E-Paper
Advertisement

Brahmamudi Serial Today October 27th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: డాక్టర్‌ చేత అబద్దం చెప్పించిన కావ్య – నిజం తెలుసుకున్న రాజ్‌  

Brahmamudi Serial Today October 27th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: డాక్టర్‌ చేత అబద్దం చెప్పించిన కావ్య – నిజం తెలుసుకున్న రాజ్‌  
Advertisement

Brahmamudi serial today Episode: హాస్పిటల్‌ నుంచి అందరూ ఇంటికి వస్తారు. హ్యాపీగా ఉంటారు. ఇంతలో సీతారామయ్య, కావ్యను లోపలికి తీసుకెళ్లమని రాజ్‌కు చెప్తాడు. సరేనంట రాజ్‌ కావ్యను రూంలోకి తీసుకెళ్తాడు. లోపలికి వెళ్లాక కావ్య హమ్మయ్య పాపం ఇంట్లో వాళ్లు అందరూ నాకు ఏదో అయిపోతుందని చాలా కంగారు పడిపోయారు కదండి. ఇంట్లో వాళ్ల సంగతి పక్కన పెట్టండి అసలు మీకు ఈ విషయం మొదటిసారి తెలిసినప్పుడు ఎంతలా భయపడిపోయి ఉంటారు. మీరు చేసిన ప్రయత్నాలే చెప్తున్నాయి.

మీరు మొండిగా బిడ్డను వద్దు అంటుంటే మీరు ఎందుకు ఇంత  మొండిగా ప్రవర్తిస్తున్నారు అని నాకు చాలా కోపం వచ్చింది. ఆఖరికి మీరు ఎక్కువా..? బిడ్డ ఎక్కువా..? అని అడిగితే నేను అలిగి పుట్టింటికి వెళితే నన్ను కాపాడటం కోసం వెతుక్కుంటూ మరీ ఇంటికి వచ్చారు. నా కోసం రోడ్డు మీద కూర్చున్నారు.. ఇంత ప్రేమ నేను కూడా మీకు చూపించలేనండి ఏదైతే ఏం మొత్తానికి ప్రమాదం నుంచి బయటపడిపోయాను. ఇప్పుడు మీ గుండెల్లో ఉన్న భారం అంతా తీరిపోయి ఉంటుంది కదా.? ఇక మీరు దేనికి భయపడాల్సిన పని లేదు. నాతో పోరాడాల్సిన పని అంతకన్నా లేదు. కొన్ని నెలల్లోనే మన వారసుడు వస్తాడు. మనం అందరం కలిసి సంతోసంగా ఉండొచ్చు. అప్పుడు వాడికి నీ గురించి తప్పకుండా చెప్తాను. మీ అమ్మ బతికి ఉందంటే దానికి కారణం మీ నాన్నే అని చెప్తాను..

Advertisement

ఏంటండి అలా చూస్తున్నారు.. డాక్టర్‌ ఆ నిజం చెప్పగానే.. ఎగిరి గంతేస్తారు అనుకున్నాను.. సంతోషంతో పొంగిపోతారు అనుకున్నాను కానీ మీరేంటి ఏదో పొగొట్టుకున్నవారిలా అలా చూస్తున్నారు అని కావ్య అడగ్గానే.. రాజ్‌ అబద్దం ఎందకు చెప్పావు కళావతి అని అడుగుతాడు. దీంతో కావ్య అబద్దం ఏంటండి.. నేనేం చెప్పాను.. అంటుంది. దీంతో రాజ్ డాక్టర్‌ చేత ఎందుకలా చెప్పించావు అని అడుగుతాడు. దీంతో ఓ నాకు అర్థం అయింది. డాక్టర్‌ నాకు ఏ ప్రమాదం లేదని చెప్పేసరికి మీరు నమ్మలేకపోతున్నారా..? నేనే చెప్పించాను అనుకుంటున్నారా..? అయినా మీరు డాక్టర్‌తో మాట్లాడినప్పుడు నేను స్పృహలో లేను కదండి అంటుంది. దీంతో రాజ్‌ డాక్టర్ తో నేను గదిలో మాట్లాడింది నేను నీకు చెప్పలేదే.. కానీ నువ్వు డాక్టర్‌తో మాట్లాడేటప్పుడు నేను విన్నాను..

అని రాజ్‌ చెప్పగానే.. కావ్య షాక్‌ అవుతుంది.  తాను డాక్టర్‌తో మాట్లాడింది మొత్తం గుర్తు చేసుకుంటుంది. తనకు అంతా బాగానే ఉందని డాక్టర్‌కు చెప్పిన విషయం గుర్తు చేసుకుంటుంది. అయితే మీరు మొత్తం వినేశారు అన్నమాట. నా బ్యాడ్‌ లక్ అండి ఈ విషయం బిడ్డ పుట్టే వరకు ఎవరికీ తెలియకూడదు అనుకున్నాను.. కానీ మీకు తెలిసిపోయింది. పోనీలేండి మీకు తెలిస్తే తెలిసింది.. ఇంట్లో వాళ్లకు చెప్పకండి అంటుంది. దీంతో రాజ్‌ ఏం మాట్లాడుతున్నావు కళావతి ఇంత పెద్ద విషయం ఎందుకు దాచాలి అనుకున్నావు.. అని అడగ్గానే.. ఇంట్లో వాళ్ల సంతోషం కోసం దాచాలి అనుకున్నాను అని కావ్య చెప్తుంది. కానీ విషయం ఇంట్లో వాళ్లకు చెప్తానని రాజ్‌ చెప్పగానే.. వద్దని కావ్య వారిస్తుంది. దీంతో రాజ్‌ ఎమోసనల్ అవుతాడు. నిజం తెలిశాక నేను ఎలా బతగ్గలను.. అది నా వల్ల కాదు అని వెళ్లిపోతాడు రాజ్‌.

Advertisement

తర్వాత కావ్య రాజ్‌ దగ్గరకు భోజనం తీసుకెళ్లి తినిపిస్తుంది. తర్వాత స్వప్న రూంలోకి వెళ్లి తన నెక్లెస్‌ చూసుకుంటుంది అక్కడ నెక్లెస్‌ ఉండదు. దీంతో కోపంగా రాహుల్‌ ఏమైనా తీశాడా అని అనుకుని కోపంగా బయటకు వెళ్లిపోతుంటే.. రాహుల్‌ వస్తాడు. కోపంగా రాహుల్‌ను నెక్లెస్‌ ఎక్కడుందో చెప్పు అంటుంది. అ నెక్లెస్‌ నేనెందుకు తీస్తాను ఇలా ప్రతిసారి నా మీద నింద వేస్తే బాగుండదు అంటాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. స్వప్న రాహుల్‌కు వార్నింగ్‌ ఇచ్చి వెళ్లిపోతుంది. మరోవైపు రాజ్‌ను మార్చేందుకు కావ్య ప్రయత్నిస్తుంది. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×