E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: ఇంగ్లీష్ లో దంచేసిన బాలు.. చింతామణి ఉచ్చులో మీనా..ప్రభా ఫుల్ హ్యాపీ..

Gundeninda GudiGantalu Today episode: ఇంగ్లీష్ లో దంచేసిన బాలు.. చింతామణి ఉచ్చులో మీనా..ప్రభా ఫుల్ హ్యాపీ..
Advertisement

Gundeninda GudiGantalu Today episode 16th: మీనా ని ఒక ఈవెంట్ మేనేజరు రమ్మని పిలుస్తాడు.. అయితే మీనా 10 లక్షల ఆర్డర్ అని చెప్పగానే చాలా సంతోషంగా ఉంటుంది. మీనా ఆ కాంట్రాక్ట్ గురించి ఆలోచించకుండా సంతకం పెట్టేస్తుంది.. అయితే తర్వాత చింతామణి అక్కడికి వెళ్లి ఆ ఈవెంట్ మేనేజర్ తో మీనా సైన్ చేసిన బాండ్ పేపర్ ని తీసుకుంటుంది.. మీనా జీవితంలో ఆర్డర్లు చేయలేదు డెకరేషన్ చేయలేదు అని సంతోషంగా ఉంటుంది చింతామణి.. ఇంట్లోకి వచ్చిన తర్వాత మీనా ఈ విషయాన్ని అందరితో చెప్పడంతో వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉంటారు. అడ్వాన్స్ కేవలం లక్ష రూపాయలు మాత్రమే ఇచ్చారు అని చెప్పగానే మీనా బాలు నెక్స్ట్ ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటారు..

ఇంగ్లిష్ లో అదరగొట్టిన బాలు..

బాలు మీనా పూల డెకరేషన్ కావాల్సిన డబ్బులు కోసమని తిరుగుతూ ఉంటారు. ఇప్పుడు లక్ష రూపాయలు మాత్రమే వచ్చింది కదా.. ఇంకా ఏడూ ఎనిమిది లక్షలు రావాలి కదా.. ఎలాగైనా సరే ఈ డెకరేషన్ను మనమే సొంతం చేసుకోవాలి అని మీనా బాలుతో అంటుంది.. బాలు ఇక కారు స్టాండ్ కి తీసుకొని వెళ్తాడు.. అయితే అక్కడ ఒక కస్టమర్ ఫోన్ చేసి ఇంగ్లీషులో మాట్లాడుతున్నారు రా మాకు చాలా ఇబ్బందిగా ఉంది అని రాజేష్ అనగానే బాలు ఆ ఫోన్ లిఫ్ట్ చేసి ఇంగ్లీష్ లో దంచేస్తాడు.. ట్రిప్ కి వస్తాను అని ఇంగ్లీషులో మాట్లాడడంతో అందరూ నోర్లు వెళ్ళబెట్టి చూస్తూ ఉంటారు.. మీరు ఇంగ్లీషులో ఇంత బాగా మాట్లాడతారని తెలియదండి చాలా బాగా మాట్లాడారు అని మీనా కూడా ప్రశంసలు కురిపిస్తుంది.. ఒకరి మీద ఒకరు ప్రశంసలు కురిపించుకుంటూ ఉంటారు..

చింతామణి ప్లాన్ ప్రభా కు తెలిసిపోతుందా..?

Advertisement

ప్రభావతి చింతామణికి ఫోన్ చేయాలని అనుకుంటుంది.. మీనా కి పదిలక్షల ఆర్డర్ వచ్చింది అంటే ఇక మన చేతుల్లో ఉంటుందా అని ప్రభావతి అనుకుంటూ ఉంటుంది.. అయితే ప్రభావతి అలా అనుకుంటూ ఉండగానే చింతామణి ఫోన్ చేస్తుంది.. మీ కోడలికి పెద్ద ఆర్డర్ వచ్చింది కదా.. అదే చివరి ఆర్డర్ అని చెప్పగానే ప్రభావతి దీనికి ఏమైనా పిచ్చా ఇది ఆర్డర్ పూర్తి చేస్తే ఇంకా ఆర్డర్ వస్తాయి కదా అని అనుకుంటుంది. అయితే ఆర్డర్లు రావడానికి కారణం నేనే.. ఇదే చివరి ఆర్డర్ ఇకమీదట ఇంక ఏ ఆర్డర్లు రావు అని చింతామణి చెప్పగానే ప్రభావతి చాలా సంతోషంగా ఉంటుంది.. ఇక అలాంటి పనులు చేయలేదు క్యాలీఫ్లవర్ తో కూరలు వండించుకోండి అని ప్రభావతికి చెప్పగానే ప్రభావతి ఇంకా రెచ్చిపోతుంది..

బాలు దెబ్బకు ప్రభా షాక్..

ప్రభావతి పైనుంచి కాలిఫ్లవర్ పట్టుకొని కిందకి వస్తుంది.. మీనా వంటగదిలోకి వెళ్ళగానే బాలు మీనా వెనకాల వెళ్తాడు.. ఎవరైనా బయటినుంచి ఇంట్లోకి రాగానే బెడ్ రూమ్ లోకి వెళ్తారు.. నువ్వు ఇలా వంటగదిలోకి రావడం నాకు అస్సలు నచ్చలేదు అని ఎంతగా చెప్తున్నా సరే అందరికీ కాఫీ పెట్టాలి కదా ఇదే నా పని అని మీనా అంటుంది.. అప్పుడే ప్రభావతి క్యాలీఫ్లవర్ పట్టుకొని కిందకొస్తుంది.. ఇకమీదట నువ్వు ఇదే చేయాలి అన్నట్లుగా మాట్లాడగానే అందరూ ఏమైంది దీనికి అని అనుకుంటారు.. ఇక ప్రభావతి చెప్పినట్లుగానే నేను అన్ని చేస్తానని చెప్తుంది.. మీనాకి ఇదే చివరి ఆర్డర్ని చాలా సంతోషంగా ఉంటుంది. కానీ బాలు మాత్రం ప్రభావతి నోటికి తాళం వేయాలి అని షాక్ ల మీద షాక్ లు ఇస్తాడు..

లోన్ కోసం మీనా ప్రయత్నాలు..

Advertisement

బాలు మనకి చాలా పెద్ద అమౌంట్ కావాలి కదా ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు అని అంటాడు.. మనకు బ్యాంకు వాళ్లు లోన్ కూడా ఇస్తామని చెప్పారు కదా.. వాళ్ళను ఒకసారి నేను కలిసి వివరంగా ఈ విషయం గురించి చెప్తానండి వాళ్ళు ఏమంటారు చూద్దాం అని నేను అంటుంది.. బ్యాంకుకు వెళ్లిన మీనా కి అక్కడున్న ఆఫీసర్లు షాప్ ఇస్తారు.. అయితే బాలు మాత్రం టెన్షన్ పడిపోతూ ఉంటాడు.. మీనాకి అక్కడ లోన్ దొరకలేదని బాధపడిపోతూ బయటికి రాగానే అక్కడ శివ కనిపించి ఫైనాన్సర్ దగ్గరికి నేను వస్తాను అక్క అని చెప్తాడు.. అలా ఇద్దరు కలిసి ఫైనాన్షియర్ దగ్గరికి వెళ్దామని అనుకుంటారు..

శృతి పై రవి ప్రశంసలు..

శృతి ఆర్డర్ తీసుకొని రవి దగ్గరికి వెళ్తుంది.. ఇలాంటి తింగరి కస్టమర్ ఇచ్చిన ఆర్డర్ ని ఎలా పూర్తి చేయాలో అర్థం కావడం లేదు అని అనుకుంటూ ఉంటుంది. ఇక రవికి ఆర్డర్ గురించి చెప్పగానే నేను చూసుకుంటాలే అని అంటాడు. అప్పుడే బాలు ఫోన్ చేసి విషయాన్ని చెప్పగానే మీనా వదినకు ఒకసారి ఫోన్ చేసి అడగలే అని రవి అనుకుంటాడు.. ఇక శృతి రవి ఇద్దరు కలిసి మీనా కి ఫోన్ చేసి విషయాన్ని కనుకుంటారు. శృతి డబ్బులు ఇవ్వకపోయినా పర్వాలేదు మాట చెప్పడం బాగుంది అని రవి పొగడ్తల వర్షం కురిపిస్తాడు. శృతి ఇది మన ఇల్లు కాదు రెస్టారెంట్ పదా వెళ్దాము అని అంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Podarillu Today Episode : చక్రీ ప్లాన్ అదుర్స్.. కేశవ, శైలు విడిపోతారా..? మాధవ్ కు నిజం తెలుస్తుందా..?

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×