E-Paper
Advertisement

Bigg Boss Nikhil : బిగ్ బాస్ నిఖిల్ గురించి షాకింగ్ నిజాలు.. అస్సలు ఊహించి ఉండరు..

Bigg Boss Nikhil : బిగ్ బాస్ నిఖిల్ గురించి షాకింగ్ నిజాలు.. అస్సలు ఊహించి ఉండరు..
Advertisement

Bigg Boss Nikhil : ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్స్ గా కొనసాగుతున్న చాలామంది నటీనటులు. గతంలో ఏదో ఒక పని చేసుకుని నటనపై ఆసక్తితో ఇండస్ట్రీ వైపు అడుగులు వేశారు.. యాక్టర్స్ గా రాకముందు ఏదో ఒక ఉద్యోగము లేదా బిజినెస్ చేస్తూ ఉన్నవాళ్లే ఎక్కువగా ఉన్నారు. ఈమధ్య యాక్టర్స్ ఎలాంటి జాబులు చేశారో అన్నది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇక విషయానికొస్తే.. బిగ్ బాస్ విన్నర్ నిఖిల్ గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.. నిఖిల్ ఇండస్ట్రీలోకి రాకముందు ఏం ఉద్యోగం చేశాడు అన్నది ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. మరి నిఖిల్ బ్యాగ్రౌండ్ గురించి? అలాగే ఆయన ఇండస్ట్రీలోకి అడుగుపెట్టకు ముందు ఏం ఉద్యోగం చేశాడు అన్న వివరాలను ఒకసారి మనం తెలుసుకుందాం..

నిఖిల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్..?

బిగ్ బాస్ విన్నర్ నిఖిల్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది.. ఈయన ఒక కన్నడ నటుడు.. కన్నడలో సినిమాలు సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. నిఖిల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ విషయానికి వస్తే ఈయన తండ్రి ఒక జర్నలిస్ట్.. అలాగే ఆయన తల్లి కన్నడ సీరియల్స్ నటి. ఆమె అక్కడ ఎన్నో సీరియస్లలో నటించి నటిగా గుర్తింపు తెచ్చుకుంది.. నిఖిల్ పుట్టి పెరిగింది మైసూర్ లోనే.. బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ గా పని చేసిన నిఖిల్ ఆ తర్వాత నటన వైపు ఆసక్తి పెరగడంతో అవకాశాల కోసం ప్రయత్నాలు చేసాడు. 2016 లో వచ్చిన ఓటి అనే కన్నడ మూవీ తో నటుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. అలా వెండితెరపై నుంచి బుల్లితెరపై సీరియల్స్లలో నటించాడు. ఆయన నటనకు మంచి గుర్తింపు లభించింది. గోరింటాకు సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు నిఖిల్.. ఆ తర్వాత అమ్మకు తెలియని కోయిలమ్మ సీరియల్ లో కూడా నటించాడు.. అలా తన కెరీర్ ని మొదలుపెట్టి ప్రస్తుతం సినిమాలు, సీరియల్స్ తో బిజీగా గడుపుతున్నాడు..

తల్లి వల్లే ఇండస్ట్రీలోకి ఎంట్రీ..

Advertisement

నిఖిల్ తల్లి నటి కావడంతో నిఖిల్ కూడా ఆసక్తి ఎక్కువగానే ఉండేదట. తన తల్లి వల్లే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలని అనుకున్నాడట. గతంలో ఓ ఇంటర్వ్యూలో తన తల్లి గురించి చెబుతూ ఎన్నో విషయాలను పంచుకున్నాడు. నిఖిల్ సీరియల్స్ ద్వారా మంచి క్రేజ్ ని సంపాదించుకోవడంతో పాటుగా తెలుగు రియాల్టీ షో బిగ్ బాస్ లోకి అడుగుపెట్టి విన్నర్ గా నిలిచాడు. ఆ తర్వాత పలు సినిమాలు సీరియల్స్లలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు.. ఇక ఈయన బిగ్ బాస్ లోకి అడుగు పెట్టక ముందే లవ్ ఫెయిల్యూర్ అన్న సంగతి తెలిసిందే.. తెలుగు సీరియల్ హీరోయిన్ కావ్య శ్రీ తో కొన్ని రోజులు ప్రేమాయణం నడిపాడు.. ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ మనస్పర్ధలు రావడంతో బ్రేకప్ చెప్పేసారు.. ప్రస్తుతం ఎవరి లైఫ్ ని వాళ్ళు లీడ్ చేసుకుంటూ ఇండస్ట్రీలో బిజీగా ఉన్నారు. అయితే వీళ్ళిద్దరూ కలవాలని అభిమానులు ఎంతగానో కోరుకుంటున్నారు. ఫ్యూచర్ లో ఏమైనా మనస్పర్ధలు తొలగిపోయి కలుస్తారేమో చూడాలి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×