E-Paper
Advertisement

సుధీర్ కి అలాంటి సలహా ఇచ్చిన చలాకీ చంటి.. ఏంటో తెలుసా?

సుధీర్ కి అలాంటి సలహా ఇచ్చిన చలాకీ చంటి.. ఏంటో తెలుసా?
Advertisement

Tollywood:టాలీవుడ్ కమెడియన్ చలాకీ చంటి గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన అద్భుతమైన కామెడీ టైమింగ్ తో ఎంతోమందిని అలరించి ఊహించని పాపులారిటీ సొంతం చేసుకున్నారు. జబర్దస్త్ కమెడియన్ గా కెరియర్ ను ప్రారంభించి, ఆ తర్వాత సినిమాలలో నటిస్తూ మంచి పేరు సొంతం చేసుకున్న చంటి.. తన కెరియర్లో భీమిలి కబడ్డీ జట్టు సినిమాలోని అమాయకమైన పాత్రను ఎంతో ఇష్టపడతానని ఆ సినిమాతోనే తనకు మంచి గుర్తింపు వచ్చిందని తెలిపారు. ఇక ‘సినిమా చూపిస్త మామ’ సినిమాలో ఫ్రస్ట్రేటెడ్ పాత్రతో అందరినీ మెప్పించిన ఈయన తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని.. కథాంశంపై పూర్తి అవగాహన ఉంటేనే నటనలో స్పష్టత ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.

సుధీర్ కి అలాంటి సలహా ఇచ్చాను..

ఇకపోతే ఇదే ఇంటర్వ్యూలో ఎన్నో చెప్పుకొచ్చిన చలాకీ చంటి సుడిగాలి సుధీర్ కి అలాంటి సలహా ఇచ్చానని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు.. చలాకీ చంటి మాట్లాడుతూ.. “ఇండస్ట్రీలో నేనెప్పుడూ కూడా అవకాశాల కోసం ఎవరిని అడగలేదు. ఒకానొక దశలో నిరాశ ఎదురైనా ప్రతి ఒక్కరికి ఒక సమయం వస్తుందని ఎంతో నమ్మాను. నా నటనకు ఇచ్చే విలువను ఇతరులతో పోల్చి తగ్గించడం నాకు చాలా బాధ కలిగించింది. అందుకే నా ఆత్మగౌరవాన్ని వదులుకోనని స్పష్టం చేశాను. ఆ తర్వాత వచ్చిన సుధీర్ లాంటి నటులు స్టార్లుగా ఎదగడం పట్ల నాకు చాలా సంతోషంగా ఉంది. అందుకే నేను నా కెరియర్ లో చేసిన తప్పులను చేయవద్దని సుధీర్ కి వ్యక్తిగతంగా సలహాలు ఇచ్చాను. భవిష్యత్తులో వాళ్ళు మరిన్ని శిఖరాలు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే జీవితం అనేది ఒక సైకిల్ లాంటిది ఒడిదుడుకులు సహజం .అన్నింటిని ఎదుర్కొని ధైర్యంగా నిలబడినప్పుడే మనం సమాజానికి ఏంటో నిరూపించగలుగుతాం అంటూ తన అభిప్రాయాలను చెప్పుకొచ్చారు చంటి.

Advertisement

also read:చిరు మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడేం చేస్తోందో తెలుసా?

సోషల్ మీడియా రూమర్స్ పై చంటి ఆవేదన..

అలాగే సోషల్ మీడియా రూమర్స్ పై కూడా ఆయన స్పందించారు. నేను పుట్టుకతోనే పూర్తిగా శాకాహారిని. విదేశాలకు వెళ్ళినప్పుడు వెజిటేరియన్ ఆహారం దొరకడం చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇప్పటివరకు మాంసాహారం ముట్టలేదు. కెరియర్ లో చిన్న విరామం వచ్చిన సమయంలో యూట్యూబ్ నా గురించి తప్పుడు వార్తలు ప్రచురించి. తప్పుడు తంబు నెయిల్స్ తో నన్ను మానసికంగా ఇబ్బందులకు గురి చేశారు. ఆ బాధ నుంచి కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. ఇప్పుడు మళ్లీ నటనపై దృష్టి పెట్టి పింక్ ఎలిఫెంట్ , బరి వంటి కొత్త ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాను అంటూ చలాకీ చంటి తెలిపారు. మొత్తానికైతే చలాకీ చంటి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని మళ్లీ తనను తాను నిరూపించుకోవడం ప్రశంసనీయం అంటూ అభిమానులు సైతం కామెంట్లు చేస్తున్నారు. ఇక సుధీర్ విషయానికి వస్తే జబర్దస్త్ కమెడియన్ గా తన కెరియర్ను ప్రారంభించి.. ఆ తర్వాత హీరోగా అవతరించారు. ఇక ప్రస్తుతం షోలు సినిమాలు అంటూ బిజీగా గడిపేస్తున్న ఈయన గోట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. మరి ఈ సినిమాతో సుధీర్ ఎలాంటి సక్సెస్ సొంతం చేసుకుంటారో చూడాలి.

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×