E-Paper
Advertisement

Mana Shankara Vara Prasad Garu: మన ప్రసాద్‌ గారు బుల్లితెరపై కూడా కుమ్మేశారు.. టీఆర్పీ ఎంతంటే?

Mana Shankara Vara Prasad Garu: మన ప్రసాద్‌ గారు బుల్లితెరపై కూడా కుమ్మేశారు.. టీఆర్పీ ఎంతంటే?
Advertisement

Mana Shankara Vara Prasad Garu: మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) క్రేజ్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు కానీ, ఆయన బాక్సాఫీస్ వద్దే కాదు బుల్లితెరపై కూడా సునామీ సృష్టించగలరని మరోసారి నిరూపించారు. హిట్ మెషిన్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ సంక్రాంతికి వచ్చిన ‘మన శంకర వర ప్రసాద్ గారు’ (Mana Shankara Vara Prasad Garu) సినిమా థియేటర్లలోనే కాకుండా, బుల్లితెరపై కూడా సునామీ సృష్టించేసింది. వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా జీ తెలుగు (Zee Telugu)లో ప్రసారమైన ఈ చిత్రానికి అదిరిపోయే టీఆర్పీ వచ్చినట్లుగా మేకర్స్ అధికారికంగా పోస్టర్ విడుదల చేశారు. థియేటర్లలో ప్రేక్షకులను అలరించి, రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ రాబట్టిన ఈ చిత్రం.. ఇప్పుడు స్మాల్ స్క్రీన్‌ (Small Screen)పై కళ్లు చెదిరే రేటింగ్స్‌తో చరిత్ర సృష్టించడం విశేషం. మెగాస్టార్ మ్యాజిక్ ఇటు మాస్ ప్రేక్షకులను, అటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఏ స్థాయిలో కట్టిపడేసిందనే దానికి ఉదాహరణ ఈ టీఆర్పీనే.

Also Read- Allu Aravind: ఆ ట్యాగ్‌లైన్ ఇస్తూ.. సీఎం రేవంత్ పై అల్లు అరవింద్ పొగడ్తల వర్షం

స్మాల్ స్క్రీన్ పైనా రికార్డే..

Advertisement

సంక్రాంతికి వచ్చిన ఈ చిత్రాన్ని థియేటర్లలో చూసేందుకు ప్రేక్షకులు ఎగబడ్డారు. సంక్రాంతి తర్వాత చాలా సినిమాలు విడుదలైనా, ఓటీటీలోకి ఈ సినిమా వచ్చినా కూడా.. థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా 50 రోజులు పూర్తి చేసుకుందీ చిత్రం. ఫిబ్రవరి 28న వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా జీ తెలుగులో ప్రసారమై ఏకంగా 14.2 TRP రేటింగ్‌ (Mana Shankara Vara Prasad Garu TRP Rating)ను సొంతం చేసుకుని బుల్లితెరపై మెగా మాసివ్ రికార్డును నెలకొల్పింది. ప్రస్తుత డిజిటల్ యుగంలో, ఓటీటీల హవా నడుస్తున్న సమయంలో కూడా ఒక సినిమాకు ఈ స్థాయిలో టీఆర్పీ రావడం అంటే అది సామాన్యమైన విషయం కాదనే చెప్పుకోవాలి. మెగాస్టార్ చిరంజీవి గ్రేస్, అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్టైన్మెంట్ కలగలిసి ఈ రేంజ్ సక్సెస్‌ను అందించాయి. ఈ ఘనతతో చిరంజీవి తన సత్తా తగ్గలేదని, బుల్లితెర బాస్ కూడా తానేనని గట్టిగా చాటి చెప్పారు. సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ ఈ రేటింగ్స్‌ చూసి పండగ చేసుకుంటున్నారు.

Also Read- CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి ఏ హీరో ఫ్యాన్ అంటే?

మెగా ఫ్యాన్స్‌కు మరింత బూస్ట్

Advertisement

కేవలం సినిమాగానే కాకుండా, చిరంజీవి రియల్ నేమ్ (శంకర వర ప్రసాద్) టైటిల్‌లో ఉండటం కూడా ప్రేక్షకులలో ఒక రకమైన ఎమోషనల్ కనెక్టివిటీని పెంచింది. సాహు గారపాటి, సుస్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో అందించిన సంగీతం అదనపు ఆకర్షణగా నిలిచింది. పండగ వాతావరణంలో థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా మెగాస్టార్ కెరీర్‌లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్‌గా నిలిచి దాదాపు రూ. 400 కోట్ల కలెక్షన్స్‌ను రాబట్టింది. ఇప్పుడు టెలివిజన్‌లోనూ ప్రసాద్ ‌గారు కుమ్మేశారు. ఇక మెగా ఫ్యాన్స్‌కు ఇంతకంటే ఏం కావాలి? ఇకపై మెగాస్టార్ నుంచి రాబోయే ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని మెగా ఫ్యాన్స్ ఈ సందర్భంగా కామెంట్స్ చేస్తున్నారంటే.. ఈ సినిమా వారికి ఎంతగా బూస్ట్ ఇచ్చిందో అర్థం చేసుకోవచ్చు.

Also Read- Carmeni Selvam Teaser: డబ్బు సంపాదించడానికి చాలా మార్గాలున్నాయ్.. ఇదేదో రిలేటెడ్‌గా ఉందే!

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×