E-Paper
Advertisement

Big TV Kissik Talks: నా భర్త ఫైర్ బ్రాండ్ మాత్రమే కాదు.. రొమాంటిక్ కూడా- మాధురి

Big TV Kissik Talks: నా భర్త ఫైర్ బ్రాండ్ మాత్రమే కాదు.. రొమాంటిక్ కూడా- మాధురి
Advertisement

Big TV Kissik Talks: దివ్వెల మాధురి.. దువ్వాడ మాధురి (Duvvada Madhuri)గా ఎలా అయిందో అందరికీ తెలిసిందే. కొన్ని రోజుల పాటు వారి పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ట్రోల్స్ నడిచాయి. ఫైటింగ్స్ నడిచాయి. ఫ్యామిలీ ఇష్యూస్ నడిచాయి. అయినా సరే, వారిద్దరి మధ్య ఉన్న ప్రేమను ఎవరూ ఇంచె కూడా కదిలించలేకపోయారు. మాధురి కోసం తన దువ్వాడ శ్రీనివాస్ (Duvvada Srinivas) తన ఫ్యామిలీని త్యాగం చేస్తే, దువ్వాడ ప్రేమ కోసం మాధురి తన ఫ్యామిలీని దూరం పెట్టేశారు. ఇద్దరూ ఒకటై, జంట పక్షుల్లా ప్రతి వేడుకలో కనిపిస్తూ, వార్తలలో నిలుస్తుంటారు. ఎవరెన్ని మాటలు మాట్లాడుకున్నా, ఎవరెన్ని ట్రోల్స్ చేసుకున్నా మనకు అనవసరం, మన దారి మనదే అనేలా వారి స్టైల్ ఉంటుందంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇద్దరూ ఫైర్ బ్రాండ్స్. అసలు వారిద్దరి మధ్య ప్రేమ ఎలా ఉంటుందని అందరికీ డౌట్స్ ఉండవచ్చు. ఆ డౌట్స్ క్లియర్ చేసేలా ఇప్పుడో వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

Also Read- Duvvada Madhuri: బట్టలిప్పుకుని తిరిగితే స్వాతంత్య్రం వచ్చినట్లు కాదు.. అనసూయకు భారీ పంచ్

‘ఐ లవ్ యు రాజా’ అనగానే

Advertisement

దువ్వాడ మాధురి తాజాగా బిగ్ టీవీ సక్సెస్ ఫుల్ షో ‘కిస్సిక్ టాక్స్’ (Big TV Kissik Talks) పాడ్ క్యాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో యాంకర్ వర్ష.. ‘మీరు ఒక్కసారి మీ వారికి ఫోన్ చేసి, ఐ లవ్ యూ చెబితే.. మీ ఇద్దరి మధ్య ఉన్న క్యూట్ లవ్ చూడాలని అనుకుంటున్నాను’ అని అనగానే క్షణం కూడా ఆలోచించకుండా, ఇంటర్వ్యూ లైవ్‌లో తన భర్త దువ్వాడ శ్రీనివాస్‌కు ఫోన్ చేసిన మాధురి.. ‘ఐ లవ్ యు రాజా’ అని అనగానే, అటు వైపు నుంచి చిరు మందహాసం వినిపించింది. ‘ఎన్ని గంటలకు వస్తావు?’ అని శ్రీనివాస్ అంటే.. ‘మిస్సవుతున్నావా’ అని మాధురి అడిగారు. ‘అర్జెంట్‌గా రా’ అని శ్రీనివాస్ అనగానే మాధురి సంతోషానికి అవధులు లేవంటే నమ్మాలి. వెంటనే యాంకర్ ‘మీరు రొమాంటిక్ కపులా?’ అని అడగగానే.. ‘‘నా భర్త ఫైర్ బ్రాండ్ మాత్రమే కాదు, రొమాంటిక్ కూడా. హి ఈజ్ ఆల్‌రౌండర్’’ అంటూ షాకిచ్చారు మాధురి.

Also Read- Duvvada Madhuri: వాళ్లంతా జెండా కూలీలే.. ఈసారి ఎన్నికల్లో గెలిచేది ఎవరంటే?

ఆ రాతలకు ప్రేమతో చెక్ పెట్టేశారు

Advertisement

వాస్తవానికి చాలా మంది వీరి ప్రేమ అసలు నిలబడుతుందా? అంతా పాలిటిక్స్ కోసమే? అనేలా అప్పట్లో తెగ రాతలు రాసేశారు. కానీ, వారిద్దరి మధ్య ఉన్నది ‘ట్రూ లవ్’ అనేలా ప్రతి సందర్భంలో వారు నిరూపించుకుంటూనే ఉన్నారు. మాధురి బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లినప్పుడు కూడా, దువ్వాడ శ్రీనివాస్ లోన్లీగా ఫీలయ్యానని చెప్పారు. అటు వైపు మాధురి కూడా, తన భర్త బర్త్‌డే పక్కన లేకపోతే ఎలా అంటూ, హౌస్‌లో సేవ్ అయ్యే అవకాశం ఉన్నా కూడా, కావాలని ఎలిమినేటై బయటకు వచ్చేశారు. అలా, వారిద్దరి మధ్య బాండింగ్ చాలా స్ట్రాంగ్ అనే విషయంలో ఇప్పటికే అందరికీ క్లారిటీ కూడా వచ్చేసింది.

Also Read- Romantic Drama OTT : ప్రేమించిన హృదయమే పగతో రగిలితే… ఓటీటీలోకి మైండ్ గేమ్ తో మెంటలెక్కించే స్టోరీ

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×