E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: జ్యోతిష్యుడు మాట విన్న మనోజ్.. ప్రభావతికి దిమ్మతిరిగే షాక్.. లక్ష కోసం ప్రభావతి ఆశ..

Gundeninda GudiGantalu Today episode: జ్యోతిష్యుడు మాట విన్న మనోజ్.. ప్రభావతికి దిమ్మతిరిగే షాక్.. లక్ష కోసం ప్రభావతి ఆశ..
Advertisement

Gundeninda GudiGantalu Today episode December 22nd : నిన్నటి ఎపిసోడ్ లో.. ఆ లెటర్ ఇచ్చి స్వామిని కలుద్దాం లోపలికి వెళ్దాం పద అని అంటాడు. ఆ స్వామిజి ఆ లెటర్ ను చూసి నీ చుట్టూ ఉన్నవాళ్లే నీకు కీడు చేయాలని చూస్తున్నారు. నువ్వు జాగ్రత్తగా ఉండాలి లేకపోతే మళ్లీ గుడి దగ్గర అడుక్కునే పరిస్థితి వస్తుంది అని స్వామీజీ అనగానే మనోజ్ పై పడిపోతాడు… నేను చెప్పినట్లు గనుక నువ్వు కొన్ని రోజులు ఈ కలర్ లో ఉన్న డ్రస్సులను వేసుకుంటే నీ పరిస్థితి దూరమవుతుందని అతను అంటాడు. మనోజు చాలా సంతోషంగా ఫీల్ అవుతాడు. నేను రోజు అలా కలర్ డ్రెస్సులు వేసుకుంటే ఇంట్లో వాళ్లకి అనుమానం వస్తుంది ఏమో అని మనోజ్ అడుగుతాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. స్వామీజీ దగ్గరకు వెళ్లిన ఆయన చెప్పినట్లు చెయ్యడానికి ఒప్పుకుంటాడు. నువ్వు నేను చెప్పినట్టు చేయకుంటే మాత్రం కచ్చితంగా ప్రమాదంలో పడతావు అని స్వామీజీ హెచ్చరిస్తాడు.. మనోజ్ చేసేది ఏమీ లేక మీరేం చెప్తే అది చేస్తాను నాకు ఈ గండం నుంచి బయటపడండి అని అంటాడు.. అక్కడినుంచి మణికంఠను తీసుకొని వెళ్ళిపోతాడు మనోజ్. బాలు ఇంటికి వచ్చేటప్పుడు ఒక డబ్బాని తీసుకొని వస్తాడు. ఏంటి వినాయకుడు చందాల కోసం డబ్బాలు తెచ్చినట్టు అలా ఉందేంటి అని ప్రభావతి అంటుంది.. ఆ మాట వినగానే బాలు గుడి ముందర అడుక్కోవడం అలాంటివి మాకు రావు మీ పెద్ద కొడుకు వచ్చినంతగా మేము అంత ఎక్స్పీరియన్స్ కాదులే అని అంటాడు. మేము ఇంటిపై గదిని కట్టాలని అనుకుంటున్నాం కదా.. దానికోసం డబ్బులను దాచిపెట్టడానికి ఈ హుండీని తీసుకొచ్చాను అని బాలు అంటాడు.

Advertisement

అప్పుడే అమ్మా అంటూ మనోజ్ పిలుస్తాడు.. నువ్వేంట్రా షర్టు లేకుండా వచ్చావు అని ప్రభావతి అడుగుతుంది.. దీక్షమ్మ మాల అందుకే ఇలా వచ్చాను అని మనోజ్ అంటాడు.. నేను పెద్ద ప్రమాదం నుంచి బయటపడాలంటే ఇలా ఉండాలి మాత అని ప్రభావతిని అంటాడు. మనోజు మాత అని అమ్మను అన్నాడు తాత అని నాన్న అనలేదు అని సెటైర్లు వేస్తాడు.. దేవుడి దగ్గర దండం పెట్టుకొని గదిలోకి వెళ్లి పోతాడు మనోజ్.. చూసావా ఎలాంటి అవతారం ఎత్తాడు అని బాలు ప్రభావతికి దిమ్మ తిరిగిపోయేలా సమాధానం చెప్తాడు..

ఇదంతా కాదు నాన్న నేను పైన గదిని కట్టడానికి డబ్బులను పోగేసుకునేందుకు ఈ హుండీని నేను తీసుకుని వచ్చాను. మీరు ముందు ఇందులో డబ్బులు వేసి ఆశీర్వదించండి అని బాలు అడుగుతాడు.. ఆ తర్వాత ప్రభావతిని కూడా అందులో డబ్బులు వేయమని అడుగుతాడు.. కానీ సత్యం డబ్బులు వేస్తుంటే మీ డబ్బులు కాదు నాన్న మా డబ్బులు ఇందులో మీ చేత్తో వేయండి అని అడుగుతాడు.. పక్కనే ఉన్న ప్రభావతిని నువ్వు వేయవా అని సత్యం అడుగుతాడు.. ఇద్దరు కలిసి ఆ హుండీలో డబ్బులు వేస్తారు..

Advertisement

బాలు మాత్రం మౌనిక ఎందుకు అలా అన్నది అని ఆలోచిస్తూ ఉంటాడు. ఈ విషయం నాన్నతో చెప్తే నాన్న చాలా బాధపడుతాడు అని తనలో తానే బాధపడుతూ ఉంటాడు. ఒకసారి మౌనిక ఫోన్ చేస్తే బాగుండు అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇప్పటివరకు ఫోన్ చేయలేదు కాబట్టి నేను ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్లేసి వస్తాను అని మీ నాతో అంటాడు.. ఈయన వాళ్ళ ఇంటికి వెళ్తే మనోజ్ కాపురం గురించి బయట పడిపోతుంది ఏమో అని మీనా భయపడుతుంది. మౌనిక నాకు ఫోన్ చేసిందండి మొన్న కార్తీక పౌర్ణమి రోజు గొడవ జరిగింది కదా వాళ్ళ ఆయన ఇంకా కోపంగా ఉన్నాడంట అందుకే మీకు ఫోన్ చేయలేదని చెప్పింది. మీరేమీ కంగారు పడకండి చాలా సంతోషంగానే ఉంది అని మీనా ఏదో ఒక అబద్ధం చెప్పేసి బాలుని కంట్రోల్ చేస్తుంది.

రోహిణి గదిలోకి వెళ్లి చూడగానే తన అవతారం చూసి షాక్ అవుతుంది.. ఏంటి అవతారం ఏంటి అంటే నేను ఇప్పుడు ఈ గండం నుంచి బయటపడడానికి ఇదే కరెక్ట్ అని రోహిణి తో అంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన ప్రభావతితో నేను ఈ గండం నుంచి బయట పడాలంటే ఇలాగే ఉండాలి అమ్మ అనేసి అంటాడు. ఆ తర్వాత కామాక్షి ప్రభావతి ఇద్దరూ కింద కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. అక్కడకు వచ్చిన బాలు ప్రభావతి చెప్పిన అంతా అబద్ధమే అని అంటాడు. ఆ మాట వినగానే ప్రభావతి షాక్ అవుతుంది. అప్పుడు అక్కడికి వచ్చిన రవి శృతిలు మీకు ఒక విషయం చెప్పాలి అని అంటారు.. బాలు రవిని ఒక ఆట ఆడుకుంటాడు.

రవి మా రెస్టారెంట్లో కపుల్స్ కోసం ఒక కాంటెస్ట్ ఏర్పాటు చేస్తారు. అందులో పాల్గొనే జంటలల్లో ఎవరు బెస్ట్ కపుల్ గా అనిపిస్తారో వాళ్ళు ప్రైజ్ మనీ గెలుచుకోవచ్చు అని అంటారు. ఇలాంటివన్నీ మాకెందుకు మాకేం అవసరం లేదు అని ప్రభావతి అంటుంది. కామాక్షి మాత్రం మీ అత్తయ్య కూడా పాల్గొనవచ్చా అని అంటుంది. వయసుతో సంబంధం లేదు వాళ్ళ మధ్య ఉన్న అన్యోన్యత గురించి చెప్పి అక్కడ వాళ్ళని మెప్పించాలి అని రవి అంటాడు. కానీ ఎవరికి వారే మేం రాలేము అని అనుకుంటారు. శృతి మీరు వస్తారేమో ప్రైజ్ మనీ లక్ష రూపాయలు మనకే వస్తుందని అనుకున్నాను అని అంటుంది. ఏంటి లక్ష అని ప్రభావతి షాక్ అవుతుంది.

Also Read : బిగ్ బాస్ షోకు రవితేజ గెస్ట్ గా ఎన్ని సార్లు వచ్చాడో తెలుసా..?

నాలాంటి బిజినెస్ మాన్లు ఇలాంటి చిన్న వాటికి వెళ్లడం కరెక్ట్ కాదు అని మనోజ్ అక్కడే వదిలేసి వెళ్ళిపోతాడు. గదిలోకి వెళ్లిన మనోజ్ రోహిణి తో ఈ పోటీలో ఎలాగైనా సరే గెలవాలి అని అంటాడు.. తర్వాత ఈ పోటీలో మనం ఎలాగైనా సరే పాల్గొనాలి అని రోహిణి తో అంటాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో అన్ని జంటలు కలిసి ఆ పోటీలో పాల్గొనేందుకు వెళ్తాయి.. మరి విన్నర్ గా నిలుస్తుందో చూడాలి…

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×