E-Paper
Advertisement

ఆసియా రూ.5 కోట్ల కట్నంపై క్లారిటీ ఇచ్చిన నూకరాజు!

ఆసియా రూ.5 కోట్ల కట్నంపై క్లారిటీ ఇచ్చిన నూకరాజు!
Advertisement

Kissik Talks on Nookaraju:’పటాస్’ షో ద్వారా కమెడియన్ తన కెరీర్ ను ప్రారంభించిన నూకరాజు (Nookaraju)ఆ తర్వాత ప్రముఖ కామెడీ షో జబర్దస్త్ , శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలలో తన టాలెంట్ ను నిరూపించుకుంటూ బుల్లితెరపై బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయారు. ఒకవైపు బుల్లితెర షోలలో సందడి చేస్తూనే మరొకవైపు కుకింగ్ షోలతో కూడా ఆకట్టుకుంటున్న నూకరాజు.. గతంలో సినిమాలలో కూడా నటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం బుల్లితెరపై దూసుకుపోతున్న నూకరాజు తాజాగా బిగ్ టీవీ ఎక్స్ క్లూజివ్గా నిర్వహిస్తున్న కిస్సిక్ టాక్స్ కార్యక్రమానికి విచ్చేశారు. ఇందులో ఎన్నో విషయాలను పంచుకున్న నూకరాజు.. తాను చేసుకోబోయే అమ్మాయి ఆసియా (Angel Asiya) నుండి రూ.5 కోట్ల కట్నం తీసుకోబోతున్నారు అంటూ వచ్చిన వార్తలకు క్లారిటీ ఇచ్చారు.

ఆసియా నుండి రూ.5 కోట్ల కట్నం.. నూకరాజు క్లారిటీ..

కిస్సిక్ టాక్స్ లో భాగంగా హోస్ట్ వర్ష మాట్లాడుతూ..” ఆసియా నుండి 5 కోట్ల రూపాయలు కట్నం కింద తీసుకోబోతున్నారంట కదా.. నిజమేనా?” అని ప్రశ్నించగా.. నూకరాజు మాట్లాడుతూ..” కట్నం అనే మాట ఊహకు చాలా బాగుంది. కానీ తీసుకోవడం లేదు. ఒకవేళ తీసుకోవాల్సి వచ్చినా అంత కట్నం నేను ఆశించను” అంటూ ఆసియా నుంచి కట్నం తీసుకోవడంపై క్లారిటీ ఇచ్చారు నూకరాజు.

నూకరాజు కోసం పెద్ద బంగ్లా.. ఏమన్నారంటే?

Advertisement

ఇదే ఇంటర్వ్యూలో భాగంగా ఆసియా మీకోసం ఒక పెద్ద బంగ్లా కట్టిస్తోందట కదా! అని వర్ష ప్రశ్నించగా..” అవును, మరి హైదరాబాద్ ని వదిలేసి అక్కడికి వెళ్లి నేను పడుకుంటాను. ఆమె బంగ్లా కట్టిస్తున్నది నిజమే.. కానీ అది నా కోసం కాదు వాళ్ళ ఫ్యామిలీ కోసం.. అదే మా ఫ్యామిలీ కోసం” అంటూ క్లారిటీ ఇచ్చారు. మొత్తానికైతే అటు కట్నం పై ఇటు బంగ్లా పై వస్తున్న వార్తలకు చెక్ పెట్టారు నూకరాజు. ప్రస్తుతం నూకరాజు చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ మారుతున్నాయి.

also read:జానీ మాస్టర్ అవుట్.. సందీప్ ఇన్!

ఆసియాతో ప్రేమ..

Advertisement

జబర్దస్త్ కమెడియన్ నూకరాజు, యాంకర్ కం నటి ఏంజెల్ ఆసియాల మధ్య తెరపై ఏర్పడిన పరిచయం అటు నిజజీవితంలో కూడా మంచి స్నేహానికి దారితీసింది. ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ పండించే సరికి ప్రేమలో ఉన్నారనే కామెంట్లు వినిపించాయి. కానీ ఎక్కడా వీరు తమ ప్రేమ బంధాన్ని ప్రకటించలేదు. అయితే ఇటీవల వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించడమే కాకుండా జంటగా కలిసి పలు ఇంటర్వ్యూలు ఇస్తూ సందడి చేస్తున్నారు. త్వరలోనే ఈ జంట పెళ్లి పీటలెక్కబోతున్నట్లు సమాచారం.

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×