E-Paper
Advertisement

స్టెరాయిడ్స్ వద్దు… బుల్లితెర హీరో విశ్వకు సలహా ఇచ్చిన రామ్ చరణ్… ఏం జరిగిందంటే?

స్టెరాయిడ్స్ వద్దు… బుల్లితెర హీరో విశ్వకు సలహా ఇచ్చిన రామ్ చరణ్… ఏం జరిగిందంటే?
Advertisement

Tv Actor Vishwa: బుల్లితెర నటుడిగా ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్న వారిలో నడు విశ్వ ఒకరు. అక్కినేని నాగార్జున నిర్మాణంలో తెరకెక్కిన యువ అనే సీరియల్ ద్వారా ఈయన బుల్లితెరకు పరిచయమయ్యారు. ఈ సీరియల్ మంచి సక్సెస్ కావడంతో అనంతరం గంగతో రాంబాబు, గంగ మంగ వంటి సీరియల్స్ ద్వారా నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకొని బిగ్ బాస్ కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. ఇక ఈ కార్యక్రమం తర్వాత పలు బుల్లితెర కార్యక్రమాలలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు ఇటీవల బీబీ జోడి 2 కార్యక్రమంలో కూడా పాల్గొన్న సంగతి తెలిసిందే.

ఫిట్నెస్ సెంటర్ ప్రారంభించిన విశ్వ..

ఇలా నటుడిగా ఒకవైపు సినిమాలలోను సీరియల్స్ లో నటిస్తూ బిజీగా ఉన్న విశ్వ ఫిట్నెస్ సెంటర్ కూడా ప్రారంభించారు. ఫిట్నెస్ కు కేర్ ఆఫ్ అడ్రస్ విశ్వ అనే విధంగా ఈయన బాడీ ఫిట్నెస్ ఉంటుందని చెప్పాలి. ఎక్కువగా వర్కౌట్ చేస్తూ ఫిట్నెస్ కు ప్రాధాన్యత ఇచ్చే విశ్వ ఇప్పుడు ఫిట్నెస్ సెంటర్ ప్రారంభించారు. ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయన తన బాడీ ఫిట్నెస్ పట్ల నటుడు రామ్ చరణ్ చేసిన కామెంట్స్ గురించి మాట్లాడారు. విశ్వ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ది సినిమాలో నటిస్తున్నట్లు తెలిపారు. పెద్ది సినిమా చాలా అద్భుతంగా ఉండబోతుందని కచ్చితంగా ప్రేక్షకులకు మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తుందని విశ్వ తెలిపారు. ఇక రామ్ చరణ్ ప్రస్తావన రావడంతో చరణ్ గురించి విశ్వ మాట్లాడుతూ…

పేరుకే చిరంజీవి కొడుకు కానీ..

Advertisement

రామ్ చరణ్ గారు పేరుకే మెగాస్టార్ చిరంజీవి కొడుకు కానీ డౌన్ టు ఎర్త్ అని తెలిపారు. ఈ విషయం ఎంతోమంది ఎన్నో సార్లు చెప్పారు కానీ చరణ్ అన్నను కలిసినప్పుడే ఆయన ఏంటో పూర్తిగా అర్థమవుతుందని తెలిపారు. పెద్ది సినిమా కంటే ముందుగా ఒకసారి సెలబ్రెటీ క్రికెట్ లీగ్ సమయంలో అన్నను కలిసాను. ఇప్పుడు పెద్ది షూట్ లో చరణ్ అన్నను కలిస్తే నన్ను చూసి గుర్తుపట్టి విశ్వా ఎలా ఉన్నావు అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఆ సమయంలో బాడీ స్ట్రాంగ్ ఉంది ఏం చేస్తున్నావనీ అడిగారని వర్కౌట్స్ అని మాత్రమే చేస్తానని తాను చెప్పాను. బాడీ బిల్డింగ్ కోసం, ఫిట్నెస్ కోసం ఎలాంటి స్టెరాయిడ్స్ కానీ ఇంజక్షన్ కానీ వాడొద్దు అది ఆరోగ్యానికి ప్రమాదం అంటూ చరణ్ అన్న నాకు సలహాలు ఇచ్చారు. నా బాడీలో ఇప్పటివరకు ఎలాంటి ఇంజక్షన్స్ కాని స్టెరాయిడ్స్ కానీ లేవు, కేవలం వర్కౌట్స్ మాత్రమే చేస్తానని చెప్పడంతో ఇలాగే మెయింటెన్ చేయి అంటూ చరణ్ అన్న సలహా ఇచ్చారు . ఒక స్టార్ హీరో అయ్యిండుకొని రామ్ చరణ్ అన్న నాకు ఇలాంటి సలహా ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ అలా చెప్పడం ఆయన మంచితనం అంటూ చరణ్ పై ప్రశంసలు కురిపిస్తూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Also Read: Dacoit Movie: అడివి శేష్ ‘డెకాయిట్ ‘ సెన్సార్ పూర్తి.. రన్ టైం ఎంతంటే?

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×