E-Paper
Advertisement

కళ్ళముందే అమ్మను చితకబాదేవాడు.. నరకం అనుభవించాను – బిగ్ బాస్ బ్యూటీ!

కళ్ళముందే అమ్మను చితకబాదేవాడు.. నరకం అనుభవించాను – బిగ్ బాస్ బ్యూటీ!
Advertisement

Dancer Nainika:సినిమా అయినా సీరియల్ అయినా తెర ముందు సంతోషంగా నవ్వుతూ, నవ్విస్తూ అందరిని ఆకట్టుకునే ఎంతోమంది సెలబ్రిటీలు తమ నిజజీవితంలో మాత్రం భరించలేని నరకాన్ని అనుభవించాం అంటూ చెబుతుంటే.. వారి మాటలు విని ఆడియన్స్ కూడా కన్నీళ్లు పెట్టుకుంటున్నారనడంలో సందేహం లేదు. ముఖ్యంగా ఇలాంటి ఎంతోమంది సెలబ్రిటీలు తమ అనుభవాలను, కష్టాలను ఒకప్పుడు అభిమానులతో పంచుకోవడానికి కాస్త వెనకడుగు వేసేవారు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులకు మరింత చేరువవుతున్నారు. సొంత అనే ఫీలింగ్ కలుగుతున్న నేపథ్యంలో అభిమానులతో తమ బాధను వెళ్లబుచ్చుకుంటూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఇక అలాంటి వారిలో ప్రముఖ బిగ్ బాస్ బ్యూటీ నైనిక కూడా ఒకరు.

ప్రతిరోజు మా అమ్మను మా నాన్న చితకబాడేవాడు -నైనిక

ప్రముఖ డాన్సర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నది..బిగ్ బాస్ తెలుగులో కంటెస్టెంట్ గా పాల్గొని అందరినీ ఆకట్టుకుంది .అందం, అభినయంతో, చలాకీతనంతో ప్రేక్షకులను మెప్పించిన నైనిక జీవితానికి సంబంధించిన విషయాలు తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.అందరినీ ఆకట్టుకునే నైనిక జీవితంలో ఇంత విషాదం ఉందా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నైనిక మాట్లాడుతూ తన తండ్రి తన తల్లిపై చేసిన డొమెస్టిక్ వైలెన్స్, వేధింపుల గురించి ఆరోపణలు చేస్తూ తమకు ప్రతిరోజు నరకం ఏంటో చూపించారు అంటూ ఆమె తెలిపింది. 13 ఏళ్ల వయసులో మళ్ళీ వచ్చి.. వేధింపులు కొనసాగించడంతో నేనే వద్దని పంపించేశాను. ఈ కష్టాలను ఎదుర్కొంటూ నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన నా తల్లి నా బలం అంటూ ఆమె తెలిపింది

మా నాన్న మంచివాడు కాదు – నైనిక

Advertisement

ఇదే విషయంపై నైనిక మాట్లాడుతూ..” మా నాన్న ప్రవర్తన అంత బాగా ఉండేది కాదు. ఆయన మంచి వ్యక్తి కాదు. చిన్నప్పటి నుంచే మా అమ్మను వేధించేవాడు. అరిచేవాడు. కొట్టేవాడు కూడా.. మద్యం తాగి అమ్మ పైన చేయి చేసుకునేవాడు. నేను నా కళ్ళతో చూశాను. నాకు 13 సంవత్సరాల వయసులో మా నాన్న మళ్లీ వచ్చాడు. అమ్మను ప్రతిరోజు కొట్టడం, నిందించడం ఏదో ఒకటి చేసేవాడు. ఇక అమ్మ దుఃఖాన్ని నేను భరించలేకపోయాను. నాన్న చేసే పనులు తట్టుకోలేకపోయాను. అందుకే నాన్న వద్దు అని పంపించేశాను. ఇక అప్పటినుంచి మా అమ్మ ఒంటరిగానే పోరాడింది. నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది. మా అమ్మే నా బలం” అంటూ తెలిపింది నైనిక. ప్రస్తుతం నైనిక చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

also read:జబర్దస్త్ నుండి బయటకు వచ్చేసా.. నిజాలు చెప్పకపోవడమే మంచిది -సౌమ్యరావు

నైనిక కెరియర్..

Advertisement

నైనిక విషయానికి వస్తే బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లోకి 13వ కంటెస్టెంట్ గా హౌస్ లోకి అడుగుపెట్టింది. ఢీ షో లో డాన్సర్ గా గుర్తింపు తెచ్చుకున్న నైనిక టీవీ షో లతో, డాన్స్ పెర్ఫార్మెన్స్ లతో మరింత పాపులారిటీ దక్కించుకుంది. ఇక సోషల్ మీడియాలో రెగ్యులర్గా ఫోటోలు, రీల్స్ చేస్తూ వైరల్ అయింది.

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×