాగర్ పై నర్మద సీరియస్.. ప్రేమకు ధీరజ్ వార్నింగ్.. శ్రీవల్లికి టెన్షన్.. టెన్షన్..

ఇక తర్వాత రవి రెస్టారెంట్ కి వెళ్ళగానే అక్కడ కొత్త చెఫ్ కనిపించడంతో షాక్ అవుతాడు.. ఇక ఆ తర్వాత నా జాబ్ ఏమైంది? మీరెవరు అసలు అని రవి టెన్షన్ పడిపోతూ ఆ వచ్చిన ఆవిడను అడుగుతాడు. ఇక హోటల్ ఓనర్ దగ్గరికి వెళ్లి ఎవరినో నా ప్లేస్ లోకి తీసుకొని వచ్చారు. కనీసం నాకు చెప్పాలని కూడా లేదా మీకు అని అంటాడు. అయితే ఆ ఓనరు తన కూతురే ఆవిడని చెప్పడంతో రవి షాక్ అవుతాడు. ఆ అమ్మాయి వచ్చి రాగానే అతనిపై ప్రేమను కురిపిస్తుంది. అది చూసిన శృతి కుళ్ళుకుంటుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×