E-Paper
Advertisement

Big TV Kissik Talks: పీఆర్స్ పై దమ్ము శ్రీజ ఊహించని కామెంట్లు.. వారు చెప్పింది నిజమే!

Big TV Kissik Talks: పీఆర్స్ పై దమ్ము శ్రీజ ఊహించని కామెంట్లు.. వారు చెప్పింది నిజమే!
Advertisement

Big TV Kissik Talks:ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ బిగ్ టీవీ (Big TV) ఈ మధ్యకాలంలో ఎక్స్ క్లూజివ్ గా నిర్వహిస్తున్న ఏకైక సెలబ్రిటీ టాక్ షో కిస్సిక్ టాక్స్ (Kissik talks). ఇప్పటికే పలువురు వెండితెర , బుల్లితెర సెలబ్రిటీలతో పాటు బిగ్ బాస్ వంటి రియాలిటీ షోలలో సత్తా చాటిన టాప్ కంటెస్టెంట్స్ కూడా గెస్ట్లుగా వచ్చి పలు విషయాలను అభిమానులతో పంచుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే 47 ఎపిసోడ్లు పూర్తికాగా.. ప్రస్తుతం 48వ ఎపిసోడ్ కూడా పూర్తయింది. అయితే ఈ ఎపిసోడ్ కి బిగ్ బాస్ సీజన్ 9లోకి బిగ్ బాస్ అగ్ని పరీక్ష ద్వారా సత్తాచాటి అడుగుపెట్టిన కామన్ క్యాటగిరి కంటెస్టెంట్ దమ్ము శ్రీజ (Dammu Srija) గెస్ట్ గా విచ్చేసింది. ఇక ఈ కార్యక్రమంలో బిగ్ బాస్ షో గురించి, పీఆర్ టీం గురించి అలాగే తన వ్యక్తిగత విషయాల గురించి ఎన్నో పంచుకుంది.

పీఆర్ టీమ్స్ వల్లే నెగెటివిటీ పెరిగిపోతోంది..

ఇంటర్వ్యూలో భాగంగా హోస్ట్ జబర్దస్త్ వర్ష మాట్లాడుతూ.. “బిగ్ బాస్ లో ట్రోల్స్ చేయడానికి సపరేట్ గా ఒక పీఆర్ టీం ఉంటుందని అంటున్నారు. అది నిజమేనా?” అని ప్రశ్నించగా దమ్ము శ్రీజ మాట్లాడుతూ..” మీరు చెప్పింది నిజమే. బిగ్ బాస్ లో పీఆర్ టీం ఉంటుంది. వాళ్లు 24 గంటలు ఎక్కడ మిస్ అవ్వకుండా చూస్తూనే ఉంటారు. ఎక్కడ ఏ ఒక్క చిన్న తప్పు జరిగినా సరే వెంటనే దానిని ట్రోల్ చేస్తారు. పైగా అది ఎపిసోడ్ కి హైలైట్ గా కూడా నిలుస్తుంది. ఇలా బయట వాళ్ళు అక్కడ ఏదో జరిగిపోయిందని అనుకుంటారు. నిజంగా బిగ్ బాస్ లో జరిగేది ఇదే” అంటూ చెప్పుకొచ్చింది శ్రీజ. మొత్తానికైతే పీఆర్ టీమ్స్ నెగెటివిటీని స్ప్రెడ్ చేయడానికి ప్రత్యేకంగా ఉంటాయి అని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది.

Advertisement

ALSO READ:Sudha Chandran: పూనకంతో ఊగిపోతూ.. 6 నిమిషాల్లో 4 లీటర్ల నీళ్లు తాగేసిన నటి.. అసలేమైందంటే?

ఎదగడానికి కాదు తొక్కడానికే పిఆర్ టీమ్స్..

ఇకపోతే శ్రీజ చేసిన కామెంట్లను బట్టి చూస్తే గతంలో కొంతమంది హీరోయిన్స్ చేసిన విషయాలు నిజమే అనక తప్పదు. టాలీవుడ్ ప్రియమణిని మొదలుకొని బాలీవుడ్లో కొంతమంది హీరోయిన్ల వరకు ఈ పీఆర్ టీమ్స్ గురించి ఊహించని కామెంట్లు చేసిన విషయం తెలిసిందే. ఒకప్పుడు పీఆర్ టీమ్స్ అంటే ఆయా సెలెబ్రిటీల ఇమేజ్ ను పెంచడానికి పనిచేసేవి. కానీ ఇప్పుడు పక్క వాళ్ళ ఇమేజ్ను డామేజ్ చేయడానికి పీ ఆర్ టీమ్స్ పనిచేస్తున్నాయి. అటు సెలబ్రిటీలు కూడా తమకు నచ్చని సెలబ్రిటీలపై తప్పుడు ప్రచారాలు కోసం సపరేట్ గా పీ ఆర్ టీమ్ ను కూడా పెట్టుకుంటున్నారు అంటూ కామెంట్లు చేశారు. మొత్తానికైతే ఎదగడానికి కాదు పక్కవాళ్ళను తొక్కడానికే ఈ పీ ఆర్ టీమ్ లు పనిచేస్తున్నాయనే వార్తలు స్పష్టంగా వ్యక్తమవుతున్నాయి. ఇక అందులో భాగంగానే అటు బిగ్ బాస్ కంటెస్టెంట్ దమ్ము శ్రీజ కూడా ఇలాంటి కామెంట్లు చేయడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×