E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: అడ్డంగా బుక్కయిన ప్రభా.. రెచ్చిపోయిన మీనా.. రోహిణి మాస్టర్ ప్లాన్..

Gundeninda GudiGantalu Today episode: అడ్డంగా బుక్కయిన ప్రభా.. రెచ్చిపోయిన మీనా.. రోహిణి మాస్టర్ ప్లాన్..
Advertisement

Gundeninda GudiGantalu Today episode April 14th: మీనాని బాలు రాజేష్ వాళ్ళు కాపాడతారు. నిజం కక్కేసిన కామాక్షి.. కోడలుగా మీనాని కాపాడిన బాలు మీనాకి ఏం కాలేదా అని అడుగుతాడు. అయితే మీనా నిన్ను కిడ్నాప్ చేసింది ఎవరో తెలుసా అని అంటే ఆ దినేష్ గాడు అని అనగానే బాలు షాక్ అవుతాడు. ఇక ఈ డబ్బులు గురించి మనం వెళ్లి కామాక్షిని అడగాలి అని మీనా అంటుంది.. ఇక బాలు మీనా కామాక్షి దగ్గరికి వెళ్లి నిలదీస్తారు.. కామాక్షి నిజాన్ని మింగలేక కక్కేస్తుంది. శివని విడిపించడానికి మీరు ఇచ్చిన డబ్బులు ఆయన ఇచ్చాడు దాన్ని నా దగ్గర దాచి పెట్టింది అని కామాక్షి నిజం చెప్తుంది.. ఇక ఆ విషయం తెలుసుకున్న బాలు మీన కోపంగా ఇంటికి వెళ్లి ప్రభావతిని నిలదీస్తారు..

ప్రభావతి అడ్డంగా దొరికిపోతుందా..? 

ప్రభావతి ఇంటికి రాగానే మీనా పై సీరియస్ అవుతుంది.. ప్రభావతి మీనా పై సీరియస్ అయ్యి ఎంతగా చెప్పాలని ప్రయత్నించినా సరే మీనా మాత్రం తన మాట అస్సలు వినదు. అసలు మీకు ఆ రెండు లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయి అని అడుగుతారు.. అయితే ప్రభావతి నోట్లో నీళ్లు నములుతు కనిపించడంతో ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో నేను చెప్పనా అని మీనా అంటుంది. మా తమ్ముడు కోసం రూపాయి రూపాయి పోగేసుకొని కడుపు కట్టుకొని కట్టిన డబ్బులలో లాయర్ కి ఇచ్చిన డబ్బుల్లో ఈమె రెండు లక్షల తీసుకుంది అని మీనా నిజాన్ని బయటపెడుతుంది. ఆ మాట వినగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు.

మీనా దెబ్బకు ఫ్యూజుల్ అవుట్..

Advertisement

ప్రభావతి ఆ లాయర్ నాకు ఇచ్చాడు కానీ నేనేమీ ఆ లాయర్ ని అడగలేదు అని మళ్లీ కావాలని కవర్ చేసుకునేలా ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. నేను డబ్బులేమీ వద్దనుకున్నాను కానీ ఆయన ముందు 50,000 ఇస్తానన్నాడు ఆ తర్వాత రెండు లక్షల అనగానే ఒప్పుకున్నాను.. డబ్బులు ఎవరు కాదనుకుంటారు అని ప్రభావతి అంటుంది. డబ్బులు కోసం ఇంకేదైనా చేస్తావా కనీసం బుద్ధి ఉండాలి నీకు అని సత్యం వార్నింగ్ ఇస్తాడు.. నువ్వు డబ్బులు వస్తే ఇంకా ఏదైనా చేస్తావా రేపు ఎవరైనా డబ్బులు ఇచ్చి హత్య చేయమంటారు అది కూడా చేస్తావా అని సత్యం అడగ్గానే ప్రభావతి ఫ్యుజులు ఎగిరిపోతాయి..

ప్రభాకు బాలు వార్నింగ్..

ఈవిడ ఏదో మనకి న్యాయం చేసేయను పెద్ద మనసు చేసుకొని శివని విడిపించాను అని అంటుంది కదా.. వాడి మీద దొంగతనం కేసు వేసింది అనవసరంగా వాడిని అనుమానించింది వాడు ఆ డబ్బులు కొట్టేసి మళ్లీ తిరిగి ఇచ్చాడు కూడా అని బాలు అంటాడు.. ప్రభావతి ఎంత చెప్పినా ఇక మారదు అని బాలు అంటాడు.. వీడు వల్ల నాకు ఐదు లక్షలు బొక్క ఐదు లక్షలు ఈవిడ నాకు ఇవ్వాలి అని బాలు అనగానే నేనెందుకు ఇస్తాను అని ప్రభావతి అంటుంది. అయితే సత్యం మాత్రం నువ్వు కచ్చితంగా వాడికి ఆ డబ్బులు ఇవ్వాలి అని వార్నింగ్ ఇస్తాడు..

ప్రభావతి రోహిణి షాక్..

Advertisement

మనోజ్ రోహిణి ఇద్దరు కూడా బిజినెస్ డెవలప్ అవుతుందని మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే అక్కడికి వచ్చిన ప్రభావతి నన్ను మీరిద్దరే ఆదుకోవాలి అని దీనంగా అడుగుతుంది.. అయితే మనోజు నా దగ్గర అంత డబ్బులు ఎక్కడున్నాయి అమ్మ అని అంటాడు.. అయితే రోహిణి కూడా నా దగ్గర అంత డబ్బులు లేవు అని అంటుంది. కానీ ప్రభావతి మాత్రం మలేషియాకి వెళ్లి అక్కడ మీ నాన్నని అడిగి డబ్బులు తెచ్చుకుందామని అంటుంది. దాంతో రోహిణి దిమ్మ తిరిగిపోయేలా షాక్ అవుతుంది.. ఏదో ఒక విధంగా ప్రభావతి ఆలోచనని మార్చుకునేలా చేస్తుంది రోహిణి..

బాలు పై రోహిణి ప్రేమ.. 

మీనా కోసం బాలు ఎన్ని పనులు చేశాడో అవన్నీ తలుచుకొని మీనా ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది. నాకోసం మీరు ఎన్నో కష్టాలను ఎదుర్కొంటున్నారు. నన్ను ఆ దుర్మార్గులు ఎత్తుకుపోయిన సరే నాకోసం మీరు కంగారుపడుతూ ప్రాణాలకు తెగించి నన్ను కాపాడారు అని అనుకోని బాలుని చూస్తూ తన ప్రేమను కురిపిస్తూ ఉంటుంది మీనా.. బాలు మీనా ఇద్దరు మరోసారి ఒకటి అయిపోతారు. మాత్రం ఎటు తిరిగి నా దగ్గరికి వచ్చింది అని విద్యతో చెప్పి బాధపడిపోతూ ఉంటుంది.. ఇంకా రెండు లక్షలు కామాక్షికి ఇవ్వాలని ఫిక్స్ అవుతుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Also Read :Podarillu Today Episode : కన్నీళ్లు పెట్టుకున్న గాయత్రి.. బాధపడ్డ మాధవ్.. మహా మాటతో కన్నీళ్లు పెట్టుకున్న కన్నా..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×