E-Paper
Advertisement

Divvala Madhuri: తిరుమల కొండ పై నిబంధనలను ఉల్లంఘించిన మాధురి.. ఆగ్రహిస్తున్న భక్తులు!

Divvala Madhuri: తిరుమల కొండ పై నిబంధనలను ఉల్లంఘించిన మాధురి.. ఆగ్రహిస్తున్న భక్తులు!
Advertisement

Divvala Madhuri: దివ్వెల మాధురి పరిచయం అవసరం లేని పేరు. ఈమె రాజకీయాలలో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ ఇటీవల బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 కార్యక్రమానికి వెళ్లడంతో ఈమె సెలబ్రిటీ హోదా కూడా అనుభవిస్తున్నారు .ఒక బిగ్ బాస్ తర్వాత మరింత మంది అభిమానులను సొంతం చేసుకున్న మాధురి సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఇకపోతే నేడు బిగ్ బాస్ తనూజ(Tanuja) పుట్టిన రోజు కావడంతో మాధురి గ్రాండ్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే వివాదంలో కూడా చిక్కుకున్నారు.

తిరుమల కొండపైకి కేకులు నిషేధం..

నేడు బిగ్ బాస్ తనూజ పుట్టిన రోజు కావడంతో తనూజతో పాటు మాధురి (Divvala Madhuri)దువ్వాడ శ్రీనివాస్(Duvvada Srinivas) ముగ్గురు కలిసి తిరుమలకు వెళ్లి స్వామి వారిని దర్శనం చేసుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలా స్వామివారి దర్శనం అనంతరం ఏడుకొండల పై ఒక గెస్ట్ హౌస్ లో మాధురి తనూజకు పుట్టినరోజు సెలబ్రేషన్స్ భాగంగా కేక్ కట్ చేయించి తనకు చీర గాజులతో పాటు బంగారు కమ్మలను కూడా కానుకగా అందించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలా తనకోసం అన్ని తీసుకురావడం మంచిదే కానీ తిరుమల కొండపైకి కేకులు నిషేధం అనే సంగతి అందరికీ తెలిసిందే.

మాధురి పై భక్తులు ఆగ్రహం..

Advertisement

ఇలా స్వామివారి కొండపైకి నిషేధించిన వస్తువులను తీసుకువెళ్లడంతో ఈమె వివాదంలో చిక్కుకున్నారు. తిరుమల కొండ పై ఇటీవల కాలంలో చాలామంది నిబంధనలు ఉల్లంఘిస్తూ రీల్స్ చేయడం ఫోటోషూట్లు చేయడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత రెండు రోజుల క్రితం గీతూ రాయల్ తిరుమల వివాదంలో చిక్కుకున్నారు. ఈ ఘటన మర్చిపోకముందే మరోసారి మాధురి సైతం నిబంధనలను ఉల్లంగించడంతో భక్తులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

?igsh=cjFwd3Uxcm44d2xp

Advertisement

ఇలా ఎన్నో సందర్భాలలో పలువురు తిరుమల నిబంధనలను ఉల్లంఘిస్తున్నప్పటికీ టిటిడి సరైన చర్యలు తీసుకోని నేపథ్యంలోనే ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయని ఇలాంటి వాటిపై తప్పనిసరిగా టీటీడీ అధికారులు చర్యలు చేపట్టాలి అంటూ భక్తులు మండిపడుతున్నారు. అయితే మాధురి ఇలా తిరుమల వివాదంలో చిక్కుకోవడం ఇది మొదటిసారి కాదు గతంలో ఈమె తిరుమల కొండపై రీల్స్ చేయటంతో అప్పట్లో పెద్ద ఎత్తున వివాదం చెలరేగింది .ఈ విషయంపై స్పందించిన మాదురి క్షమాపణలు చెప్పారు. ఒకసారి వివాదంలో నిలిచినప్పటికీ ఈమె తీరు మార్చుకోకుండా మరోసారి కూడా నిబంధనలను తుంగలో తొక్కేస్తూ తిరుమల కొండపైకి కేక్ తీసుకెళ్లి సెలబ్రేషన్స్ నిర్వహించడంతో మరోసారి భక్తులకు మండిపడుతున్నారు. ఈ వివాదంపై మాధురి స్పందన ఏంటనేది తెలియాల్సి ఉంది.

Also Read: Tollywood Actor:పెళ్లి పీటలు ఎక్కబోతున్న మరో టాలీవుడ్ హీరో.. ఎంగేజ్మెంట్ ఫిక్స్!

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×