// // GundeNinda GudiGantalu Today Episode : మీనాను బయటకు వెళ్లమని చెప్పిన తల్లి.. బాలుతో చనిపోతానని చెప్పిన మీనా.. - Staging.BigTvLive -->
E-Paper
Advertisement

GundeNinda GudiGantalu Today Episode : మీనాను బయటకు వెళ్లమని చెప్పిన తల్లి.. బాలుతో చనిపోతానని చెప్పిన మీనా..

GundeNinda GudiGantalu Today Episode : మీనాను బయటకు వెళ్లమని చెప్పిన తల్లి.. బాలుతో చనిపోతానని చెప్పిన మీనా..
Advertisement

Gundeninda GudiGantalu Today Episode 22th : నిన్నటి ఎపిసోడ్ లో.. సత్యం ఇంటికి మీనా వస్తుంది. మా కుటుంబానికి ద్రోహం చేసిన నిన్ను ఇంట్లోకి రానిస్తాన‌ని ఎలా అనుకున్నావ‌ని మీనాపై ఫైర్ అవుతుంది ప్రభావతి. నాపై ప్ర‌తీకారం తీర్చుకోవ‌డానికే ర‌వి, శృతిల పెళ్లిని సీక్రెట్‌గా జ‌రిపించావ‌ని, నా భర్తను పోలీస్ స్టేషన్ కూర్చోబెట్టిన దాన్ని నా ఇంటి గడప కూడా తొక్కనివ్వను అని మండిపడుతుంది.. తిండికి గ‌తిలేని నిన్ను ఈ ఇంటి కోడ‌లిగా తీసుకొచ్చిన స‌త్యానికి గొప్ప స‌న్మానం చేశావ‌ని మీనాను ప్ర‌భావ‌తి అవ‌మానిస్తుంది, మ‌నోజ్‌, రోహిణి కూడా మీనానే త‌ప్పుప‌డ‌తారు. మా నాన్న జైలుకు వెళ్లాడ‌ని కోప్ప‌డుతారు. మీనాను ఇంట్లోకి రానివ్వను అనేసి ప్రభావతి అంటుంది. ప్ర‌భావ‌తికి ఎదురుతిరుగుతుంది మీనా. మీరు పొమ్మంటే ఎక్క‌డికి వెళ‌తాన‌ని, ఇదే త‌న ఇళ్లు అని అంటుంది. చ‌చ్చేదాకా ఇక్క‌డే ఉంటాన‌ని చెబుతుంది. నా మెడ‌లో తాళిక‌ట్టిన భ‌ర్త‌కే ఆ హ‌క్కు ఉంద‌ని అంటుంది. ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మ‌ని బాలు చెబితే వెళ్లిపోతాన‌ని అంటుంది. బాలు నీకు నాకు ఎలాంటి సంబంధం లేద‌ని మీనాతో తెగేసి చెబుతాడు. నా కళ్ళ ముందుకు రావొద్దు అంటాడు. అందరు కలిసి దాన్ని గెంటెయ్యండి అంటారు . ఇక ప్రభావతి విన్నావుగా నీకు తాళి కట్టిన మీ ఆయనే నిన్ను గెంటేయమని అన్నాడు వేళ్ళు అని గెంటేస్తుంది. ఇక మీనా పుట్టింటికి వస్తుంది నన్ను ఎవరు నమ్మట్లేదు అమ్మ నేనే ఈ పెళ్లి జరగడానికి ముఖ్య కారణం అని నన్ను ఇంట్లోంచి గెంటేశారమ్మ ఇక జీవితంలో నన్ను ఇంట్లోకి రానివ్వరు అంటూ తల్లితో మీనా చెప్పుకొని బాధపడుతుంది . రవి శృతిలు శోభనం గురించి మాట్లాడుతారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. రవి, శృతిలు శోభనం గురించి మాట్లాడుతారు. మాది పెద్ద ఫ్యామిలీ. ఇల్లంతా సందడిగా ఉంటుంది. వాళ్ల అంగీకారంతో పెళ్లి చేసుకున్నాను. ఇవాళ ఈ పెళ్లే వాళ్లకు దూరం చేసింది. మనం పెళ్లి చేసుకుని తప్పు చేశావేమో అనిపిస్తుంది అని రవి అంటాడు.. వాళ్లను బాధపెట్టడం తప్పే కానీ, పెళ్లి చేసుకుని తప్పు చేయలేదు. మనం వాళ్లకు చెప్పకుండే చేసుకుంటే వేరు. వాళ్లకు చెప్పాం. వాళ్లు మనల్ని విడదీయాలని అనుకోవడం తప్పు కాదా చెప్పు. అయినా వాళ్ల పంతాలు మన పెళ్లికి అడ్డు రావడం ఏంటీ.. ఇలాంటివి రావడం ఫ్యామిలీలో కామన్.. చేయని తప్పుకు వదినా, నాన్న శిక్ష అనుభవిస్తున్నారు అని రవి అంటాడు. ఇదంతా తలుచుకుంటే గిల్టీగా ఉందని రవి అంటే.. మన పెళ్లి జరగుకుండా ఉంటే బాగుండేది అంటున్నావా.. ఆ పిచ్చోడుతో పెళ్లి చేసాడు. అని శృతి అంటుంది ఇక ఇద్దరు కలిసిపోతారు. వెళ్లి టిఫిన్ తీసుకొని వస్తే తిని పెడతాను అని అంటుంది.

Advertisement

ఇక బాలు స్టాండ్ కు వస్తాడు. అక్కడ తన ఫ్రెండ్స్ అడుగుతారు. ఇదంతా రవిగాడి వల్ల. వాడికోసం చూస్తున్నాను అని బాలు అంటాడు. నీకే ఇలా ఉందంటే మీ నాన్నకు ఇంకెలా ఉంటుందో అర్థం చేసుకోగలను అని బాలు ఫ్రెండ్ అంటాడు. రేయ్ బాలు. ఏంటీ మీ నాన్న ఏ తప్పు చేయలేదని లోకమంతా చాటింపు వేయడానికి వచ్చావా. మీ నాన్న శ్రీ సత్యంగారు జనానికే నీతులు చెబుతారా. ఆయన ఫాలో అవ్వడా అని అవమానించేలా మాట్లాడుతాడు ఓ తాగుబోతు.. దానికి బాలు కోపంతో రగిలిపోతాడు. అతనితో గొడవలు పెరుగుతాయి. నాన్న తప్పు చేయడం నువ్ చూశావా అని కొడతాడు బాలు. వాడి తాగి మాట్లాడుతున్నాడురా అని ఫ్రెండ్స్ అంటాడు. కావాలనే మనసులో పెట్టుకుని మాట్లాడుతున్నాడు అని కొడతాడు బాలు. తప్పు చేయనప్పుడు పోలీసులు ఎందుకు అరెస్ట్ చేస్తారు అని తాగుబోతు అంటే.. వాళ్లు అరెస్ట్ చేస్తే తప్పు చేసినట్లేనా.. బాలు గొడవను అక్కడి వాళ్ళు ఆపుతారు. మీ నాన్న మంచోడే ఇలా జరిగిందేంటి అని అక్కడ వాళ్ళు అంటారు. ఇక గొడవ ఆపుతారు.

సురేంద్ర ఇంటికి నీలకంఠమస్తాడు. కొంచెం కూడా నీకు సిగ్గు లేదా నీ కూతురు ఇలా చేసింది పోలీసులు కంప్లైంట్ ఇచ్చావు అదే నాకు చెప్పి ఉంటే నా మనసులతో తీసుకొచ్చి నీ కాళ్ళ దగ్గర పడేసేవాడిని అనేసి అరుస్తాడు. సంజు కూడా శృతి వాళ్ళమ్మ పై మండిపడతాడు. కూడా లేకపోతే పద్ధతిగా పెంచుతున్నారు. అనుకున్నాను కానీ ఇలా అనుమానంతో పెంచారని అనుకోలేదు. ఈ విషయం మీకు తెలియదా తెలిసి దాచి పెట్టారా అంటూ నీలకంఠం సురేంద్రను నిలదీస్తాడు. సురేంద్ర తలదించుకుని నిలబడి ఉంటాడు. నా ఫ్రెండ్స్ అందరికీ నా భార్య ఫోటోలు పంపి నా భార్యని అందరికీ చెప్పాను అలాంటిది నాకైతే దగ్గరుండి రెడీ చేయించి పెళ్లికి తీసుకెళ్లాలంటే నన్నెంత ఎదవని చేస్తుందని కోపంతో రగిలిపోతాడు. ఇక ఈ కోపం తగ్గాలంటే ఇంట్లో ఉన్నవన్నీ ధ్వంసం చేయాలి నాశనం చేయాలంటూ అంటాడు. దానికి నీలకంఠం వద్దని చెప్పేసి బయటికి తీసుకెళ్ళిపోతాడు.

Advertisement

ఇక మీనా అందరూ నా తప్పును అర్థం చేసుకుంటారు నన్ను త్వరలోనే అర్థం చేసుకుంటారంటూ తన వాళ్ళతో చెప్పుకొని బాధపడుతూ ఉంటుంది. ఇక్కడే ఉంటే ఎలా తెలుసుకుంటారు. అక్కడికి వెళ్లి నీ తప్పు లేదని తెలుసుకునే చేయవే. ఇంట్లోకి రమ్మనకుంటే గుమ్మం దగ్గర ఉండు. లేకుంటే బయట ఉండు. వాళ్ల కోపం చల్లారేదాక ఉండు. వాళ్లు అన్నారని ఇలా వస్తే నిజంగానే నువ్ తప్పు చేసినదానివి అవుతావే అని పార్వతి అంటుంది.

లే వేళ్ళు అని అంటుంది. దానికి వేళ్ళు ఇక్కడ నుంచి అంటుంది. ఇక మీనా షాక్ అవుతుంది. పెళ్లయిన కూతురు పుట్టింట్లో ఉంటే నలుగురు నాపై ఉమ్మేస్తారు. తనకు ఏం చేయొద్దని చెబితే వినలేదు. మీ వల్ల ఎప్పుడు నరకమే. మీ తోబుట్టువుగా పుట్టడమే ఇది చేసిన పాపం అనిపిస్తుంది. పదా మీనా వెళ్లు అని పార్వతి అంటుంది.. ఇక మీనా ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను నేను చచ్చినా పట్టించుకోవద్దు అని అంటుంది. దాంతో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో మీనాను ఎక్కడికైనా వెళ్లమని అంటాడు బాలు.. నేను చచ్చిపోతాను అని అంటుంది. రేపటి ఎపిసోడ్ లో బాలు మీనాను తీసుకొని ఇంటికి వెళ్తాడా అనేది చూడాలి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×