E-Paper
Advertisement

Chef Mantra Project K S5: ఒకే ఏడాదిలో 2 సీజన్లు.. గ్లింప్స్ రిలీజ్.. ప్రీమియర్ ఎప్పుడంటే?

Chef Mantra Project K S5: ఒకే ఏడాదిలో 2 సీజన్లు.. గ్లింప్స్ రిలీజ్.. ప్రీమియర్ ఎప్పుడంటే?
Advertisement

ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలకు, ప్రేక్షకులకు మధ్య సంబంధాన్ని మరింత పెంచడానికి అటు ఓటీటీ సంస్థలు కూడా పెద్ద ఎత్తున పాటుపడుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఎన్నో ఓటీటీ సంస్థలు సెలబ్రిటీల చేత టాక్ షోలు నిర్వహిస్తూ.. తద్వారా సెలబ్రిటీలకు సంబంధించిన ఎన్నో విషయాలను అభిమానులకు చేరవేస్తున్నారు. అంతేకాదు లైవ్ సెషన్ నిర్వహిస్తూ మరీ.. ప్రేక్షకుడికి – సెలబ్రిటీకి మధ్య దూరాన్ని కూడా తగ్గిస్తున్నారు. ఇకపోతే ఇంకొన్ని ఓటీటీ సంస్థలు మాత్రం మంచి వినోదాన్ని పెంచే ఎంటర్టైన్మెంట్ షోలను నిర్వహించడమే కాకుండా గుమగుమలాడే రుచులను ఆడియన్స్ కి చూపిస్తూ మరింత పాపులారిటీ సొంతం చేసుకుంటున్నాయి.

చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ K కొత్త సీజన్ ప్రారంభం..

ఈ క్రమంలోనే ఇప్పుడు తాజాగా మరో షో సరికొత్త సీజన్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అదే చెఫ్ మంత్ర ప్రాజెక్టు – K. ఇప్పటికే నాలుగు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో.. అటు ఆడియన్స్ లో కూడా మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది. ఆహా ఓటీటీలో ప్రసారమవుతున్న ఈ సీజన్ కి సుమా కనకాల (Suma Kanakala) హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ K కొత్త సీజన్ కి సంబంధించిన గ్లింప్స్ ను ఆహా నిర్వాకులు విడుదల చేయగా.. ఈ కొత్త సీజన్ నవంబర్ 20 నుంచి రాత్రి 7 గంటలకు ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది అని తెలిపారు.

Advertisement

ALSO READ:Rashmika: ఏంటీ.. 4వేల కోట్ల రష్మికనే మూవీ నుంచి తప్పించారా.. ఇదెక్కడి దారుణం?

గ్లింప్స్ ఎలా ఉందంటే?

గ్లింప్స్ విషయానికి వస్తే.. “ఒకే ఏడాది రెండు సీజన్స్ మొదలుపెట్టిన ఏకైక షో చెఫ్ మంత్ర ప్రాజెక్టు – కే”అంటూ సుమా మరొకసారి తన అద్భుతమైన ఎనర్జీ లెవెల్స్ తో షో ను ప్రారంభించబోతోంది. ఆడియన్స్ కోరిక మేరకు ఒకే ఏడాది రెండవ సీజన్ ని కూడా మొదలు పెట్టబోతున్నామని ఆమె స్పష్టం చేసింది. ఆడియన్స్ కోరిక మేరకు అని చెప్పడంతో ఈ షో కి ఏ రేంజ్ లో పాపులారిటీ పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే ఇందులో సుమాతో పాటు ప్రముఖ నటుడు జీవన్ కుమార్ కూడా తన వంతు వినోదాన్ని జోడించనున్నారు. ఈసారి దీపికా రంగరాజు, అఖిల్ , సుప్రీత , యాదమ్మ రాజు , మానస్, టేస్టీ తేజ, పండుతో పాటు కొంతమంది సీరియల్ నటీ నటులు రుచికరమైన వంటకాలను ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నారు.

Advertisement

అటు తెలుగింటి వంటకాలతో పాటు ఇటు సర్ప్రైజ్ చేసే క్రియేటివ్ వంటకాలు కూడా ప్రతి ఎపిసోడ్లో చెఫ్ మంత్ర ప్రాజెక్టు K సీజన్ 5 అందించనున్నట్లు సమాచారం. ఇప్పటికే నాలుగు సీజన్లతో సక్సెస్ అయిన ఈ షో ఈ ఐదవ సీజన్ తో మరెలాంటి సక్సెస్ ను తన ఖాతాలో వేసుకుంటుందో చూడాలి.

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×