E-Paper
Advertisement

పిల్లలు కావాలన్న భర్త.. విడాకులు ఇచ్చేసిన నటి.. ఎవరంటే?

పిల్లలు కావాలన్న భర్త.. విడాకులు ఇచ్చేసిన నటి.. ఎవరంటే?
Advertisement

Film industry: బాలీవుడ్ సెలబ్రిటీల జీవితాల్లో ప్రేమలు, పెళ్లిళ్లు, విడాకులు చాలా కామన్‌గా వింటూనే ఉంటాం. అయితే తాజాగా ప్రముఖ టెలివిజన్ నటి ఆకాంక్ష చమోలా తన భర్త గౌరవ్ ఖన్నా నుండి విడిపోవడానికి చెప్పిన కారణం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. పిల్లల్ని కనడం ఇష్టం లేదనే ఒకే ఒక్క కారణంతో ఈ స్టార్ జంట తమ పదేళ్ల బంధానికి స్వస్తి పలుకుతూ కోర్టు మెట్లెక్కడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఆ వివరాలు చూద్దాం..

ప్రేమించి పెళ్లి చేసుకున్న సీరియల్ జోడీ:

‘స్వరాగిని’, ‘సంతోషి మా’ వంటి ఫేమస్ సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి ఆకాంక్ష చమోలా.. మరో ప్రముఖ నటుడు గౌరవ్ ఖన్నాని ప్రేమించి 2016లో ఘనంగా పెళ్లి చేసుకుంది. టీవీ ఇండస్ట్రీలో ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట గత ఏడాది కాలంగా విడివిడిగానే జీవిస్తోంది. ఇక ప్రస్తుతం వీరిద్దరూ విడాకుల కోసం కోర్టులో దరఖాస్తు కూడా చేసుకున్నారు.

‘లాక్ అప్ 2’ షోలో అసలు నిజం బయటపెట్టిన నటి:

Advertisement

ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో ప్రసారమవుతున్న ‘లాక్ అప్ సీజన్ 2’ రియాలిటీ షోలో ఆకాంక్ష చమోలా పార్టిసిపెంట్గా చేస్తోంది. ఈ షోలో భాగంగా ఆమె తన వ్యక్తిగత జీవితం మరియు విడాకుల వెనుక ఉన్న అసలు రహస్యాన్ని ఓపెన్‌గా పంచుకుంది. పెళ్లి సమయానికే తనకు తల్లి అవ్వడంపై పెద్దగా ఇంట్రెస్ట్ లేదని, కానీ భవిష్యత్తులో ఆలోచనలు మారతాయేమోనని పెళ్లి చేసుకున్నట్లు తెలిపింది.

also read:నాడు ఉపాసన.. నేడు సురేఖ.. మెగా కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం కీలక పదవులు!

పిల్లలు వద్దు.. ఆకాంక్ష కండిషన్:

Advertisement

పెళ్లయిన కొన్నాళ్లకైనా మనసు మారుతుందేమో అనుకుంటే ఆకాంక్షకు అలాగ అనిపించలేదు. దీంతో తనకు పిల్లల్ని కనే ఉద్దేశం లేదనే విషయాన్ని భర్త గౌరవ్‌కు ముందే చెప్పేసింది. ఇక అప్పట్లో దానికి ఓకే అన్న గౌరవ్.. మళ్లీ గత కొంతకాలంగా తనకు పిల్లలు కావాలని, ఒక పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఉండాలని ఆకాంక్షపై ఒత్తిడి తీసుకురావడం మొదలుపెట్టాడట.

ఆయన కోరిక నేను తీర్చలేను:

“నాకు పిల్లల్ని కనడం అస్సలు ఇష్టం లేదు. ఆయనకు కావాల్సిన సంతోషాన్ని నేను ఇవ్వలేనప్పుడు కలిసి ఉండడం వేస్ట్ అనుకున్నాను. అందుకే ఈ కారణంతోనే మేము విడిపోవాలని డిసైడ్ అయ్యాం” అని ఆకాంక్ష క్లారిటీ ఇచ్చింది. ఇక ఈ కామెంట్స్ వైరల్ అవ్వడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు ఆమె నిర్ణయాన్ని తప్పుబడుతుంటే, మరికొందరు ఆమె నిజాయితీని మెచ్చుకుంటున్నారు.

పిల్లల విషయంలో భార్యాభర్తల మధ్య అభిప్రాయ బేధాలు రావడం వల్ల ఒక సెలబ్రిటీ జంట విడాకుల వరకు వెళ్లడం నిజంగా విచారకరం. ఎవరి వ్యక్తిగత నిర్ణయాలు వారివి అయినప్పటికీ.. ఇలాంటి కారణంతో ఒక చక్కటి బంధం ముగిసిపోవడంపై బుల్లితెర అభిమానులు నిరాశచెందుతున్నారు..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×