E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: సత్యం మాటతో సుశీల షాక్.. మీనాకు ప్రభావతి క్షమాపణలు చెప్తుందా..? ఇదే అసలు ట్విస్ట్..

Gundeninda GudiGantalu Today episode: సత్యం మాటతో సుశీల షాక్.. మీనాకు ప్రభావతి క్షమాపణలు చెప్తుందా..? ఇదే అసలు ట్విస్ట్..
Advertisement

Gundeninda GudiGantalu Today episode December 14th: నిన్నటి ఎపిసోడ్ లో.. డబ్బింగ్ స్టూడియోలో పురిటి నొప్పుల గురించి డబ్బింగ్ చెప్పి వచ్చిన శృతి నిజంగానే ఇంత నొప్పి ఉంటుందా చాలా భయంగా ఉంది అంటూ టెన్షన్ పడుతూ ఇంటికి వస్తుంది. మీనా అమ్మవడం మరో జన్మని పెద్ద క్లాసులు పీకుతుంది. ఇక రోహిణి మాత్రం తన పర్సనల్ ఎక్స్పీరియన్స్ ని బయటపెట్టి అడ్డంగా దొరికిపోతుంది. బిడ్డను కనేంతవరకు ఎన్ని నొప్పులు పడాలో అన్ని నొప్పులు పడతారు. చాలా పెయిన్ ఫుల్ గా రోహిణి చెప్పడం విన్న శృతి మీనా ఇద్దరు కూడా షాక్ అవుతారు. ఏదో ఆ నొప్పులని భరించి బిడ్డను తన్నట్లు అలా చెప్తున్నావేంటి అని మీన అడుగుతుంది.. ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేస్తుంది రోహిణి.. కాస్త ఉంటే కచ్చితంగా నా బిడ్డ గురించి బయటపడేదేమో అని రోహిణి టెన్షన్ పడుతుంది. బాలు కారు కొనాలన్న ఆలోచనని పోస్ట్ పోన్ చేసుకుంటాడు.. మీనా చెప్పినట్లు మళ్లీ వాళ్ళ అమ్మానాన్న కలిసిన తర్వాతే కొత్త కారును కొనాలని అనుకుంటాడు. దానికోసం సుశీలను ఇంటికి తీసుకొస్తాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..

ఇక ఇవాళ ప్రోమో విషయానికి వస్తే.. సుశీల ఇంట్లోకి రాగానే ప్రభావతి పై చిందులు వేస్తుంది.. నువ్వు ఇలా వాడిని వెనకేసుకుని రావడం వల్లే వాడు ఇలా తయారయ్యాడు అని అంటుంది. వాడు బిజినెస్ లో లాస్ రావడం వల్ల నేను ఇలా చేశాను అని ప్రభావతి ఎంత చెప్పినా సరే ఇలాంటిదే ఇకమీదట మానుకో లేకపోతే వాడు నీ నెత్తి మీద అన్ని తెచ్చి వేస్తాడు అని సుశీల అంటుంది.. ఇక సత్యం ని కలవడానికి వెళ్ళిన సుశీలను చూసి సత్యం సంతోషపడతాడు. ఏంట్రా నేను విన్నది నిజమేనా నువ్వు మాకు ఎందుకు అబద్ధం చెప్పాలని అనుకున్నావు.. నిజం చెప్పలేదు ఏంటి నాకు చెప్పకూడదని అనుకున్నావా అని సుశీల అడుగుతుంది. కానీ సత్యం మాత్రం నిన్ను బాధ పెట్టడం ఇష్టం లేక చెప్పలేదమ్మా అని అంటాడు.

Advertisement

ప్రభావతి గురించి మొదటి నుంచి తెలుసు కదా పెద్ద కొడుకు అంటే దానికి ఎంత ప్రాణము వాడు ఏం చేసినా కూడా సపోర్ట్ చేస్తూ వస్తుంది అని అంటుంది.. తన గురించి తెలుసమ్మా ఎప్పుడు తను ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది అయినా కూడా క్షమిస్తూనే వచ్చాను. ఇప్పుడు మాత్రం బంగారం తీసుకెళ్లి వాడికి ఇచ్చింది నేను బంగారం ఇచ్చినందుకు బాధపడడం లేదు.. వాళ్ళిద్దరూ కలిసి దాన్ని మళ్ళీ నగలుగా మార్చి మేన వాళ్ళ అమ్మ మీద నిందలు వేశారు.. మీనాని దారుణంగా అన్నారు. ఇంత జరిగిన సరే మీనాని అంటూనే ఉంది.

అందుకే మీనా కి క్షమాపణ చెప్పాలి అని నేను అన్నాను ఎప్పుడైతే అది క్షమాపణ చెప్తుందో అప్పుడే నేను దాంతో మాట్లాడుతాను అని సత్యం అంటాడు.. అది మీనా కి క్షమాపణ చెప్తుందా అసలు ఇది ఊహించుకోవడానికి కూడా కష్టంగా ఉంది రా అనేసి సుశీల అంటుంది.. వాళ్ళ తల్లి దొంగతనం చేసింది అని నిందలు వేసింది.. అయినా కూడా మీనా ఒక్క మాట కూడా మాట్లాడలేదు.. తప్పు చేసింది వీళ్లు కానీ బాధ మాత్రం మీనా కి ఎందుకు అని నాకు చాలా బాధేసింది అమ్మ అందుకే ఇది మారదు అని దానితో మాట్లాడటం మానేశాను అని సుశీలతో సత్యం చెప్తాడు..

Advertisement

వీళ్ళిద్దరూ కలిసి ఒక నిర్ణయానికి వస్తారు.. సత్యం చెప్పినట్లు నువ్వు చెప్తేనే వాడు నీతో మాట్లాడతాడంట. నేను ఎంత చెప్పినా కూడా వాడు వినడం లేదు. నువ్వు ఎంతగా వాడిని బాధ పెట్టావో నాకు ఇప్పుడు అర్థమవుతుంది అని సుశీల అంటుంది.. నీ కొడుకు ఒక వెధవ ఈ వెధవ కోసం నా కొడుకుని ఇబ్బంది పెడతావా అని ప్రభావతిని దుమ్ము దులిపేస్తుంది సుశీల.. వీడు ఎన్ని తప్పులు చేసినా నీకు మంచే అవుతుంది కానీ నువ్వు మాత్రం మారవా అని సుశీల అంటుంది.. రోహిణి మనోజ్ చేసింది తప్పే అమ్మమ్మ కానీ తప్పక చేశాడు దాంట్లో తప్పు లేదు కదా అని అంటుంది..

Also Read : హమ్మయ్య శ్రీవల్లి ప్లాన్ సక్సెస్.. ప్రేమ అనుమానమే నిజమా..? అమూల్య పరిస్థితి ఏంటి…?

నీ భర్త నీకు ఎంత ప్రేమ చూపిస్తే నువ్వు వెనకేసుకొని వస్తావా? ఇంకొకసారి వాడు చేయకుండా గట్టిగా బుద్ధి చెప్పాలి కానీ అని రోహిణి అని తిడుతుంది.. ప్రభావతి ఇక నువ్వు సత్యం చెప్పినట్టు వినాలి అని అంటుంది. నేను ఆయనతో మాట్లాడను అని చెప్పట్లేదు ఆయనే నాతో మాట్లాడట్లేదు అని ప్రభావతి అంటుంది. నేను మాట్లాడను అని చెప్పట్లేదు అమ్మ మీనా కి క్షమాపణ చెప్పిన తర్వాతే నేను మాట్లాడతాను అని చెప్పాను అని సత్యం అంటాడు. నేను వెళ్లి దానికి క్షమాపణ చెప్పడం ఏంటి అని ప్రభావతి అనగానే సుశీల తప్పు చేసింది నువ్వే కాబట్టి నువ్వే క్షమాపణ చెప్పాలి. లేదంటే వాడు నిర్ణయాన్ని మార్చుకోడు. తర్వాత నీ ఇష్టం అని ప్రభావతికే వదిలేస్తుంది. అక్కడితో ప్రోమో ఎండ్ అవుతుంది. ఇక సోమవారం ఎపిసోడ్లో ప్రభావతి మీనాకు క్షమాపణ చెప్తుందా..? సుశీల చెప్పిన కూడా మీ నాకు క్షమాపణ చెప్పదా? సత్యం ప్రభావతి ల మధ్య ఇంకా దూరం పెరుగుతుందా అన్నది చూడాలి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×