// // Gundeninda GudiGantalu Today episode: బాలు, మీనా రొమాన్స్.. పోటీలో ఓడిపోయిన మీనా.. మనోజ్ కు నిజం తెలిసిపోతుందా..? -->
E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: బాలు, మీనా రొమాన్స్.. పోటీలో ఓడిపోయిన మీనా.. మనోజ్ కు నిజం తెలిసిపోతుందా..?

Gundeninda GudiGantalu Today episode: బాలు, మీనా రొమాన్స్.. పోటీలో ఓడిపోయిన మీనా.. మనోజ్ కు నిజం తెలిసిపోతుందా..?
Advertisement

Gundeninda GudiGantalu Today episode December 31st: నిన్నటి ఎపిసోడ్ లో.. బాలు మీనా గెలిచారని ప్రభావతి ఫీల్ అవుతూ ఉంటుంది.. మనోజ్ రోహిణిలు వాళ్ళిద్దరు చెప్పిన సమాధానాలు ఆ తిక్క జడ్జిలకు అర్థం కాలేదు అందుకే వీళ్ళనే సెలెక్ట్ చేశారు అని అంటారు. వాడికి లక్ష రూపాయలు వస్తే దాన్ని కోటి రూపాయలు లెక్క ఫీల్ అయిపోతున్నాడు అని ముగ్గురు అనుకుంటారు. వాళ్ళ మాటలు విన్న బాలు కావాలనే వాళ్ళని రెచ్చగొట్టేలా మాట్లాడుతాడు.. మాకు అదైనా వచ్చింది మీకు అది కూడా రాలేదు కదా అని బాలు మీనా ఎంత చెప్తున్నా ఆగకుండా ఆడుకుంటాడు.

ఇక ప్రభావతి మీన బాలుల మధ్య పెద్ద యుద్ధమే జరుగుతుంది.. మనోజ్ పై మీనా కూడా సెటైర్లు వేస్తూ కోపం తెప్పిస్తుంది.. బాలు మీనా ఇద్దరు కూడా మనోజ్ ఓడిపోయాడని ఇన్ డైరెక్ట్ గా ఎగతాళి చేస్తారు. లక్ష రూపాయలకే ఏదో కోటి రూపాయలు వచ్చినట్టు బిల్డప్ ఇస్తున్నారు ఏంటి అని ప్రభావతి అంటుంది.. సత్యం గూబాలు డబ్బులు ఇస్తానని చెప్పినా కూడా సత్యం మాత్రం నాకొద్దు అని అంటాడు. ఈ మాట చాలురా నాకు కోటి రూపాయలు ఇచ్చినంత ఆనందంగా ఉంది అని సత్యం అంటాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. పోటీలో ఓడిపోయామని రవి, శృతి ఇద్దరూ కూడా బాధ పడిపోతూ ఉంటారు. నువ్వంటే నువ్వని ఒకరిపై ఒకరు తిట్టుకుంటారు.. ఇక బాలు మీనా మాత్రం రొమాన్స్ కు వేల అయిందని ఇద్దరు రెడీ అవుతూ ఉంటారు. బాలు మీనాని పొగుడుతూ పాటలు పాడుతూ తనని ఇంప్రెస్ చేసేస్తాడు. మీకా తర్వాత మనము ఒక రూమును కట్టుకోవాలి లేకుంటే మనమధ్య దూరం పెరిగేలా ఉంది అని బాలు అంటాడు.. ఇక రూము వచ్చిన తర్వాత ఎలా ఉండాలి అని బాలు అంటాడు. మీ నాతో ఎప్పుడెప్పుడు రొమాన్స్ చేద్దామని బాలు ట్రై చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో ఇద్దరు కలిసి పాటలు పాడుకుంటూ డాన్స్ వేస్తారు.. అప్పుడే అక్కడికి వచ్చిన ప్రభావతి విలన్ చూసి షాక్ అవుతుంది..

వచ్చింది కేవలం లక్ష రూపాయలు కదా ఎందుకు ఇంతగా బిల్డప్ ఇస్తున్నావు అని బాలుని ప్రభావతి అంటుంది. అయిన అర్ధరాత్రి ఈ డాన్సులు ఏంటి అని అడుగుతుంది. నువ్వు అర్ధరాత్రి ఎలా వస్తావని అస్సలు అనుకోలేదు కదా అని బాలు అంటాడు. ప్రతిరోజు నువ్వు ఇలా చేస్తూ ఉంటే మా మధ్య ఇంకేముంటుంది నా బొంద అని బాలు వెటకారంగా మాట్లాడుతాడు. మాట వినగానే ప్రభావతి నవ్వుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.

Advertisement

తర్వాత రోజు బాలు రూమ్ కట్టడానికని ఒక మనిషిని తీసుకొని వస్తాడు. మీ నాకు తెలిసిన మనిషి కావడంతో ఆ రూమ్ ఏమో తొందరగా అయిపోతుంది అని అనుకుంటారు. అయితే అతను రావడం చూసిన ప్రభావతి వాళ్ళు ఏం చేస్తున్నారా చూడాలని వాళ్లతో పాటు వెళుతుంది. ఈ జిల్లా కొలిచినా వ్యక్తి దాదాపు నాలుగు లక్షల అవుతుందని మొత్తం నాలుగు లక్షలు ఉంటే రూమ్ కట్టడానికి మొదలు పెడదామని అంటాడు. ఇప్పుడు లక్ష రూపాయలు ఇస్తామని ఎంతగా అన్న కూడా ఆ మేస్త్రి మాత్రం అంత కుదరదు బాలు మొత్తం ఒకేసారి ఇస్తే పనులు తొందరగా అయిపోతాయి అని అంటాడు.

అయితే నాలుగు లక్షలు ఇప్పటికిప్పుడు డబ్బులు ఎలా వస్తాయి అని బాలు అనుకుంటూ ఉంటాడు. ఏముంది మా అమ్మ మా నాన్న ఏం చెప్తే అది వింటుంది. మా అమ్మవి నగలు ఉన్నాయి కదా మా నాన్నని అడిగి ఇవ్వమని అడుగుతాను. ఆ నగలని తాకట్టు పెట్టుకొని డబ్బులు ఇస్తామని చెప్తాము. కానీ మనోజ్ లాగే డబ్బులు సరిపోలేదు అని అమ్మేద్దాం అప్పుడు తెలుస్తుంది. మా అమ్మకి అని వెతకారంగా బాలు మాట్లాడతాడు. ఊరుకోండి మీరు ఏం మాట్లాడుతున్నారు అని మీనా అంటుంది. అలా చేస్తే మీ అన్నయ్యకు మనకు పోలిక ఏంటి అని మీనా అంటుంది..

ఆ తర్వాత మీనా పూల కోసమని మార్కెట్కు వెళుతుంది. అక్కడ తన స్నేహితులతో మొగుడు వంట గురించి ఎలా మాట్లాడుతాడు అన్న విషయాల గురించి చర్చిస్తుంది. పెళ్లయిన కొత్తల్లో మనం ఏం చేసినా అమృతంలా ఉంటుంది.. ఇప్పుడు ఏం చేసినా అది చేదుగానే ఉంటుంది అని మొగుళ్ళ గురించి ఎబెట్టుగా మాట్లాడుతుంటారు.. మీనా మాత్రం మా ఆయన అలాంటివాడు కాదు. మా ఆయన చాలా మంచివాడు అని మీన పొగిడేస్తుంటుంది. అయితే నేను చెప్పినట్లుగా బీట్రూట్ దోస చేసి పెట్టు.. ఒకవేళ మీ ఆయన గనక అది నిజమే అని నేను నమ్మితే.. నీ వంట నువ్వు మెచ్చుకుంటే కచ్చితంగా మీ ఆయన చాలా గ్రేట్ అని నేను ఒప్పుకుంటాను అని అంటుంది. సరే కచ్చితంగా మా ఆయన నా వంటని మెచ్చుకుంటాడని నిరూపిస్తాను అని మీనా అంటుంది.

Also Read :బుధవారం టీవీ సినిమాలు.. వీటిని మిస్ అవ్వకండి..

తర్వాత రోజు మీనా బీట్రూట్ దోస చేస్తుంది. ఇంట్లోని వాళ్ళందరూ కూడా ఆ దోసె గురించి గొప్పగా పొగిడేస్తూ ఉంటారు. ఇలాంటి దోశని ఎప్పుడూ తినలేదు చాలా బాగుంది అని అంటాడు. అయితే ప్రభావతి కూడా బాగుంది పర్లేదు అంటూ పొగుడుతుంది. బాలు పైనుంచి కిందకి కోపంగా వస్తాడు. ఎలాగైనా సరే వాడి దగ్గర నుంచి డబ్బులు తీసుకోవాలి అని కోపంగా ఉంటాడు. వాడి దగ్గర నుంచి ఎలాగైనా డబ్బులు రాబట్టాలిరా లేకుండా అంటే వాడి సంగతి ఏంటో చూద్దామని మనోజ్ కి కౌంటర్ ఇస్తూ బాలు ఫోన్లో మాట్లాడుతాడు.. కానీ మీనా మాత్రం బాలు ఆ దోశ గురించి ఏం చెప్తాడు అని తన వెనకాలే తిరుగుతుంది.. బాలు మాత్రం ఏది చెప్పకుండా వెళ్ళిపోతాడు. అయితే మీనా జరిగిన విషయన్ని వాళ్ళతో చెప్తుంది నీకు ఇంకొక అవకాశం ఇస్తామని వాళ్లంటారు. రోహిణి చింటూ తో ఫోన్ మాట్లాడిన విషయం మనోజ్ కి తెలిసిపోతుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×