E-Paper
Advertisement

Sridevi Drama Company: టీవీ చరిత్రలోనే మొదటి సారి… శ్రీదేవి డ్రామా కంపెనీ పై ప్రశంసలు..

Sridevi Drama Company: టీవీ చరిత్రలోనే మొదటి సారి… శ్రీదేవి డ్రామా కంపెనీ పై ప్రశంసలు..
Advertisement

Sridevi Drama Company: బుల్లితెరపై ఎన్నో కార్యక్రమాలు ప్రసారమవుతూ ప్రేక్షకులకు కావలసినంత వినోదాన్ని పంచుతున్నాయి. బుల్లితెర కార్యక్రమాలలో మంచి సక్సెస్ అందుకున్న కార్యక్రమం ఏదైనా ఉంది అంటే అది శ్రీదేవి డ్రామా కంపెనీ (Sridevi Drama Company)కార్యక్రమం కూడా ఒకటి. రష్మీ యాంకర్ గా ఇంద్రజ జడ్జిగా కొనసాగుతున్న ఈ కార్యక్రమంలో భాగంగా జబర్దస్త్ కమెడియన్స్ పాల్గొంటూ సందడి చేస్తున్నారు. ప్రతి ఆదివారం ప్రసారం అవుతున్న ఈ కార్యక్రమానికి మంచి ఆదరణ లభిస్తుంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఒక ప్రోమో వీడియో విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ప్రోమో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మొదటిసారి టీవీ షోలో రంజాన్ వేడుకలు..

ఈ ప్రోమో చూసిన ప్రేక్షకులు నెటిజెన్లు పెద్ద ఎత్తున శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమం, మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సాధారణంగా ఏదైనా పండుగ వచ్చింది అంటే బుల్లితెర చానల్స్ అన్నీ కూడా పెద్ద ఎత్తున సెలెబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఉగాది పండుగ సెలబ్రేషన్స్ సంక్రాంతి సంబరాలు, దసరా ఉత్సవాలు అంటూ తెలుగు పండుగలకు వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహిస్తుంటారు. అయితే ఇప్పటివరకు బుల్లితెర కార్యక్రమాలలో ఎక్కడ కూడా ముస్లిం పండుగలకు సంబంధించి సెలబ్రేషన్స్ జరగలేదు కానీ మొదటిసారి శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో భాగంగా రంజాన్ వేడుకలు (Ramdan Celebrations) నిర్వహించారు.

ముఖ్య అతిథులుగా ఆలీ దంపతులు..

Advertisement

ఇలా రంజాన్ సెలబ్రేషన్స్ పేరిట ఈ షోలో పెద్ద ఎత్తున సంబరాలను నిర్వహించారు .ఇక ఈ కార్యక్రమానికి ఆలీ (Ali)దంపతులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తాజాగా విడుదల చేసిన ప్రోమోలో భాగంగా ఎప్పటిలాగే ఆటపాటలతో ప్రేక్షకులకు కావలసిన వినోదాన్ని అందించారు. అలాగే అలీ భార్య జుబేదా చేతితో తయారు చేసిన బిర్యాని అక్కడున్న వారందరికీ స్వయంగం వడ్డించారు. ఇలా శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో భాగంగా రంజాన్ సెలబ్రేషన్స్ నిర్వహించడంతో అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పటివరకు టీవీ చరిత్రలో ఏ ఛానల్ కూడా ఇలా రంజాన్ సెలబ్రేషన్స్ చేయలేదని మొదటిసారి ఈటీవీలో ప్రసారమవుతుంది పూర్తి ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తున్నాం అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

వెండితెరపై కమెడియన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఆలీ ఇటీవల కాలంలో సినిమాలను కాస్త తగ్గించారని చెప్పాలి. ఈయన తన భార్య జుబేదాతో కలిసి యూట్యూబ్ ఛానల్ ప్రారంభించారు. ఎప్పటికప్పుడు వంటల వీడియోలను షేర్ చేస్తూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇక రంజాన్ నెల వచ్చింది అంటే అలీ దంపతులు పెద్ద ఎత్తున ఫుడ్ చేస్తూ పేదలకు పంచుతూ ఉంటారు. ఇక తాజాగా ఈమె స్వయంగా తన చేతితో తయారు చేసిన బిర్యానీను అక్కడున్న వారందరికీ వడ్డించడంతో హైపర్ ఆది బిర్యానీ చాలా అద్భుతంగా ఉందని, ఇన్ని రోజులు యూట్యూబ్ ఛానల్ లో చూస్తున్నాను కానీ ఇప్పుడు టేస్ట్ చేస్తున్నాను చాలా అద్భుతంగా చేశారు అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ ప్రోమో వీడియో వైరల్ అవుతుంది.

Also Read: BB Jodi2 winners: బిబి జోడి 2 విజేతలుగా మానస్ శ్రేష్టి వర్మ… రన్నర్స్ ఎవరంటే?

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×