E-Paper
Advertisement

Brahmamudi Serial Today September 26th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: అపర్ణకు నిజం చెప్పిన రాజ్‌

Brahmamudi Serial Today September 26th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: అపర్ణకు నిజం చెప్పిన రాజ్‌
Advertisement

Brahmamudi serial today Episode: గార్డెన్‌లో కూర్చున్న రాజ్‌ దగ్గరకు కళ్యాణ్‌ వెళ్లి ఓదారుస్తుంటాడు. ఇప్పటికైనా వదినకు నిజం చెప్పు అన్నయ్యా అంటూ చెప్తాడు. చెప్పలేనురా నిజం చెప్పి మీ వదినను దూరం చేసుకోలేను అంటాడు రాజ్‌. అయితే కనీసం అమ్మానాన్నలకైనా నిజం చెప్పు అన్నయ్యా అందరూ నిన్ను కార్నర్‌ చేసి తిడుతుంటే నేను చూడలేకపోతున్నాను త్వరగా నువ్వు ఎవరికో ఒకరి నిజం చెప్పు అన్నయ్యా అంటూ కళ్యాణ్‌ వెళ్లిపోతాడు.

రూంలో అపర్ణ, సుభాష్‌ ఆలోచిస్తుంటారు. అపర్ణ కోపంగా అటూ ఇటూ తిరుగుతూ రాజ్‌ అన్న మాటలు గుర్తు  చేసుకుంటూ చ అసలు వాడు ఇలాంటి పనులు చేశాడంటే నమ్మలేకపోతున్నాను అండి.. అంటుంది. నేను అదే ఆలోచిస్తున్నాను అపర్ణ. అన్ని విషయాల్లోనూ ఎంతో పర్టిక్యులర్ గా ఉండే రాజ్‌ ఈ విషయంలో ఎందుకు ఇంత పూలిష్‌ గా ఉన్నాడో అర్థం కావడం లేదు.. అంటాడు సుభాష్‌. లేదంటే వాడికి గతం గుర్తుకు వచ్చినప్పుడే ఏదో జరిగి ఉంటుంది. లేదంటే నా కొడుకు ఇలా చేయడండి. అసలు వాడు మాట్లాడే విధానం చూస్తుంటే అసలు వాడు మన రాజ్‌ యేనా అనే అనుమానం వస్తుంది. ఇలా ఉన్న పళంగా అబార్షన్‌ చేయించడానికి తీసుకెళ్లడం ఏంటండి.. అది కూడా మనతో ఒక్క మాట కూడా చెప్పకుండా.. అప్పుడే వాడు అంత పెద్ద వాడు అయిపోయాడా..? అంటూ అపర్ణ బాధపడుతుంది.

Advertisement

దీంతో సుభాష్‌ నువ్వు ఇంకా వాడు మనతో చెప్పలేదు అనే దగ్గరే ఉన్నావు కానీ వాడు కావ్యకు కూడా చెప్పలేదు కదా..? మనకే ఇలా ఉంటే పాపం హాస్పిటల్‌ వరకు చెకప్‌ కోసం అంటూ వెళ్లిన కావ్యకు ఎలా ఉంటుందో ఆలోచించు.. నిన్నటి వరకు బిడ్డే ప్రాణం అనుకున్న రాజ్‌ ఈరోజు ఆ బిడ్డ ప్రాణాలే తీయడానికి తీసుకెళ్లాడని తెలియగానే కావ్య ఎలా తట్టుకుని ఉంటుంది.  వాడికసలు కామన్‌సెన్సే లేదు అంటాడు. కామనె సెన్సే కాదండి వాడికసలు బ్రెయినే పని చేయడం లేదేమో.. అసలు ఎందుకు ఇంత చెత్త పని చేయాలనుకున్నాడో కడిగేసి వస్తాను అంటూ అపర్ణ బయటకు వెళ్తుంటే.. రాజ్‌ వస్తాడు. రాజ్‌ చూసిన అపర్ణ ఓ వచ్చావా..? ఎందుకిలా పిచ్చోడిలా ప్రవర్తిస్తున్నావు.. మమ్మల్ని ఎందుకిలా ఏడిపిస్తున్నావు.. నీకేమైనా పిచ్చి కానీ పట్టిందా..? అంటూ నిలదీయగానే..

నాకేం పిచ్చి పట్టలేదు.. నేను బాగానే ఉన్నాను అంటాడు రాజ్‌. మరైతే దాన్ని హాస్పిటల్‌కు ఎందుకు తీసుకెళ్లావు.. నీ బిడ్డను నువ్వే ఎందుకు చంపాలనుకున్నావు చెప్పు అంటూ అపర్ణ కోపంగా రాజ్‌ గల్లా పట్టుకుని నిలదీస్తుంది. దీంతో రాజ్‌ ఆ బిడ్డను తీసేయకపోతే కళావతి చచ్చిపోతుంది అమ్మా అని చెప్తాడు. రాజ్‌ మాటలకు అపర్ణ, సుభాష్‌ షాక్‌ అవుతారు. ఏంట్రా నువ్వు చెప్పేది.. అంటూ అపర్ణ అడుగుతుంది. కావ్య చనిపోవడం ఏంట్రా అని సుభాష్‌ అడుగుతాడు. దీంతో రాజ్‌ ఏడుస్తూ.. అవును నాన్న కళావతి బిడ్డను కంటే తను చచ్చిపోతుంది. అంటూ డాక్టర్‌ చెప్పిన విషయాలు మొత్తం చెప్పేస్తాడు.

Advertisement

ఈ విషయం కళావతికి చెబితే తను ఒప్పుకోదని తెలుసు.. నా ప్రాణాలు పోయినా పర్వాలేదు.. తనకు బిడ్డే కావాలని అంటుంది. అందుకే ఆ నిజం కళావతికి చెప్పుకోలేక నా బిడ్డను చంపుకోలేక ఇన్ని రోజులు నాలో నేనే నరకం అనుభవించానమ్మా ఇద్దరిని కాపాడుకోవడానికి నేను చేయని ప్రయత్నమే చేయలేదు.. అంటూ రాజ్‌ ఎమోషనల్‌ అవుతుంటాడు. ఇంతలో సుభాష్‌ అసలు కావ్యకు చెబితేనే కదరా ఒప్పుకునేది లేనిది అంటాడు కానీ తను ఒప్పుకోదమ్మా నాకు తెలుసు అంటూ రాజ్‌ చెప్పగానే.. అయితే పదరా కావ్యకు నిజం చెప్పేద్దాం ఇప్పుడే అంటూ అపర్ణ వెళ్తుంటే… రాజ్‌ ఆపేస్తాడు. వినకుండా అపర్ణ, సుభాష్‌ బయటకు వెళ్లిపోతారు.

హాల్లో కూర్చుని బాధపడుతున్న కావ్య దగ్గరకు ఇంద్రాదేవి వెళ్లి ఓదారుస్తుంది. ఇంతలో అక్కడకు వచ్చిన అపర్ణ, రాజ్‌ చెప్పినట్టు అబార్షన్‌ చేయించుకో అని చెప్తుంది. కావ్య ఎందుకు అని అడగ్గానే.. అపర్ణ నిజం చెప్తుంది. బిడ్డను 9నెలలు మోస్తే నువ్వు బిడ్డ బతకరని చెప్తుంది. అందరూ షాక్‌ అవుతారు. కావ్య మాత్రం ఏడుస్తూ నేను మీ మాటలు నమ్మను నా బిడ్డ విషయంలో నేను ఎన్నో కలలు కన్నాను మీరు అంతా అబద్దం చెప్తున్నారు అంటూ ఎమోషనల్‌ అవుతుంది. దీంతో రాజ్, కావ్యను కన్వీన్స్‌ చేయాలని ఎంత చెప్పినా నాకు మాత్రం నా బిడ్డే కావాలి.. నా బిడ్డను నేను చంపుకోలేను.. నేను వాణ్ని వదులుకోలేను.. నాకు నా ప్రాణం కంటే నా బిడ్డ ప్రాణమే ముఖ్యం అంటూ స్పృహ తప్పి పడిపోతుంది. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×