E-Paper
Advertisement

Brahmamudi Serial Today September 19th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: దుగ్గిరాల ఇంటికి జగదీష్‌ – జగదీష్‌ తో వెళ్లిపోయిన రేవతి, స్వరాజ్‌   

Brahmamudi Serial Today September 19th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: దుగ్గిరాల ఇంటికి జగదీష్‌ – జగదీష్‌ తో వెళ్లిపోయిన రేవతి, స్వరాజ్‌   
Advertisement

Brahmamudi serial today Episode: కళ్యాణ్‌ రూంలోకి రాగానే నిజం రాజ్‌కు చెప్పావా అని అడుగుతుంది అప్పు. కళ్యాన్‌ ఎమోషనల్‌ అవుతూ అసలు నిజం చెప్పి తప్పు చేశావేమో తన ప్రాణంగా చూసుకునే బిడ్డ ప్రాణాలు తీసేయాలంటే ఏ తండ్రి ఒప్పుకుంటాడు చెప్పు.. నిజాన్ని అయితే చెప్పగలిగాను కానీ అన్నయ్య మన నిర్ణయానికి ఒప్పుకోవడం లేదు అని కళ్యాన్‌ చెప్పగానే.. ఏమంటున్నావు కూచి అని అప్పు అడగ్గానే.. అవును పొట్టి అన్నయ్య వదినను కానీ తన కడుపులో ఉన్న బిడ్డను కానీ వదులుకోవడానికి ఒప్పుకోవడం లేదు అని చెప్పగానే.. కానీ ఆ బిడ్డ వల్ల అక్క ప్రాణాలకు ప్రమాదం కదా ఆ విషయం చెప్పలేదా నువ్వు అంటూ అప్పు అడగ్గానే..

చెప్పాను పొట్టి అన్ని విషయాలు చెప్పాను.. కానీ మళ్లీ రేపు డాక్టర్‌కు దగ్గరకు వెళదాం మళ్లీ టెస్టులు చేపిద్దాం అంటున్నారు. ఒక్క చిన్న చాన్స్‌ ఉన్నా ప్రయత్నిద్దాం అంటున్నాడు అని కళ్యాణ్‌ చెప్పగానే.. ఇప్పటికే డాక్టర్‌ లేట్‌ అయిందని చెప్తుంది. మళ్లీ టెస్టులు అని అక్కను ఒప్పించాలంటే టైం పడుతుంది అది అక్కకే ప్రమాదం కదా అంటూ అప్పు బాధపడుతుంది. ఏం కాదు పొట్టి ఒకవేళ అన్నయ్య అన్నట్టు ఒక్క చిన్న చాన్స్‌ ఉన్నా మంచిదే కదా అంటూ అప్పును ఓదారుస్తాడు కళ్యాన్.

Advertisement

కావ్య పడుకునే ఉంటే పక్కనే వెళ్లి కూర్చుంటాడు రాజ్‌. ఏడుస్తూ.. కళ్యాన్ ఏదేదో చెప్తున్నాడు కళావతి.. నువ్వు బిడ్డను త్యాగం చేస్తేనే నువ్వు బతుకుతావట.. కానీ వాడికేం తెలుసు నువ్వు ఆ బిడ్డ మీద ఎంత ప్రేమను పెట్టుకున్నావని.. డాక్టర్లు చెప్పినా ఆఖరికిఆ దేవుడు చెప్పినా సరే నిన్ను నీ కడుపులో పెరుగుతున్న బిడ్డను నేను కాపాడతాను. నాకు ఏ కష్టం వచ్చినా ముందు నీకే చెప్పేవాడిని కానీ ఈరోజు నీకు ఆవిషయం చెప్పలేను. ఈ దారిలో నేను ఒంటరిగా పోరాడాలి. పోరాడతాను.. చివరి క్షణం వరకు పోరాడతాను. ఆ విధి రాతను ఎదిరించే ప్రయత్నంలో నా ప్రాణం పోతున్నా సరే నా బిడ్డను నీ చేతుల్లో పెట్టైనా సరే శ్వాస వదిలేస్తాను. మాటిస్తున్నాను కళావతి నీకు మన బిడ్డకు ఏ ప్రమాదం రానివ్వను అంటూ అక్కడి నుంచి లేచి వెళ్లిపోతుంటే.. కావ్య రాజ్‌ చేయి పట్టుకుంటుంది. రాజ్‌ షాక్‌ అవుతాడు.  కావ్య నిద్రలోనే ఎక్కడికి వెళ్లిపోతారు.. నాదగ్గరే ఉండండి.. ఎప్పుడూ చూడు ఏదో ఒక గొడవతో నాకు దూరంగా వెళ్లిపోతారు. ఇక నుంచి మన బిడ్డ పుట్టేవరకు మీరు నాతోనే నా పక్కనే ఉండాలి అంటుంది. ఉంటాను కళావతి ఎప్పుడు నీతోనే నీ పక్కనే ఉంటాను.. ధైర్యంగా ఉండు అంటాడు రాజ్‌.

తర్వాతి రోజు అందరూ హల్లో కూర్చుని ఉండగా దుగ్గిరాల ఇంటికి జగదీష్‌ వస్తాడు. గుమ్మం దగ్గరే ఆగిపోతాడు. దీంతో ఇంద్రాదేవి అందేంటి అబ్బాయి అక్కడే నిలబడిపోయావేం.. లోపలికి రా అని పిలుస్తుంది. ఎలా వస్తాడమ్మా ఒకప్పుడు ఇదే ఇంటికి డ్రైవర్‌ గా పని చేశాడు. ఇప్పుడు అల్లుడు హోదాలో అడుగుపెట్టాలంటే ఇబ్బందిగా ఉంటుంది. పైగా మన ఇంటి బిడ్డను దొంగతనంగా పెళ్లి చేసుకున్నాడు కదా ఎవరు ఏమంటారోనని భయపడుతున్నాడు. నార్మల్ గా అయితే ఈ ఇంట్లో నువ్వు అడుగుపెట్టే అర్హత లేదు. కానీ ఈ ఇంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు కదా సిగ్గు లేకుండా అడుగుపెట్టొచ్చు అంటుంది రుద్రాణి.

Advertisement

ఇంతలో అయన రేవతిగారిని పెళ్లి చేసుకుని అర్హత తెచ్చుకున్నారు. కానీ ఇక్కడ ఏ అర్హత లేని వాళ్లు ఇంట్లో పడి బతుకుతున్నారు అంటుంది స్వప్న. దీంతో రుద్రాణి స్వప్నను తిడుతుంది. ఇంతలో ఇంద్రాదేవి అపర్ణ మీరు ఇద్దరూ కలిసి ఆ అబ్బాయిని లోపలికి పిలవండి మీరు పిలిస్తే అతను తప్పకుండా లోపలికి వస్తాడు వెళ్లి పిలవండి అని చెప్పగానే.. అపర్ణ, సుభాష్‌ గుమ్మం దగ్గరకు వెళ్లి జగదీష్‌ను పిలుస్తారు. దీంతో జగదీష్‌ లోపలికి వస్తాడు. అందరూ హ్యాపీగా ఉంటారు. ఇక అందరం కలిసి ఉంటే సంతోషంగా ఉంటామని అపర్ణ చెప్పగానే.. రేవతి అందుకు ఒప్పుకోదు.. నేను అత్తారింట్లోనే ఉంటాను.. అప్పుడే అందరం సంతోషంగా ఉంటాము.. అని చెప్పి జగదీష్‌, స్వరాజ్‌ను తీసుకుని వెళ్లిపోతుంది.

తర్వాత రూంలోకి వెళ్లిన రాహుల్ కోపంగా రుద్రాణిని తిడతాడు. మమ్మీ నిన్ను చంపేయాలన్నంత కోపం వస్తుంది. నన్ను ఏదేదో చేస్తానని చెప్పావు.. నువ్వు ఆశలు కల్పించావు.. నన్ను ఆకాశంలో కూర్చోబెట్టావు.. కానీ ఏమైంది వాళ్లు అందరూ కలిసిపోయారు. ఇక నేనే రంగంలోకి దిగితాను.. నేను మంచి వాడిగా నటించి అందరి చేత మార్కులు కొట్టేస్తాను.. ఆ తర్వాత ఆస్థిని కొట్టేస్తాను అంటూ తన ప్లాన్‌ చెప్తాడు రాహుల్‌.. రుద్రాణి ఆశ్చర్యపోతుంది. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×