E-Paper
Advertisement

అభిమానించే వాళ్ళనే చూశా.. అసహ్యించుకునే వాళ్ళని చూడలేదు- దువ్వాడ మాధురి

అభిమానించే వాళ్ళనే చూశా.. అసహ్యించుకునే వాళ్ళని చూడలేదు- దువ్వాడ మాధురి
Advertisement

Big TV Kissik Talks: నన్ను అభిమానించే వాళ్ళనే చూశాను తప్పితే.. నన్ను అసహ్యించుకునే వాళ్ళని నేను ఇంతవరకు ఒక్కళ్ళని కూడా చూడలేదని అన్నారు ఫైర్ బ్రాండ్ దువ్వాడ మాధురి (Duvvada Madhuri). తాజాగా ఆమె బిగ్ టీవీ కిస్సిక్ టాక్స్ (Big TV Kissik Talks) కార్యక్రమంలో పాల్గొని, సోషల్ మీడియాలో తనపై వ్యతిరేకంగా కామెంట్స్ చేసే వారికి ఇచ్చి పడేశారు. ఇంతకీ ఆమె ఏమన్నారంటే..

పని పాట లేని వెధవలు మాత్రమే

ఎప్పుడైనా సార్ కోసం మీరు త్యాగం చేసి వదిలేసింది ఏదైనా ఉందా? అంటే.. ‘‘ఇంకా ఇంతకంటే ఏం త్యాగం చేయాలి? సమాజంతో ఫైట్ చేశాం, ఇంతకంటే ఇంకేం కావాలి? సార్ నా కోసం.. సార్ నా కోసం చాలా వదిలేశారు, సమాజంతోనే ఫైట్ చేశాం ఇంక ఇంతకంటే శాక్రిఫైస్‌లు ఏముంటాయి? సోషల్ మీడియాలో ఎన్నో కామెంట్స్ (Social Media Comments) పెడతారు.. వాళ్లకి ఏం తెలుసని పెడతారు? ఇప్పుడు నా లైఫ్ నాకు తెలుస్తుంది, నా సిట్యుయేషన్ బాగుంటే నేనెందుకు ఇంకొక లైఫ్ చూజ్ చేసుకుంటాను? అతను బాగుంటే.. ఒక పొలిటికల్‌గా ఉండి ఇంత పొజిషన్ లో ఉండి అతనెందుకు ఈ నిర్ణయం తీసుకుంటాడు అని ఆలోచన ఉండాలి కదా! పని పాట లేని వెధవలు మాత్రమే కామెంట్స్ పెడతారు.’’ అని అన్నారు.

Advertisement

Also Read- అవినీతి మరకలేని వ్యక్తి దువ్వాడ శ్రీనివాస్.. అందుకే అరెస్ట్ చేయలేకపోయారు- మాధురి

క్వశ్చన్ చేసేవాళ్ళు ఎదురు పడలే..

అంటే ఎవరైనా మీ మీద పెట్టించడం కానీ అట్లా కూడా జరుగుతాయా? అంటే.. ‘‘ఎందుకు పెట్టరు. ఇప్పుడు అదే కదా.. పొలిటికల్‌గా అదే చెప్తున్నాను. ఒక మహిళ పొలిటికల్‌గా ఉందంటే తనకి వచ్చే నెగిటివ్ ఇదే. పొలిటికల్‌గా ఎవరైతే లేడీస్ ఉన్నారో అందరికీ ఈ నెగిటివ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది, వాళ్ల పోస్ట్‌ల కింద చూస్తే కామెంట్స్ ఖచ్చితంగా ఉంటాయి. అసలు నేను కామెంట్స్ చదవను. కామెంట్స్ ఆపను. తిట్టుకుంటే తిట్టుకోండి అని కామెంట్స్ ఆపను.. కామెంట్స్ చదవను. మన పని మనది.. నా పని నేను చేసుకుంటూ పోతా. నాకు ఇంతవరకు సొసైటీలోకి వెళ్ళినప్పుడు డైరెక్ట్‌గా ఒక్కడు కూడా ‘నువ్వు ఏంటి’ అని క్వశ్చన్ చేసేవాళ్ళు కూడా నాకు ఎదురుపడలేదు. నిజంగా అలాంటి తప్పు చేస్తే అడుగుతారు కదా ఎవరైనా సరే! అభిమానించే వాళ్ళనే చూశాను తప్పితే.. నన్ను అసహ్యించుకునే వాళ్ళని నేను ఇంతవరకు ఒక్కళ్ళని కూడా చూడలేదు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో కామెంట్స్ చేసేవాళ్ళు తప్పితే డైరెక్ట్ గా నేను ఇంతవరకు చూడలేదు. సో, దాని కోసం మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు.

Advertisement

Also Read- Thriller Movie OTT : సైకో ఉచ్చుకు చిక్కే చిన్నది… డేటింగ్ రాత్రి దిమాక్ ఖరాబ్… సీట్ ఎడ్జ్ పక్కా

కోపం కాసేపే ఉంటుంది

నేను చక్కగా నా లైఫ్ లీడ్ చేసుకుంటున్నాను. మంచిగా నా పిల్లల్ని ముగ్గురిని పెంచుకుంటున్నాను, మంచిగా బిజినెస్ చేస్తున్నాను. ఇప్పుడు వంద మందికి జాబ్ ఇస్తున్నాను, ఇంకొక టూ మంత్స్ లో ఇంకొక వంద మందికి జాబ్స్ ఇస్తాను. హ్యాపీగా.. నా వల్ల ఇంకొక 200 మంది, 300 మంది బ్రతుకుతున్నారు హ్యాపీగా, నేను దాని కోసం హ్యాపీగా ఉన్నాను. నా కింద బ్రతుకుతున్న వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు. సో ఎవడో కామెంట్ పెట్టాడని నేను పట్టించుకోవాల్సిన అవసరం నాకు అస్సలు లేదు. నాకు ఎవరైనా, ఏదైనా తప్పు చేస్తే కోపం వస్తుంది, తప్పుగా మాట్లాడినా కోపం వస్తుంది. ఆ కోపం కూడా కాసేపే ఉంటుంది, ఆ కోపం కూడా ఎక్కువ సేపు ఉండదు. మా ఆయన అన్నట్టు ఇంతసేపే.. ఆ తర్వాత అస్సలు కోపమే ఉండదు..’’ అని మాధురి చెప్పుకొచ్చారు.

Also Read- మనీకా? రిలేషన్స్‌కా? దేనికి వేల్యూ ఇస్తారంటే? దువ్వాడ మాధురి ఆన్సర్ ఇదే!

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×