E-Paper
Advertisement

Brahmamudi Serial Today September 27th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కావ్యకు రాజ్‌ డెడ్‌ లైన్‌ – బిడ్డే ముఖ్యమన్న కావ్య

Brahmamudi Serial Today September 27th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కావ్యకు రాజ్‌ డెడ్‌ లైన్‌ – బిడ్డే ముఖ్యమన్న కావ్య
Advertisement

Brahmamudi serial today Episode: కావ్యకు నిజం తెలసినా కూడా తనకు తన బిడ్డే కావాలని ఏడుస్తూ స్పృహ తప్పి కింద పడిపోయినట్టు రాజ్‌ కలగంటాడు. దీంతో ఇంట్లో ఈ విషయం ఎవ్వరికీ చెప్పకూడదు అనుకుంటాడు. వాళ్లు కళావతికి చెప్పేస్తారు. ఫైనల్‌గా ఇదే జరుగుతుంది. కడుపులో బిడ్డను మోస్తే తన ప్రాణం పోతుందని తెలిసినా కళావతి బిడ్డను కనడానికే ఇష్టపడుతుంది తప్పా ఆ బిడ్డను చంపుకోవడానికి ఒప్పుకోదు.. నేను ఊహించింది జరగకూడదంటే ఈ నిజం బయటకు రాకూడదు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా.. ఎన్ని అవమానాలు జరిగినా ఈ నిజం ఎవ్వరికీ చెప్పకూడదు అనుకుంటాడు.

హాల్లో అందరూ బాధగా కూర్చుని ఉంటారు. ఇంతలో ధాన్యం వచ్చి అక్కా గొడవ జరిగినప్పటి నుంచి ఎవ్వరూ కూడా ఏమీ తినలేదు.. కాస్త తిందురు రండి అక్కా అంటూ పిలుస్తుంది. దీంతో అపర్ణ మనసే బాగా లేనప్పుడు ఆకలి మాత్రం ఎలా వేస్తుంది ధాన్యం.. అంటుంది. ఉన్నపళంగా వాడు ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంటాడని నేను కలలో కూడా అనుకోలేదు అంటుంది ఇంద్రాదేవి. వాడికి ఏదో పిచ్చి పచ్చినట్టు ఉంది అత్తయ్యా లేదంటే ఇంత ఘోరమైన నిర్ణయం ఎలా తీసుకుంటాడు. నిన్నటి వరకు బిడ్డ పుడుతుందని మురిసిపోయాడు. మనకు ఏరోజు గ్లాసుడు మంచినీళ్లు ఇవ్వని రాజ్‌ కావ్య చేత పనులు మాన్పించేశాడు. కావ్యను కాలు కింద పెట్టనివ్వకుండా చూసుకున్నాడు. బిడ్డ పుట్టకముందే తన కోసం డ్రెస్సులు కొంటూ షాపింగులు చేస్తుంటే.. మురిసిపోయాను.. కానీ వాడు ఇలా సడెన్‌గా అబార్షన్‌ చేయించాలనుకోవడం అసలు ఎక్స్‌ ఫెక్ట్‌ చేయలేదు. అసలు వాడు ఎందుకిలా  చేస్తున్నాడు.. బిడ్డను ఎందుకు వద్దనుకుంటున్నాడో నాకేమీ అర్థం కావడం లేదు అత్తయ్యా అంటుంది అపర్ణ.

Advertisement

దీంతో ధాన్యలక్ష్మీ మన ఇంటికి ఏదో పీడ పట్టుకుంది అక్క శాంతి చేయిస్తే కానీ ఇలాంటి సమస్యలు రాకుండా ఉండేలా లేవు.. అంటుంది. స్వప్న కూడా అవును ఆంటీ మొన్నటి వరకు ఇబ్బంది పడ్డ కావ్యకు తన బిడ్డ కారణంగా సంతోషం వస్తుందని ఆశపడ్డాను.. కానీ ఇప్పుడు మరో కొత్త సమస్యకు ఆ బిడ్డే కారణం అవుతుందని అనుకోలేదు.. అంటుంది. ప్రకాష్‌ కూడా అన్నయ్య ఇప్పుడు మనం ఆలోచించాల్సింది కావ్య బాధకు కారణం ఏంటా అని కాదు. ఈ సమస్యకు సొల్యూషన్‌ ఏంటా..? అని ఏదో ఒకటి చేసి రాజ్‌ మనసు మార్చాలి అన్నయ్యా.. దాని గురించి ఆలోచించండి అని చెప్తాడు. దీంతో సుభాష్‌.. ఆలోచించినా ఉపయోగం లేదేమోరా..? అదేంటి అన్నయ్యా ఉపయోగం లేకపోవడం ఏంటి..? అంటాడు ప్రకాష్‌.

ఇందాక చూశాం కదరా..? వాడు ఎలా మాట్లాడాడో.. ఈ విషయంలో వాడు బాగా ఆలోచించాకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఉన్నాడు.. ఈ నిర్ణయంలో వాడు మన మాట వినడేమో అంటాడు సుభాష్‌.. దీంతో రాహుల్‌ అలా అని రాజ్‌ ను తన  నిర్ణయానికే వదిలేస్తామా మామయ్య అంటాడు. వదిలేయక ఏం చేయగలంరా అని అడుగుతుంది రుద్రాణి.. చేయగలం మమ్మీ .. చీమలు తలుచుకుంటే పాముల్ని చంపేసినట్టు.. మనం తలుచుకుంటే ఏమైనా చేయోచ్చు అంటాడు రాహుల్‌. అందరం కలిసి మాట్లాడితే రాజ్‌ కచ్చితంగా తన నిర్ణయం మార్చుకుంటాడు అని చెప్పగానే.. అసలు మారడు అని సొంత తండ్రి చెప్తుంటే మారుతాడని ఎలా చెప్తావు అంటుంది. దీంతో రాహుల్ రాజ్‌ ను ఎలా మార్చాలో ప్లాన్‌ చెప్తాడు. అందరూ ఆలోచిస్తుంటారు..

Advertisement

తర్వాత కావ్య రూంలో కూర్చుని బాధపడుతుంది. రాజ్‌ వెళ్తాడు. కావ్య ఎమోషనల్ అవుతుంది. నా మీద ప్రేమ ఉంది కానీ మన బిడ్డ ఎందుకు వద్దంటున్నారు చెప్పండి అంటూ అడుగుతుంది. దీంతో బాగా పొద్దు పోయింది కళావతి పడుకో అంటూ చెప్పి రాజ్‌ వెళ్లిపోతాడు. తర్వాత రాజ్‌ను అందరూ కలిసి కన్వీన్స్‌ చేయాలనుకుంటారు. రాజ్‌ కన్వీన్స్‌ కాడు. కావ్య కూడా రాజ్‌ను తిడుతుంది. ఈ విషయంలో నా డిసీషన్‌ నేను మార్చుకోను అంటుంది కావ్య. దీంతో రాజ్‌ అయితే నీకు నేను కావాలో.. మన బిడ్డ కావాలో నిర్ణయించుకో అంటాడు. రెండు కావాలని తెలివిగా సమాధానం చెప్పకు అంటాడు రాజ్‌. సరే అయితే మీ నిర్ణయం మీరు తీసుకున్నప్పుడు నా నిర్ణయం నేను తీసుకుంటాను.. నాకు మీకన్నా నా బిడ్డే ముఖ్యం అని కావ్య చెప్తుంది. రాజ్‌ షాక్‌ అవుతాడు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×