E-Paper
Advertisement

Film industry: ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రముఖ నటి.. డ్రైవర్ మృతి!

Film industry: ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రముఖ నటి.. డ్రైవర్ మృతి!
Advertisement

Film industry: ఆవగింజంత అదృష్టం ఉంటే చాలు కెరీర్ ను మార్చుకోవడమే కాకుండా ఏకంగా ప్రాణాలను కూడా కాపాడుకోవచ్చని ఒక ప్రముఖ నటి నిరూపించింది. తాజాగా జరిగిన అత్యంత ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రముఖ నటి కారు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందిన వైనం ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తోంది. ముఖ్యంగా రోడ్డు ప్రమాదంలో నటి చిక్కుకుంది అన్న విషయం తెలియగానే ఆమె అభిమానులు సినీ సెలబ్రిటీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఏం జరిగింది? ఎలా జరిగింది? ఇప్పుడు ఆ నటి ఆరోగ్య పరిస్థితి ఏంటి? ఇలా పలు ప్రశ్నలు సంధిస్తున్నారు.

రోడ్డు ప్రమాదంలో చిక్కుకున్న ప్రముఖ నటి..

ఆమె ఎవరో కాదు కన్నడ, తమిళ్ చిత్రాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్న బుల్లితెర నటి దేవీ ప్రియ (Devi Priya). 38 సంవత్సరాల వయసున్న ఈమె అటు తన నటనతో కుర్రకారు హృదయాలను దోచుకుంటూ బుల్లితెర రంగంలో తనదైన ముద్ర వేసుకుంది. అలాంటి ఈమె తాజాగా రోడ్డు ప్రమాదంలో చిక్కుకుంది. తిరుచ్చి – చెన్నై జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. విషయంలోకి వెళ్తే.. చెన్నై నుంచి ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి థెని వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పెరంబలూర్ వద్ద తన కారు టైర్ పంక్చర్ కావడంతో డ్రైవర్ ముత్తు గణేష్ (38) రోడ్డు పక్కన కారు ఆపి టైరు మారుస్తున్న క్రమంలో అటువైపు వేగంగా వచ్చిన గుర్తు తెలియని వాహనం ఒకటి అదుపుతప్పి దేవి ప్రియ కారును బలంగా ఢీ కొట్టింది.

అక్కడికక్కడే మృతి చెందిన డ్రైవర్.. గాయపడ్డ సహాయకుడు

Advertisement

అయితే ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ ముత్తు గణేష్ అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు ప్రకటించారు. అయితే కారుకు కొద్ది దూరంలో నిలబడి ఉన్న దేవి ప్రియ తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకోవడంతో ఆవగింజంత అదృష్టం ఈమెకు ఊపిరి పోసింది అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ ప్రమాదం నుండి దేవీ తప్పుకున్నప్పటికీ ఆమె సహాయకుడు దివాకర్ తీవ్రంగా గాయపడ్డారు . వెంటనే ఆయనను స్థానికులు పెరంబలూరు ఆసుపత్రికి తరలించారు. మరొకవైపు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ముత్తు గణేష్ మృతదేహాన్ని పోస్ట్ మార్టానికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. ఇక ప్రస్తుతం కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ పరిశీలిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే నిందితులను పట్టుకొని తగిన శిక్ష విధిస్తామని తెలిపారు.

ALSO READ:Sree Vishnu: చేతులు కాల్చుకుంటున్న శ్రీ విష్ణు.. ఇప్పటికైనా ఆ సెంటిమెంట్ బ్రేక్ చేస్తాడా?

దేవీప్రియ కెరియర్..

Advertisement

దేవీ ప్రియా విషయానికి వస్తే.. తమిళ టెలివిజన్ రంగంలో పాపులర్ నటిగా పేరు దక్కించుకున్నారు లక్ష్మి, రోమాపురి పాండియన్, ఎన్ తోజి ఎన్ ఖాదలి ఎన్ మనైవి, తేకతి పొన్ను, సెల్వి వంటి సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపును సొంతం చేసుకుంది.

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×