E-Paper
Advertisement

‘కార్తీక దీపం ‘ జ్యోత్స్న ఇండస్ట్రీలోకి రాకముందు ఏం చేసిందో తెలుసా..?

‘కార్తీక దీపం ‘ జ్యోత్స్న ఇండస్ట్రీలోకి రాకముందు ఏం చేసిందో తెలుసా..?
Advertisement

Karthika Deepam Jyotsana : తెలుగు ఆడియన్స్ ను ఎంతగానో కట్టుకున్న సీరియల్ అంటే టక్కున గుర్తు వచ్చే పేరు కార్తీకదీపం. తెలుపు అలాగే నలుపు రంగులో ఉన్న ఓజంట పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళు ఎదుర్కొన్న పరిస్థితులు ఎలా ఉంటాయి అన్నది ఈ సీరియల్ స్టోరీ.. ఈ సీరియల్ మంచి టిఆర్పి రేటింగ్ సంతకం చేసుకోవడంతో పాటుగా తెలుగు ప్రేక్షకుల హృదయాలను కూడా కొల్లగొట్టేసింది. భారీ రెస్పాన్స్ తో సూపర్ హిట్ టాక్ నందుకు కార్తీకదీపం సీజన్ 2 ఇప్పుడు ప్రసారం అవుతుంది. గతంలో వచ్చిన సీరియల్ లో విలన్ పాత్రలో మోనిత నటించింది. కానీ ఇప్పుడు వచ్చిన సీరియల్ లో విలన్ పాత్రలో జ్యోత్స్న నటిస్తుంది. ఈమె అసలు పేరు ఏంటి? సినిమాలోకి రాకముందు ఏం చేసింది అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.. ఇంతకీ ఈ జ్యోత్స్న పెళ్లికి ముందు ఏం చేసిందో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

జ్యోత్స్న ఇండస్ట్రీలోకి రాకముందు ఏం చేసింది..?

ఒకప్పుడు బుల్లితెరపై సంచలనం సృష్టించిన సీరియల్. ఇప్పుడు మరోసారి అదే స్థాయిలో టీఆర్పీ అందుకుంటున్న కార్తీక దీపం సీరియల్ కు సీక్వెల్ గా కార్తీక దీపం 2 సీరియల్స్ ప్రసారం అవుతున్న విషయం తెలిసిందే. దీప , కార్తీక్ అద్భుతమైన నటనతో మెప్పిస్తున్నారు. అలాగే జ్యోత్స్స పాత్రకు మంచి క్రేజ్ ఉంది. ఎందుకంటే డాక్టర్ బాబు, దీపను దూరం చెయ్యాలనే విలన్ పాత్రలో ఈమె నటిస్తుంది. ఈ పాత్రలో నటిస్తున్న నటి పేరు గాయత్రి సింహాద్రి. ఈమె గురించి సోషల్ మీడియాలో తెగ వార్తలు వినిపిస్తున్నాయి. మొదట ఈ పాత్ర కోసం శోభా శెట్టిని అనుకున్నారట. కానీ చివరి నిమిషంలో గాయత్రిని ఎంపిక చేసుకున్నారట.. ఈమె ఇండస్ట్రీలోకి రాక ముందు ఏం చేసింది అన్నది ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్ అయ్యింది. యాంకర్‌గా సూపర్ ఫ్యామిలీ, జోష్ వంటి కార్యక్రమాలకు హోస్ట్ చేసింది. ఇక ఇన్‌స్ట్రాగ్రామ్‌లో గాయత్రి సింహాద్రికి మంచి ఫాలోయింగ్ ఉంది. అలా సీరియల్స్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే హీరోయిన్ అవుదామని ఇక్కడకు వస్తే విలన్ పాత్రలే ఎక్కువగా వస్తున్నాయట.. ప్రస్తుతం పలు సీరియల్స్ తో బిజీగా ఉంది.

Advertisement

Also Read:‘గుండెనిండా గుడిగంటలు’ శృతి ఆస్తులు.. ఒక్కరోజు రెమ్యూనరేషన్..?

గాయత్రి నటించిన సీరియల్స్ విషయానికొస్తే.. 

ఈ ముద్దుగుమ్మ విలన్ పాత్రలో అద్భుతమైన నటనతో కట్టిపడేస్తుంది గాయత్రి. అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ వస్తుంది. యాంకర్ గా తన కెరీర్ ను మొదలు పెట్టిన ఈమె సీరియల్స్ లోకి నటిగా ఎంట్రీ ఇచ్చింది. అంతకు ముందు పల్లకిలో పెళ్లి కూతురు సీరియల్లో నటించి మెప్పించింది. ఆ సీరియల్ కూడా సూపర్ హిట్ టాక్ ను అందుకుంది.. అయితే త్రినయని వంటి సీరియల్ లో కూడా నటించిన ఈ ముద్దుగుమ్మ తన నటనతో తెలుగు ఆడియన్స్ ను మెప్పించింది.. జీ తెలుగులో ప్రసారమైన పలు సీరియల్స్ లో నటించిన గాయత్రి సింహాద్రి ప్రస్తుతం స్టార్ మా లో ప్రసారమవుతున్న కార్తీకదీపం 2 లో నటిస్తుంది. ఈ సీరియల్ లో నటించినందుకు గాను మంచి రెమ్యూనరేషన్ ను కూడా అందుకుంటుంది. ఈ సీరియల్కు ఈమె దాదాపు 35 వేల వరకు పారితోషకం తీసుకుంటుందని సమాచారం..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×