E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: బయటపడ్డ మనోజ్ మోసం.. రెచ్చిపోయిన సత్యం.. బుక్కయిన రోహిణి..

Gundeninda GudiGantalu Today episode: బయటపడ్డ మనోజ్ మోసం.. రెచ్చిపోయిన సత్యం.. బుక్కయిన రోహిణి..
Advertisement

Gundeninda GudiGantalu Today episode December 3rd: నిన్నటి ఎపిసోడ్ లో.. ప్రభావతి, కామాక్షి, మనోజ్ ముగ్గురు కలిసి ఒక స్వామీజీ దగ్గరికి వెళ్తారు.. ఆ స్వామీజీకి నిమ్మకాయ గురించి చెప్తారు.. అతను మంత్రించి మరొక నిమ్మకాయని ఇస్తాడు.. ఈ నిమ్మకాయని మీ ఇంట్లో నిమ్మకాయ దగ్గర పెట్టండి దాని పవర్ అంతా తగ్గిపోతుంది అని చెప్పగానే ప్రభావతి సంతోషపడుతూ ఆ నిమ్మకాయని తీసుకొని వస్తుంది. మనోజ్ ప్రభావతి ఆ నిమ్మకాయని ఎలాగోలాగా నిమ్మకాయ పక్కన పెట్టేస్తారు.. ఇక బాలు ఆ నిమ్మకాయను చూసి.. ఏంటి నా నిమ్మకాయ పక్కన ఇంకొక నిమ్మకాయ వచ్చింది అని కామెడీ చేస్తాడు. ఈ ఇంకో నిమ్మకాయ ఎక్కడి నుంచి వచ్చింది అని రోహిణి అడుగుతుంది. నా నిమ్మకాయ వచ్చేటప్పుడు కడుపుతో ఉంది. అదే కాస్త పని నుండి నిమ్మకాయని కన్నట్టుంది అని బాలు కామెడీ చేస్తాడు.. మొత్తానికి బాలు నిమ్మకాయ ఆటతో ప్రభావతి, మనోజ్ అడ్డంగా దొరుకుతారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. దొంగ చాటుగా నిమ్మకాయలను తీసుకొని వెళ్లడం ఇంట్లోని వాళ్ళందరూ చూసేస్తారు. అక్కడ ఉండాల్సిన నిమ్మకాయలు మీ చేతిలో ఎలా ఉన్నాయని సత్యం అడుగుతాడు. ఇలాంటి నిమ్మకాయలు ఇంట్లో ఉంటే భయంగా ఉంది అందుకనే వాటినిఇలాంటి నిమ్మకాయలు ఇంట్లో ఉంటే భయంగా ఉంది. అందుకనే వాటిని బయటపడేడానికి తీసుకెళ్తున్నామని ప్రభావతి అంటుంది.. ప్రభావతి మనోజ్ ఇద్దరు కూడా తప్పించుకోలేక అసలు అన్ని బయట పెడతారు. నువ్వు చేతగాని వెధవ మళ్ళీ తప్పు చేసావా నువ్వు ఇక మారవా అని సత్యం మనోజ్ నీ కొడతాడు. మధ్యలో అడ్డుగా వచ్చిన ప్రభావతిని కూడా కొడతానని అంటాడు.. నీవల్లే వీడిలా చెడిపోయాడు. ఇప్పుడు మీనా నగలు ఎలా తీసుకొస్తావో తీసుకురా అనేసి సత్యం వార్నింగ్ ఇస్తాడు.

Advertisement

ప్రభావతి ఎంత చెప్తున్నా కూడా సత్యం మాత్రం మాట వినకుండా మనోజ్ ని కొట్టి అసలు నిజాన్ని రాబడతాడు. ఇన్ని రోజులు మాకు నీ మీద అనుమానం ఉండేది అందుకే ఇలా చేసాము అని అంటారు. నగలు ఎందుకు తీసావురా అనేసి మనోజ్ సత్యం ఇద్దరు అడుగుతారు.. కానీ మనోజ్ మాత్రం ఏంట్రా నీ బోడి నగలు నీ డబ్బులు నీ మోహన కొడతాను ఒక నాలుగు రోజులు టైం ఇవ్వు అనేసి అంటాడు.. మాట వినగానే సత్యం రెచ్చిపోతాడు.. నువ్వు ఇక మారవారా? ఎప్పుడు రా నువ్వు మారతావు చెడ పుట్టావు కదరా అనేసి కొడతాడు. మధ్యలో వచ్చిన ప్రభావతిని నువ్వు మధ్యలోకి రావద్దు మీ సంగతి తర్వాత చెప్తాను అని అరుస్తాడు.

ప్రభావతి  వాడిని కొట్టి చంపేస్తారా ఏంటండీ అని ఎంత అడుగుతున్నా కూడా సత్యం మాత్రం తన టెంపర్ ని కంట్రోల్ చేసుకోలేడు.. ఎందుకిలా చేశావు అని కొడతాడు. రోహిణి ఆగండి మామయ్య కొట్టి చంపేస్తారా ఏంటి అని అడుగుతుంది.. ఏంటి ఈ విషయం గురించి నీకు ముందే తెలుసా అని నేను అడుగుతుంది.. నాకు నిన్ననే తెలిసింది అని రోహిణి అంటుంది. ఆ మాట వినగానే మీనా మీకు తెలిసి కూడా నువ్వు చెప్పలేదా అంటే నీ దొంగ మొగుడిని వెనకేసుకుని వచ్చావా అని అంటుంది. మీ ప్లేస్ లో నేనుంటే వేరేలా ఉండేది అని నేను అంటుంది.

Advertisement

బాలు మోసపోతే అందరూ గమ్మునున్నారు కదా.. మా ఆయన మోసపోతే మీ ఆయన లాగా ఇంట్లో చెప్పకుండా ఇంట్లో నగలు తీసుకెళ్లి డబ్బులు తీసుకురాలేదు.. మీ ఆయన లాగా నగలు ఎత్తుకెళ్లి మోసం చేయలేదు అని మీనా రోహిణికి దిమ్మ తిరిగేలా షాక్ ఇస్తుంది. ప్రభావతి ఏంటండీ మీరు ఈ పూల అమ్ముకునే దాని ముందు రా నన్ను అవమానిస్తారా అని అంటుంది.. నోరు ముయ్ నువ్వు నగలను మార్చి వాళ్ళ అమ్మ మాయం చేసిందని అంటావా..? అమ్మని మోసం చేసిందంటావా నీలాంటి దాంతో నేను కాపురం చేశానా..? పక్కలో పామును పెట్టుకొని ఎన్ని రోజులు ఉన్నానా అని సత్యం అంటాడు..

Also Read : ‘గుండె నిండా గుడిగంటలు ‘ బాలు బ్యాగ్రౌండ్.. ఐటీ జాబ్ వదిలేసి..

నేను పచ్చి మంచినీళ్లు ఇచ్చిన తీసుకోరు కదా నేను వెళ్ళిపోతాను అని రూమ్ లోకి వెళ్లి ప్రభావతి లాక్ చేసుకుంటుంది.. అందరూ కూడా ప్రభావతి రాలేదని టెన్షన్ పడుతూ ఉంటారు. తలుపు తీయకుండా లోపల ఉండిపోతుంది ప్రభావతి. సత్యం దగ్గరికి అందరూ వచ్చి మీరు వెళ్లి అతని పిలవండి తలుపు తీయట్లేదు అని ఎంతగా బ్రతిమలాడిన కూడా సత్యం మాట వినడు.. నన్ను ఇంట్లో ఉండమంటారా వెళ్ళిపొమ్మంటారా అని సత్యం అంటారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×