E-Paper
Advertisement

అనిల్ రావిపూడి పేరు మీద 2 షాపింగ్ మాల్స్.. పెద్ద చిక్కు వచ్చి పడిందే!

అనిల్ రావిపూడి పేరు మీద 2 షాపింగ్ మాల్స్.. పెద్ద చిక్కు వచ్చి పడిందే!
Advertisement

Anil Ravipudi: తన సినిమాలతో వెండితెరపై నవ్వుల వర్షం కురిపించే టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, ఇప్పుడు బుల్లితెరపై కూడా అదే రేంజ్‌లో సందడి చేస్తున్నారు. జీ తెలుగులో ప్రసారమవుతున్న పాపులర్ రియాలిటీ షో ‘డ్రామా జూనియర్స్ సీజన్ 9’లో ఆయన జడ్జిగా వ్యవహరిస్తూ చిన్న పిల్లల నటనను ప్రోత్సహిస్తున్నారు. తాజాగా విడుదలైన ఈ షో ప్రోమోలో చిన్నారి కంటెస్టెంట్లు అనిల్ రావిపూడి పేరు మీద షాపింగ్ మాల్స్ పెట్టి, ఓపెనింగ్ కోసం ఆయనతో గొడవ పడుతున్న తీరు నెటిజన్లను ఎంతగానో నవ్విస్తోంది..

బుల్లితెరపై ‘డ్రామా జూనియర్స్’ హంగామా:

బాధల్లో ఉన్నవారు కూడా కాసేపు హాయిగా నవ్వుకునేలా సినిమాలు తీసే అనిల్ రావిపూడి, ఈ షోలో తనదైన కామెడీ పంచ్‌లతో షోను నడిపిస్తున్నారు. ఆయనతో పాటు సీనియర్ నటి రోజా(Roja), శతాధిక చిత్ర కథానాయకుడు శ్రీకాంత్(Sreekanth) ఈ షోలో జడ్జీలుగా సందడి చేస్తుండగా, సుడిగాలి సుధీర్(sudigali sudheer) హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. చిన్న పిల్లలు వేసే స్కిట్లలో పాల్గొంటూ అనిల్ చేసే కామెడీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది.

ఇరియా, శ్రీవియా మధ్య మాటల యుద్ధం:

Advertisement

తాజాగా విడుదలైన ప్రోమోలో చిన్నారి కంటెస్టెంట్స్ ఇర్యా(Irya), శ్రీవియా (Sriviya) మధ్య జరిగిన సరదా ఫైట్ నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. ఇక శ్రీవియా తన మిల్క్ సెంటర్‌కు ‘అనిల్ మిల్క్ సెంటర్’ అని పేరు పెడితే, ఇర్యా తన మ్యాచింగ్ సెంటర్ అండ్ క్లాత్ షోరూమ్‌కు అనిల్ పేరు పెట్టింది. ఇద్దరూ కూడా తమ షాపులను అనిల్ రావిపూడే వచ్చి ఓపెన్ చేయాలని పట్టుబట్టడం విశేషం.

also read:కామెడీతో ఆకట్టుకుంటున్న పళ్ళబురుసు టీజర్.. చూస్తే నవ్వు ఆపుకోలేరు!

అనిల్ రావిపూడి ఫన్నీ రియాక్షన్:

Advertisement

చిన్నారులు ఇద్దరూ తన్నుకునే రేంజ్‌లో గొడవ పడుతుంటే, “నాకు అప్పుడే రిబ్బన్ కట్ చేసి ఓపెనింగ్స్ చేసేంత వయసు వచ్చిందా?” అని అనిల్ రావిపూడి ఫన్నీగా నవ్వేశారు. ఇక పక్కనే ఉన్న యాంకర్ సుడిగాలి సుధీర్ తనదైన శైలిలో వేసిన పంచ్‌లతో ప్రోమో అంతా నవ్వుల పూవులు పూయించింది.

ప్రోమో కు కామెంట్స్ :

అనిల్ పేరు మీద రెండు షాపింగ్ మాల్స్ వచ్చాయని ప్రోమో చూసిన నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. “అనిల్ రావిపూడి రేంజ్ వేరు.. ఆయన పేరు మీదే మాల్స్ వచ్చాయి” అని అంటున్నారు. ఇక ఇప్పుడు ఏ షాపు ఓపెనింగ్‌కు వెళ్తారో, అనిల్ గారికి పెద్ద చిక్కే వచ్చి పడింది” అంటూ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.

నవ్వుల విందుగా డ్రామా జూనియర్స్:

ఎప్పటికప్పుడు వినోదాన్ని అందిస్తూ బుల్లితెర వీక్షకులను ఆకట్టుకుంటున్న డ్రామా జూనియర్స్ షో, ఈ చిన్నారుల క్యూట్ గొడవతో మరింత కలర్‌ఫుల్‌గా మారింది. అనిల్ రావిపూడి చివరకు ఎవరి షాపింగ్ మాల్‌ను ఓపెన్ చేస్తారో చూడాలంటే ఈ వారం ఎపిసోడ్ చూడాల్సిందే.

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×