E-Paper
Advertisement

Emmanuel: 90 ఊర్లు.. కన్నీళ్లు పెట్టిస్తోన్న ఇమ్ము అమ్మనాన్నల ఓటింగ్ ప్రచారం!

Emmanuel: 90 ఊర్లు.. కన్నీళ్లు పెట్టిస్తోన్న ఇమ్ము అమ్మనాన్నల ఓటింగ్ ప్రచారం!
Advertisement

Emmanuel: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 (Bigg Boss Telugu Season 9).. అంతకు ముందు 8 సీజన్లు జరిగినప్పుడు కూడా ఏ కంటెస్టెంట్ అంతగా జనాల్లోకి వెళ్లలేదు. ఆఖరికి విన్నర్ అయిన వారు కూడా ఎవరికీ గుర్తు లేరు. కానీ, సీజన్ 9లోని కంటెస్టెంట్స్ మాత్రం ఇప్పటికీ చాలా మందికి అలా గుర్తుండిపోయారు. ఇంకా చెప్పాలంటే వాళ్ల ఇంట్లోని పర్సన్స్ మాదిరిగా మారిపోయారు. అంతగా ఈ షోకి జనాలు అట్రాక్ట్ అవడానికి కారణం మాత్రం ఇమ్మానుయేల్ అనే చెప్పుకోవాలి. సీజన్ 9 అంతగా జనాల్లోకి వెళ్లడానికి కారణం ఇమ్ము ఇచ్చిన ఎంటర్‌టైన్‌మెంటే. అంతకు ముందు సీజన్స్‌లో కూడా ఎందరో కమెడియన్స్ వచ్చారు కానీ, 100 శాతం ఎంటర్‌టైనర్‌గా గుర్తింపు పొందింది మాత్రం ఇమ్మానుయేల్ (Emmanuel) అంటే అస్సలు అతిశయోక్తి కానే కాదు. ఈ విషయం ఎవరినీ అడిగినా చెప్తారు. కానీ, విజేతగా మాత్రం నిలవలేకపోయారు. ఇప్పుడా షోకి ఎందుకు వెళ్లానా? అని బాధపడుతున్నట్లుగా తాజాగా తన స్పీచ్ వింటే తెలుస్తోంది.

Also Read- Tollywood: మేము కమిట్‌మెంట్ కష్టాలు ఫేస్ చేయలేదు.. ప్రతి నోటా ఇదే మాట!

అందరినీ ఏడిపించేశారు

Advertisement

బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్స్‌తో బీబీ ఉత్సవం పేరుతో స్టార్ మా ఓ కార్యక్రమాన్ని ప్లాన్ చేసింది. ఈ షోకు ఈ సీజన్ 9కు ఎంపికైన వారంతా వచ్చారు. ఆఖరికి హోస్ట్ నాగార్జున (King Nagarjuna) కూడా ఈ కార్యక్రమంలో కాసేపు సందడి చేశారు. ఆదివారం సాయంత్రం స్టార్ మాలో 6 గంటలకు ప్రసారమయ్యే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోని మేకర్స్ వదిలారు. ఈ ప్రోమోలో ఇమ్మానుయేల్ మదర్ కూడా గెస్ట్ అప్పీరియెన్స్ ఇచ్చారు. ఆమె రావడంతో ఇమ్ము ఎమోషనల్ అవుతూ చెబుతున్న మాటలు, అందరినీ కంటతడి పెట్టించాయి. నిజంగా ఇమ్ము విన్నర్ అయితే బాగుండేదని మరొక్కసారి అందరూ అనుకునేలా చేస్తున్నాయి. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..

Also Read- Emmanuel: బిగ్ బాస్ విన్నర్ కాకపోతేనేం.. అంతకుమించిన అవార్డ్‌నే ఇచ్చారుగా?

క్యారేజ్ కట్టుకుని 90 ఊర్లు తిరిగారట

Advertisement

బిగ్ బాస్ షో‌లో కనిపించిన నీ కష్టం వెనుక, కనబడని ప్రేమ ఎంతో ఉంది. ఆ ప్రేమే ఇప్పుడీ రోజు ఈ స్టేజ్‌పైకి రాబోతుంది అని శ్రీముఖి అనౌన్స్ చేయగానే.. ఇమ్మానుయేల్ మదర్ స్టేజ్‌పైకి వచ్చారు. వెంటనే ఇమ్ము మైక్ తీసుకుని.. ‘‘ఎంటర్‌టైనర్‌ని ఎక్కడా విన్నర్‌లా చూడరని నాకు తెలుసు. ఎందుకు చూడరు.. మనం గేమ్ ఆడితే చూస్తారు కదా అనుకున్నాను. నేను ఓడిపోయినందుకు అస్సలు బాధపడలేదు. మా అమ్మ, నాన్న క్యారేజ్ కట్టుకుని, బైక్‌పైన దాదాపు 90 ఊర్లు తిరిగారట. మా కొడుక్కి ఓటు వేయండని పాంప్లెట్స్ పట్టుకుని తిరిగితే.. స్టిల్, ఇప్పటికీ నా మైండ్‌లో అదే రన్ అవుతుంది’’ అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇమ్మానుయేల్ అలా చెబుతుంటే.. అక్కడున్న బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్స్ అందరూ కన్నీటిపర్యంతమయ్యారు. వెంటనే భరణి మైక్ అందుకుని.. అక్కడున్న 22 మంది కప్ కోసమే ఆడతారు. 360 డిగ్రీస్‌లో రియల్ గేమ్ ఆడింది మాత్రం ఇమ్మానుయేల్, నేను మాత్రమే అని మనస్ఫూర్తిగా చెప్పగలనని అనగానే అంతా క్లాప్స్ కొట్టారు.

Also Read- Action Thriller OTT: 65 ఏళ్ల వయసులో కిరాయి హత్యలు… బామ్మ స్కెచ్ వేస్తే చావు మేళమే

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×