E-Paper
Advertisement

కార్తీకదీపం డాక్టర్ బాబుకు చిరంజీవి తల్లి స్పెషల్ గిఫ్ట్…అంత పెద్ద ఫ్యానా!

కార్తీకదీపం డాక్టర్ బాబుకు చిరంజీవి తల్లి స్పెషల్ గిఫ్ట్…అంత పెద్ద ఫ్యానా!
Advertisement

Karthika Deepam Karthik: పరిటాల నిరుపమ్ అంటే టక్కున అతను గుర్తుకు రాకపోయినా కార్తీకదీపం డాక్టర్ బాబు అంటే మాత్రం అందరికీ టక్కున గుర్తుకు వస్తారు. బుల్లితెర నటుడుగా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న పరిటాల నిరుపమ్(Paritala Nirupam) చంద్రముఖి సీరియల్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ కార్తీకదీపం(Karthika Deepam) సీరియల్ ద్వారా ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు. ఇక ఈ సీరియల్ తర్వాత ఈయన పేరు కార్తీక్ గానే అందరికీ గుర్తుండిపోయింది. ప్రస్తుతం ఈ సీరియల్ రెండో సీజన్ ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే.

డాక్టర్ బాబుకు చిరంజీవి తల్లి అభిమాని..

స్టార్ మా లో ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ కు కేవలం సాధారణ ప్రేక్షకులు మాత్రమే కాకుండా సెలబ్రిటీలు కూడా ఫాన్స్ అయ్యారనే చెప్పాలి అలాంటి వారిలో మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనాదేవి (Anjana Devi)కూడా ఒకరు. అంజనా దేవి కార్తీక దీపం సీరియల్ ద్వారా డాక్టర్ బాబుకు పెద్ద అభిమానిగా మారిపోయారట. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న డాక్టర్ బాబు ఈ విషయాలను బయటపెట్టారు. తను ఉండే కమ్యూనిటీలో అంజనా దేవి కజిన్ ఉండేవారు వాళ్ల ద్వారా నా నెంబర్ తీసుకున్నారు. ఎప్పుడు నా గురించి అడిగే వాళ్ళని తెలుసు అలా నా గురించి అడుగుతున్నారు అంటే మనమే ఒకసారి ఫోన్ చేసి మాట్లాడిస్తే బాగుంటుందని నేనే నెంబర్ తీసుకొని అంజనా దేవి గారికి ఫోన్ చేశానని పరిటాల నిరుపమ్ తెలిపారు.

మామిడి పండ్లు పంపించిన అంజనాదేవి..

Advertisement

ఇలా అంజనా దేవి గారితో మాట్లాడినప్పుడు సీరియల్ చాలా బాగుంది. మీ నటన కూడా బాగుంది. అచ్చం మా కొడుకు లాగే మీరు కూడా అంటూ మాట్లాడటం చాలా బాగా అనిపించిందని నిరుపమ్ తెలిపారు. ఒకసారి నేను ఇంట్లో లేని టైంలో అంజనాదేవి గారి సెక్యూరిటీ రెండు బుట్టల నిండా వారి ఫామ్ హౌస్ లో పండిన మామిడి పండ్లు (Mangoes) తీసుకొచ్చి ఇంట్లో అమ్మకు ఇచ్చి వెళ్లిపోయారు అమ్మ నాకు ఈ విషయం ఫోన్ చేసి చెప్పగా తాను ఎంక్వయిరీ చేస్తే చిరంజీవి గారి అమ్మగారు పంపించారనే విషయం తెలిసి చాలా సంతోషపడ్డానని తిరిగి ఆమెకు ఫోన్ చేసి చాలా థాంక్స్ అమ్మా అంటూ మాట్లాడానని పరిటాల నిరుపమ్ తెలియజేసారు.

ఫోన్ చేసి పలకరించడం గొప్ప విషయం..

Advertisement

ఇలా ఒక సీరియల్ ద్వారా ఎంతోమంది మనల్ని ఇష్టపడటం సర్వసాధారణం అయితే తమ ఇష్టాన్ని ఇలా వ్యక్తపరచడం చాలా అరుదని తెలిపారు. ఇలా మన నటన చూసి మనల్ని ప్రశంసించడానికి ఇతరులు ఫోన్ చేశారు అంటే మన ఇంపాక్ట్ వారిపై ఎంతో కొంత ఉంటుందని అందుకే రియాక్ట్ అవుతారు అంటూ ఈయన తన సంతోషాన్ని వ్యక్తపరిచారు. ఇలా కార్తీకదీపం సీరియల్ కు, డాక్టర్ బాబుకు మెగాస్టార్ చిరంజీవి తల్లి గారు కూడా వీరాభిమాని అనే విషయం తెలిసిన డాక్టర్ బాబు అభిమానులు కూడా ఫిదా అవుతున్నారు.

Also Read: పెద్ది స్పెషల్ సాంగ్ పై మృణాళ్ ఠాకూర్ రియాక్షన్ ..ఒక్క మాటతో క్లారిటీ ఇచ్చేసిందిగా?

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×