// // Gundeninda GudiGantalu Today episode: ఓడిపోయిన ప్రభావతి.. జడ్జిలను మెప్పించిన మీనా, బాలు.. విన్నర్ ఎవరంటే..? -->
E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: ఓడిపోయిన ప్రభావతి.. జడ్జిలను మెప్పించిన మీనా, బాలు.. విన్నర్ ఎవరంటే..?

Gundeninda GudiGantalu Today episode: ఓడిపోయిన ప్రభావతి.. జడ్జిలను మెప్పించిన మీనా, బాలు.. విన్నర్ ఎవరంటే..?
Advertisement

Gundeninda GudiGantalu Today episode December 26th : నిన్నటి ఎపిసోడ్ లో.. బాలు మాత్రం లోపలికి వెళ్లగానే ఆడుకుంటాడు..మనోజ్ గురించి చెప్పగానే మనోజ్ పరువు కూడా బాలు తీసేస్తాడు.. ఆ తర్వాత అందరూ కలిసి తమలోని టాలెంట్ ని చూపించాలని యాంకర్ అడుగుతుంది. ముందుగా రోహిణి బ్యూటిషన్ అని చెప్పగానే ఒక అతని పిలిపించి ఆమెతో మేకప్ చేయిస్తారు. ఆ తర్వాత శృతి గయ్యాళి అత్త స్టోరీ గురించి అక్కడ మిమిక్రీ చేసి చూపిస్తుంది. ప్రభావతి, మీనాల గొంతుతో శృతి మాట్లాడంతో ప్రభావతి షాక్ అయిపోతుంది.. ఆ తర్వాత అందరూ కలిసి తమలోని టాలెంట్ ని చూపిస్తారు.. ఇక అందరూ కూడా ఆ పోటీల్లో ఎలాగైనా సరే పాల్గొనాలని అనుకుంటారు. లక్షను సొంతం చేసుకోవాలని ప్రభావతి కూడా చాలా ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉంటుంది.. అక్కడున్న వాళ్ళు గేమ్స్ ఉంటాయని చెప్తారు..

అందులోని రౌండ్ ల గురించి వివరిస్తారు.  వాళ్ళు చెప్పినట్లుగా ముందుగా డబ్ స్మాష్ రౌండ్ ఉంటుంది.. అందులో ప్రతి ఒక్కరు కూడా సినిమా పేర్లను చక్కగా గెస్ చేస్తారు. ముందుగా వెళ్లిన రోహిణి మనోజ్ ఇంటి దొంగ అన్నా పేరుని గెస్ చేస్తారు.. ఆ తర్వాత శృతిర వీలు కూడా చక్కగా గెస్ చేస్తారు. మీనా బాలు కూడా తమకిచ్చిన పేరుని చెప్తారు. ఆ తర్వాత ప్రభావతి సత్యం కూడా మంచిగా గెస్ చేస్తారు. ఇక చివరిగా రంగ కామాక్షి ఇద్దరు చెప్పలేకపోతారు.. ప్లవర్ ఇచ్చి ప్రపోజ్ చేసే రౌండ్ లో ప్రభావతి నడుము విరగొట్టుకుంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. నిన్ను ఎత్తుకోవడం నావల్ల కాదు.. నిన్ను ఎత్తుకుంటే నా పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు అని సత్యం అంటాడు.. అయితే ప్రభావతి మాత్రం జడ్జిల దగ్గరికి వెళ్లి నేను కుర్చీపై నిలబడుకొని ఫ్లవర్ ని అందుకొని మా ఆయనకి ప్రపోజ్ చేస్తాను అని రిక్వెస్ట్ చేస్తుంది. వాళ్లు ప్రభావతి చెప్పిన దానికి ఒప్పుకుంటారు.. ప్రభావతి ఆ పువ్వుని అందుకునే టైంలో సత్యం తుమ్ముతాడు.. దాంతో ప్రభావతి కింద పడిపోతుంది. ఆమె నడుముకి గాయం తగులుతుంది. ప్రభావతికి ఏమైందని అందరూ టెన్షన్ పడిపోతూ ఉంటారు.. ముగ్గురు కోడళ్లు ప్రభావతి కింద పడగానే స్టేజ్ మీదకి పరిగెత్తుకొని వెళ్తారు..

ప్రభావతి నడుముల విరిగా ఈరోజు దేవుడు అంటూ టెన్షన్ పడిపోతూ ఉంటుంది. సత్యం ప్రభావతికి ఏమైందో అని కంగారు పడిపోతూ ఉంటాడు. కింద ఉన్న వాళ్ళందరూ అయ్యో ఇలా జరిగింది ఏంటి అని అనుకుంటారు. అత్తయ్య గారు పరిస్థితి చూస్తుంటే చాలా జాలిగా ఉంది ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తారు ముగ్గురు కోడళ్లు.. మీనా మాత్రం వన్ టూ త్రీ అని నేను అంటాను మీరు గట్టిగా అత్తయ్య గారిని లాగండి అని అంటుంది. మీనా ఎప్పుడైతే నెంబర్స్ చెప్తుందో శృతి రోహిణి ఇద్దరు కూడా ప్రభావతిని గట్టిగా వెనక్కి లాగుతారు. దాంతో ప్రభావతి సెట్ అయిపోతుంది.

Advertisement

మీరు అనుకున్నట్లు ఏమి లేదు కదా.. మీకు ఇప్పుడు బాగానే ఉందా అని మీనా అడుగుతుంది. ప్రభావతి నొప్పి ఏమీ లేదు అని చెప్తుంది. ఇక అందరూ కలిసి స్టేజి మీద నుంచి దిగేసి కిందకి వెళ్లిపోతారు. మనం ఈ పోటీలో ఓడిపోతామని నాకు అర్థం అయిపోయింది వదిన నువ్వు ఓడిపోయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఈ టైం కోసం వెయిట్ చేస్తున్నానని కామాక్షి అంటుంది. అదేంటి ఇంత రాక్షసానందం ఎందుకు అని ప్రభావతి అంటుంది. మనము మన వయసుకు తగ్గట్లు చేసుకోవాలి. నేను ఓడిపోయినప్పుడు నువ్వు ఎలాగైతే నువ్వేవో నువ్వు ఓడిపోయినందుకు నేను కూడా నవ్వేస్తున్నాను అని కామాక్షి అంటుంది.

ఇక మన ఓడిపోయాం కదా ఇక్కడ ఎందుకు వెళ్ళిపోదాం పదండి అని సత్యం అంటాడు. ప్రభావతి రోహిణి మనోజ్ మీరిద్దరూ లక్ష రూపాయలు తీసుకొని ఇంటికి రావాలి అని చెప్తుంది. సత్యం మాత్రం మీనా బాలు ఇద్దరు లక్ష రూపాయలు తీసుకుని ఇంటికి రావాలని చెప్తాడు.. అక్కడి నుంచి సత్యం కామాక్షి రంగా ప్రభావతి వెళ్ళిపోతారు. ఇక స్టేజ్ మీదకు వచ్చి మనసులోని మాట చెప్పాలని జడ్జిలు చెప్తారు. మీ భార్యని మీరు ఎంతగా ప్రేమిస్తున్నారో కలలోకి చూస్తూ నిజాలు చెప్పాలి అని అనగానే ముందుగా మనోజ్ రోహిణి ఇద్దరు కూడా ఎమోషనల్ అయిపోతారు.. ఆ తర్వాత వచ్చిన శృతి రవి ఒకరినొకరు తిట్టుకొని వెళ్లిపోతారు.

Also Read : ‘ ఇంటింటి రామాయణం ‘ శ్రీయ రియల్ లైఫ్ లో కష్టాలు.. కన్నీళ్లు తెప్పించే స్టోరీ..

చివరగా వచ్చిన మీనా బాలు మాత్రం జడ్జిలను మెప్పిస్తారు. నిజమైన ప్రేమ ఉన్న జంటలు కళ్లతో ఎలా మాట్లాడుకుంటారో చూపించారు.. ఒకరి మనసులో మరొకరు ఏమనుకుంటున్నారో ఇద్దరూ ఒకేలా రాసి అక్కడ ఉన్న జడ్జిలను ఇంప్రెస్ చేశారు. ఇప్పుడు రెండు కూడా మూడు జంటలు సక్సెస్ఫుల్గా పూర్తి చేస్తాయి. అక్కడున్న వాళ్ళందరూ కూడా మీనా బాలు గెలవాలని కోరుకుంటారు. ఇక నాలుగో రౌండు మీ డ్రీమ్ హోస్ అని యాంకర్ చెప్పగానే మీనా బాలు ఇద్దరు కూడా తమ గురించి ఆలోచించుకుంటారు. మొత్తానికి వాళ్లు అనుకున్న డ్రీం హౌస్ ని కట్టి జడ్జిలను ఇంప్రెస్ చేస్తారు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో బాలు మీనా విన్నర్ గా నిలుస్తారు.. ఆ తర్వాత ప్రభావతి రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×