E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: పోటీలో పాల్గొన్న మీనా, బాలు.. రోహిణిని బుక్ చేసిన బాలు.. ప్రభావతికి దిమ్మతిరిగే షాక్..

Gundeninda GudiGantalu Today episode: పోటీలో పాల్గొన్న మీనా, బాలు.. రోహిణిని బుక్ చేసిన బాలు.. ప్రభావతికి దిమ్మతిరిగే షాక్..
Advertisement

Gundeninda GudiGantalu Today episode December 24th : నిన్నటి ఎపిసోడ్ లో.. రవి మా రెస్టారెంట్లో కపుల్స్ కోసం ఒక కాంటెస్ట్ ఏర్పాటు చేస్తారు. అందులో పాల్గొనే జంటలల్లో ఎవరు బెస్ట్ కపుల్ గా అనిపిస్తారో వాళ్ళు ప్రైజ్ మనీ గెలుచుకోవచ్చు అని అంటారు. ఇలాంటివన్నీ మాకెందుకు మాకేం అవసరం లేదు అని ప్రభావతి అంటుంది. కామాక్షి మాత్రం మీ అత్తయ్య కూడా పాల్గొనవచ్చా అని అంటుంది. వయసుతో సంబంధం లేదు వాళ్ళ మధ్య ఉన్న అన్యోన్యత గురించి చెప్పి అక్కడ వాళ్ళని మెప్పించాలి అని రవి అంటాడు. కానీ ఎవరికి వారే మేం రాలేము అని అనుకుంటారు. శృతి మీరు వస్తారేమో ప్రైజ్ మనీ లక్ష రూపాయలు మనకే వస్తుందని అనుకున్నాను అని అంటుంది.

ఏంటి లక్ష అని ప్రభావతి షాక్ అవుతుంది. మనోజ్ నాలాంటి బిజినెస్ మాన్లు ఇలాంటి పోటీలో పాల్గొనలేరు అని అంటాడు.. ఇక బాలు మీనా కూడా ఎన్ని కష్టాలు పెడతారో అని బాలు కూడా పోటీలో పాల్గొనమని వెళ్లిపోతారు.. ప్రభావతి కామాక్షి మాత్రం ఈ పోటీలో ఎలాగైనా పాల్గొని లక్ష రూపాయలు కొట్టేయాలని అనుకుంటారు.. మనోజ్ రోహిణి పోటీలో పాల్గొనేందుకు వస్తారు. సత్యం ప్రభావతి కూడా పోటీలో పాల్గొనేందుకు వస్తారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. మనోజ్, రోహిణి రవి, శృతిలకు అడ్డంగా దొరికిపోతారు. నిన్న ఏవేవో కోతలు కోసవు ఇప్పుడు మాత్రం ఈ పోటీకి వచ్చావు అని రవి మనోజ్ ని అంటాడు. మొత్తానికి వాళ్ళిద్దరూ లోపలికి వెళ్ళిపోతారు. తర్వాత ప్రభావతి సత్యం కూడా అక్కడికి వస్తారు. కామాక్షి రంగా కూడా రావడం చూసి వాళ్ళిద్దరూ షాక్ అవుతారు.. ఏంటి కామాక్షి వాళ్ళ చెల్లెలు లాగా ఈవిడ ఉంది అని ప్రభావతితో అడుగుతుంది. కామాక్షి వాళ్ళ చెల్లెలు కాదు అక్కడ ఉన్నది కామాక్షినే అని ప్రభావతి అంటుంది. ఇంకా మాత్రం మనం ఇంతగా రెడీ రావడం అవసరమా అని తిట్టుకుంటూ వస్తారు…

ఇక మొత్తానికి రెండు గంటలు కలిసి లోపలికి వెళ్ళిపోతారు. ఆ ఇద్దరు జంటల్ని చూసినా రవి శుద్ధి ఇద్దరు కూడా షాక్ అవుతారు. రాత్రి మీ ఇద్దరూ మేము వయసులో ఉన్న వాళ్ళం కాదు కదా మేము ఎలా రావాలి అని అన్నారు కదా ఇప్పుడు ఎలా వచ్చారు అని శృతి ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంది. రాత్రి లక్ష్యాన్ని చెప్పగానే దానికోసమే ఇప్పుడు వచ్చినట్లుంది అని కామాక్షి ప్రభావతి పై సెటైర్లు వేస్తుంది. అక్కడ బుక్కులో మనోజ్ రోహిణిల పేర్లు చూసి సత్యం షాక్ అవుతాడు. ఇక అందరూ కలిసి లోపలికి వెళ్ళిపోతారు.. లోపల ఉన్న మనోజ్ రోహిణి చూసి ప్రభావతి ఏంట్రా చెప్పకుండా వచ్చేసావ్ అని అడుగుతారు..

Advertisement

నువ్వు కూడా గుడికి అని చెప్పావు కదా ఇలా వచ్చేసావు అని మనోజ్ అంటాడు. దానికి సత్యం అంతా లక్ష్యం మహిమా అని అంటాడు.. ఇక బాలు మీనా పోటీకి వస్తున్నట్లు ఫోన్ చేసి చెప్తారు. మేము రాత్రి వద్దనుకున్నాం కానీ ఇప్పుడు వద్దామని అనుకున్నాం. ఈ విషయం మీకు చెబుదామనుకుంటే ఎవరు ఇంట్లో లేరు అని బాలు అంటారు. ఇంట్లోని వాళ్ళందరూ వచ్చేసారు అని అనగానే ఏంటి అందరూ వచ్చారా అని బాలు అడుగుతాడు.. మీరు లోపలికి వెళ్లి చూస్తే మీకే అర్థమవుతుంది అని రవి అంటాడు.

అక్కడికి వెళ్ళగానే అందరిని చూసిన బాలు షాక్ అవుతాడు.. లక్షావతి వచ్చింది అని బాలు అనగానే మీనా లక్షవతి మాత్రమే కాదు.. లక్షల మింగేవాడు కూడా మీ అన్నయ్య వచ్చాడు అని అంటుంది.. ఏంటి గుడికి వెళ్లాలని ఏదేదో అన్నావు ఇప్పుడేంటి ఇలా వచ్చావు అని ప్రభావతిపై బాలు సెటైర్లు వేస్తాడు. మొత్తానికి అందరూ కలిసి లోపల సందడిగా ఉంటారు.. లోపలికి వెళ్ళగానే బాలు చేసిన హడావిడి అంతా ఇంతా కాదు.. అక్కడున్న వాళ్ళందరూ ప్రోగ్రాం ని స్టార్ట్ చేస్తున్నట్లు చెప్తారు.. అందరూ జంటల్ని పరిచయం చేసుకోవాలని యాంకర్ అనుకుంటుంది.. అందర్నీ పరిచయం చేసినప్పుడు మనోజ్ రోహిణి బాలులపై సెటైర్లు వేస్తాడు. రోహిణి పార్లర్ గురించి చెప్పగానే అది అమ్మేసింది కదా అని పరువు తీస్తాడు.

Also Read :బుధవారం టీవీ సినిమాలు.. ఆ సినిమాలను అస్సలు మిస్ చెయ్యకండి..

మనోజ్ గురించి చెప్పగానే మనోజ్ పరువు కూడా బాలు తీసేస్తాడు.. ఆ తర్వాత అందరూ కలిసి తమలోని టాలెంట్ ని చూపించాలని యాంకర్ అడుగుతుంది. ముందుగా రోహిణి బ్యూటిషన్ అని చెప్పగానే ఒక అతని పిలిపించి ఆమెతో మేకప్ చేయిస్తారు. ఆ తర్వాత శృతి గయ్యాళి అత్త స్టోరీ గురించి అక్కడ మిమిక్రీ చేసి చూపిస్తుంది. ప్రభావతి, మీనాల గొంతుతో శృతి మాట్లాడంతో ప్రభావతి షాక్ అయిపోతుంది.. ఆ తర్వాత అందరూ కలిసి తమలోని టాలెంట్ ని చూపిస్తారు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×