E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: మీనా పై ప్రభావతికి అనుమానం.. రవిని క్షమించిన శృతి.. సత్యం దిమ్మతిరిగే షాక్..

Gundeninda GudiGantalu Today episode: మీనా పై ప్రభావతికి అనుమానం.. రవిని క్షమించిన శృతి.. సత్యం దిమ్మతిరిగే షాక్..
Advertisement

Gundeninda GudiGantalu Today episode April 10th: కామాక్షి వచ్చి తన దగ్గర దాచుకున్న రెండు లక్షలు డబ్బులు ఇవ్వాలని లోపలికి వెళ్ళగానే అక్కడ డబ్బులు లేకపోవడంతో షాక్ అవుతుంది.. ఇక్కడున్న డబ్బులు ఎక్కడికి వెళ్ళిపోయాయి అని ప్రభావతితో చెప్తుంది. ఆ మాట వినగానే ప్రభావతి ఇందాక మీనా వచ్చింది కదా అదే తీసి ఉంటుంది అని అనుకుంటుంది. కానీ మీనా ఇంటికి వెళ్ళగానే ప్రభావతి వచ్చి ఆ రెండు లక్షలు ఎక్కడ దాచావో చెప్పు అని అందరి ముందర అవమానించేలా మాట్లాడుతుంది..

మీనాకు ప్రభావతి షాక్..

మీనా కోసం ఇంట్లోకి వచ్చిన ప్రభావతి తన రూమ్ లోకి వెళ్లి అక్కడ ఉన్న బీరువా మొత్తాన్ని వెతుకుతుంది.. అసలు ఏమైందో చెప్పకుండా ప్రభావతి అలా బీరువా మొత్తం పెట్టడంతో రవి శృతి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అసలేం జరిగి ఉంటుంది ఎందుకు ఇలా చేస్తుందో అర్థం కావడం లేదు అని శృతి అనుకుంటుంది. కాఫీ ఇవ్వమని రవి శృతి ఎక్కడికి వెళ్లారు అని మీనా కూడా హడావిడిగా బయటకు వస్తుంది. ఆంటీ వచ్చారు నీ బీరువా మొత్తం అన్ని కింద వేసి వెతుకుతున్నారు అని చెప్పగానే.. ఏంటి ఎందుకు వెతుకుతున్నారు అని మీనా వెళ్తూ ఉండగా ప్రభావతి కిందకు దిగి వస్తుంది. ఎక్కడ దాచావే 2 లక్షల డబ్బులు అని అనగానే ఒక్కసారిగా మీనా షాక్ అయిపోతుంది.

మీనా గుండెలు పగిలాయి.. 

Advertisement

ఏం మాట్లాడుతున్నారో అత్తయ్య నేను రెండు లక్షలు తీయడమేంటి? ఎక్కడ తీశాను ఎవరి దగ్గర తీసాను అని నేను ఆ ప్రభావతిని అడుగుతుంది. కామాక్షి వాళ్ళ ఇంటికి వచ్చి నైసుగా కాఫీ పెడతానని అన్నప్పుడు నాకు అనుమానం రాలేదు. ఆ రెండు లక్షల కొట్టేసి ఎక్కడ దాచావు మధ్యలో మీ తమ్ముడిని రమ్మని అతనికి ఇచ్చేవా ఏంటి అని ప్రభావతి అడుగుతుంది.. మతి ఉండి మాట్లాడుతున్నారా ఆంటీ అని శృతి అడుగుతుంది.. నేను డబ్బులు తీసానని మీకు ఎవరు చెప్పారు అని మీనా ఎంతగా అడుగుతున్నా కూడా ప్రభావతి మీనానికి కొట్టబోతుంది. అప్పుడు అక్కడికి వచ్చినా సత్యం ప్రభ మతి ఏమైనా పోయిందా ఏంటి అని అడుగుతాడు..

మీనాకు సపోర్ట్ గా సత్యం.. 

మీనా తీసింది అనడానికి సాక్ష్యం ఏదైనా ఉందా. ? అవునండి నేననే ఆ డబ్బులు తీసిందని మీ దగ్గర సాక్షాలు ఉన్నాయా..? కామాక్షి లాంటి వాళ్ళింటికి రోహిణి కూడా వెళ్తుంది అలాగే చాలామంది డాన్సర్లు కూడా వెళ్తుంటారు. మీరు వాళ్లని ఎందుకు అడగలేదు నేననే ఎందుకు అడుగుతున్నారు అని శృతి అంటుంది. ఇది దీని కుటుంబంలోని వాళ్ళందరూ దొంగలు కాబట్టే దీన్ని అడుగుతున్నాను. వీళ్ళ తమ్ముడు నేను పెట్టిన బిక్షతో బయటకు వచ్చి చదువుకుంటున్నాడు అని ప్రభావతి మీనా పుట్టింటి వాళ్ళని అవమానించేలా దారుణంగా మాట్లాడుతుంది.. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయి రేపు బాలు వచ్చిన తర్వాత ఏం చేయాలో వాడే చేస్తాడు అని సత్యం అంటాడు.

బాలు దగ్గర నిజం దాచిన మీనా..

Advertisement

ఇక బాలు వైజాగ్ వెళ్లిన తర్వాత మీ నాకు ఫోన్ చేసి నేను నీకు చాలా సార్లు ఫోన్ చేశాను కానీ నువ్వు ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు నాకు అర్థం కావడం లేదు అని అంటాడు.. నువ్వు ఫోన్ చేసిన టైం కి నా ఫోన్ నా దగ్గర లేదు.. అయితే ఏంటి అలా ఉన్నావ్ ఏదో జరిగింది అని బాలు అడుగుతాడు. ఏం జరగలేదండి మీరు ఎప్పుడు వస్తారు అని నేను అనగానే బాలు రేపు మధ్యాహ్నం కల్లా వస్తాను అని అంటాడు. అయితే వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం అని మీనా అంటుంది.

రోహిణి పై అనుమానం..

శృతి రవి మీనా ఒంటరిగా బాధపడుతూ ఉండటం చూసి అక్కడికి వెళ్తారు.. ఏంటి మీ నా ఒంటరిగా కూర్చుని బాధపడుతున్నావా అని అడుగుతారు. నాకు ఒక సారి అయితే బాధ ఏమీ కొత్తగా అనిపించేది ప్రతిసారి ఇలానే జరుగుతుంది కదా కొత్తగా కనిపించలేదు అని మీనా అంటుంది.. ఆంటీ ఇలా చేస్తుంది నేను అసలు ఊహించలేదు. అప్పుడే అక్కడికి వచ్చిన రోహిణి వీళ్ళందరూ ఏం మాట్లాడుకుంటున్నారు.. అని దొంగ చాటుగా వినడం చూస్తున్నారు మీనా రోహిణి పై అనుమానం పెంచుకుంటుంది.. రేపు ఉదయం పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇస్తాను వాళ్లే వచ్చి తెలుస్తారు అనగానే రోహిణి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. గుణ కి ఫోన్ చేసి డబ్బులు కావాలని అడుగుతుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Also Read :Podarillu Today Episode : ఇంట్లోంచి పారిపోతున్న గాయత్రి.. తాయారుకు అడ్డంగా దొరికిన గాయత్రి.. కిడ్నాప్ ప్లాన్ చేసిన మహా..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×