E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి కడుపుమంట..రోహిణి పై అనుమానం.. సత్యం కోసం బాలు నిర్ణయం..?

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి కడుపుమంట..రోహిణి పై అనుమానం.. సత్యం కోసం బాలు నిర్ణయం..?
Advertisement

Gundeninda GudiGantalu Today episode December 30th : నిన్నటి ఎపిసోడ్ లో.. పోటీ ముగిసింది ఇందులో పాల్గొన్న మూడు జంటల గురించి చెప్పాలి అని జడ్జీలు అంటారు.. అలాగే జడ్జిలు మూడు జంటలకి కొన్ని సలహాలు కూడా ఇస్తారు. ముందుగా రోహిణి మనోజ్ లను మీరు ఇంకా గొడవలు లేవు అనుకుంటున్నారు కాబట్టి మీ మధ్య ఏవో రహస్యాలు ఉంటున్నాయని అంటారు.. గొడవలు చికాకులు ఉంటేనే ఆ కాపురం సవ్యంగా సాగుతుంది అని జడ్జీలు అంటారు. ఆ తర్వాత రవి శృతి లు ఇంకా లవర్స్ లాగే ఉన్నట్లు అది ఫీలవుతున్నారు. వాళ్లు భార్యాభర్తలు అవ్వాలంటే ఇంకాస్త సమయం పడుతుంది అని వాళ్ళకి సలహా ఇస్తారు.. ఇక చివరిగా బాలు మీనాలపై ప్రశంసలు కురిపిస్తారు. వీళ్ళ లాంటి జంటని నేను ఎప్పుడు చూడలేదు నేను ఒక జడ్జిగా ఎన్నో జంటలకు విడాకులు ఇప్పించాను కానీ ఈ జంట లాంటి వారిని ఇదే మొదటిసారి చూడమని ఒక జడ్జ్ వాళ్లపై ప్రశంసలు కురిపిస్తారు. విన్నర్ గా బాలు, మీనాలను అనౌన్స్ చేస్తారు.. వాళ్లకి లక్ష రూపాయల చెక్కుని ఇస్తే బాలు మాత్రం డబ్బులు ఇలా ఇస్తారా వీటిని ఏం చేసుకోవాలి అని అడుగుతారు. అయితే మీ అకౌంట్ నెంబర్ ఇచ్చారు కదా మీ అకౌంట్లో డబ్బులు పడిపోతాయి

ఈ చెక్కు కేవలం ఫార్మాలిటీ కోసమని జడ్జిలు అంటారు. ఇక వాళ్ళు చాలా సంతోషంగా ఆ చెక్కును తీసుకొని ఇంటికి బయలుదేరుతారు బాజాల సౌండ్ వినిపించడంతో పెళ్లిళ్లు సీజన్ కూడా కాదు కదా ఎవరు డప్పుల సౌండ్ తో వస్తున్నారు అని ప్రభావతి అంటుంది. అంతలోకే పార్వతి సుమతి అక్కడికొస్తారు. ఏంటి వీళ్లు ఎలాగో ఓడిపోయారని తెలుసుకోవడానికి వచ్చారా ఏంటి అని ప్రభావతి అంటుంది. సౌండ్ విని బయటికి వెళ్ళగానే బాలు మీనా చెక్కుతో డాన్సులు వేసుకుంటూ ఇంటికొస్తారు. బాలు మీనా ఆ లక్ష రూపాయలు గెలిచారని చెప్పగానే ప్రభావతి దిమ్మతిరిగిపోయే షాక్ అవుతుంది. అప్పుడే బాలు మేళ తాళాల మధ్య తనకు వచ్చిన లక్ష రూపాయలు చెక్కులు తీసుకొని లోపలికి వస్తాడు.. ప్రభావతి కుళ్ళుకుంటుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. బాలు మీనా గెలిచారని ప్రభావతి ఫీల్ అవుతూ ఉంటుంది.. మనోజ్ రోహిణిలు వాళ్ళిద్దరు చెప్పిన సమాధానాలు ఆ తిక్క జడ్జిలకు అర్థం కాలేదు అందుకే వీళ్ళనే సెలెక్ట్ చేశారు అని అంటారు. వాడికి లక్ష రూపాయలు వస్తే దాన్ని కోటి రూపాయలు లెక్క ఫీల్ అయిపోతున్నాడు అని ముగ్గురు అనుకుంటారు. వాళ్ళ మాటలు విన్న బాలు కావాలనే వాళ్ళని రెచ్చగొట్టేలా మాట్లాడుతాడు.. మాకు అదైనా వచ్చింది మీకు అది కూడా రాలేదు కదా అని బాలు మీనా ఎంత చెప్తున్నా ఆగకుండా ఆడుకుంటాడు. ఇక ప్రభావతి మీన బాలుల మధ్య పెద్ద యుద్ధమే జరుగుతుంది.. మనోజ్ పై మీనా కూడా సెటైర్లు వేస్తూ కోపం తెప్పిస్తుంది.. బాలు మీనా ఇద్దరు కూడా మనోజ్ ఓడిపోయాడని ఇన్ డైరెక్ట్ గా ఎగతాళి చేస్తారు.

ఆడ వచ్చింది లక్ష ఏదో కోటి రూపాయలు అక్క ఫీల్ అవుతున్నావ్ ఏంటి అని ప్రభావతి అంటుంది.. నేను ఒక్కరోజులో లక్ష రూపాయలు సంపాదించాను కచ్చితంగా కోటి రూపాయలు కన్నా ఎక్కువే నాకు అని బాలు అంటాడు. నాన్న నీకు ఈ లక్ష రూపాయలు ఇస్తాను నీ ఇష్టం వచ్చింది చేసుకొని బాలు అంటాడు. అవును మరి అవి కోట్లు మరి మీరు తీసుకోవాల్సిందే అని ప్రభావతి వెటకారంగా మాట్లాడుతుంది. కానీ బాలు మాత్రం ఈ చెక్క ముక్క కాదు నా అకౌంట్లో డబ్బులు పడగానే మా నాన్నకే ఇచ్చేస్తాను అని అంటాడు. కానీ సత్యం మాత్రం నాకు ఏ డబ్బులు అవసరం లేదు రా.. నువ్వు అన్న మాట నాకు చాలు కోటి రూపాయలు కన్నా ఎక్కువ విలువైంది ఆ మాటే అని అంటాడు.

Advertisement

అదేంటండీ వాడు లక్ష రూపాయలు ఇస్తానన్నాడు కదా తీసుకోవచ్చు కదా అని ప్రభావతి అంటుంది.. ఈ లక్ష రూపాయలతో నువ్వు గదిని కట్టాలనుకున్నావు కదా దానికి ఉపయోగించు అని సత్యం సలహా ఇస్తాడు. ఈ లక్ష రూపాయలతో గదిని కట్టినట్టే అని ప్రభావతి కావాలని రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది.. ఆ మాట వినగానే బాలు ఇంకాస్త రెచ్చిపోయి మాకు లక్షల మింగడం రాదు కదా.. మీరు లక్షలను ఎలా మింగాలో నేర్పించాలి అని వెటకారంగా మాట్లాడుతాడు.. ఎప్పటికైనా మనోజు మమ్మల్ని విమానంలో తిప్పుతాడు అని ప్రభావతి సంతోషంగా ఉంటుంది.. అవును వాడు తిప్పుతాడు ఉన్న లక్షల అన్ని తీసుకొని వెళ్లి ఇప్పుడు వాడే తిప్పల్లో పడ్డాడు అని సత్యం అంటాడు.

సరే రా మీనా మన పైకి వెళ్దాం అక్కడ గదిని ఎక్కడ కట్టాలో ఈ చెక్కుతో ఎంతవరకు వస్తుందో చూద్దాం రా అనేసి బాలు మీనా పైకి వెళ్ళిపోతారు. అయితే మనోజ్ రోహిణి లు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు.. మనము మంచి దంపతులకు కాదా. అత్తయ్య ఎప్పుడూ లేనిది ఇలా మన మీద అనుమానపడుతుంది ఏంటి..? మనం నిజంగానే ఆదర్శ దంపతులకు కాదా అని రోహిణి మనోజ్ ని అడుగుతుంది.. మనం ఆదర్శ దంపతులమే నువ్వు ఎప్పుడూ ఏది ఇలా అనుకోవద్దు అని అంటారు.. ఇక తర్వాత రవి శృతిలిద్దరూ కూడా మనం బెస్ట్ కపుల్ కాలేకపోయాము నీవల్లే అని ఇద్దరు ఒకరినొకరు తిట్టుకుంటూ కొట్టుకుంటారు..

Also Read : ‘పొదరిల్లు’ టీఆర్పీ రేటింగ్.. డిసెంబర్ నెల హైలెట్ ఎపిసోడ్స్…

ఆ తర్వాత రవి శృతి గొడవని ఆపేసి పడుకోవాలని అనుకుంటారు. బాలు మీనా మాత్రం రొమాన్స్ సుకువేలు అయిందని ఇద్దరు రెడీ అవుతూ ఉంటారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్లో రోహిణి తన బాబుకి డ్రెస్ కొనాలని షాప్ కి వెళ్తుంది. అయితే అదే షాప్ కి ప్రభావతి కామాక్షి కూడా వెళ్తారు. అక్కడ ఉన్న షాప్ అతను మీ కొడుకుకి మంచి బట్టలు తీసుకున్నారు అని అంటాడు.. అది విన్న ప్రభావతి షాక్ అవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×