E-Paper
Advertisement

Brahmamudi Serial Today October 25th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజ్‌కు గుడ్‌ న్యూస్‌ చెప్పిన డాక్టర్‌  

Brahmamudi Serial Today October 25th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజ్‌కు గుడ్‌ న్యూస్‌ చెప్పిన డాక్టర్‌  
Advertisement

Brahmamudi serial today Episode: అబార్షన్‌ చేయించుకోవడానికి కావ్యను ఒప్పించాలంటే అందరూ కలిసి నాటకం ఆడాలని ప్లాన్‌ చేస్తారు. అందుకోసం కావ్య ఏమి ఇచ్చినా తినకూడదు.. తాగకూడదని డిసైడ్‌ అవుతారు. ఇంతలో కావ్య దేవుడి ప్రసాదం తీసుకొచ్చి ఇస్తుంటే.. ఎవ్వరూ తీసుకోరు. దీంతో కావ్య ఏమైంది అత్తయ్యా ఏంటి ఎవ్వరూ ప్రసాదం తీసుకోవడం లేదు అంటూ అడుగుతుంది. దీంతో అపర్ణ మాకు అక్కర్లేదు అని చెప్తుంది. ఇంద్రాదేవి కూడా మేమేమీ తీసుకోము.. ఏమీ తినము అంటూ చెప్తుంది. ఇది దేవుడి ప్రసాదం తీసుకోకపోతే పాపం అంటుంది కావ్య.. ఇంతలో రుద్రాణి ఆ పాపం నాకు అక్కర్లేదు కావ్య ఆ ప్రసాదం నాకు పెట్టు అని అడుగుతుంది. కావ్య కోపంగా చూస్తుంది.

ఇంతలో అపర్ణ ఇప్పటి దాకా మేము చేసింది పాపమే.. నువ్వు కోరినట్టు నీ విషయంలో నీకు సపోర్టు చేసి ఇంకా పాపం చేయలేము అంటుంది. దీంతో కావ్య అత్తయ్యగారు ప్రసాదం తీసుకోవడం పాపమూ కాదు.. నాకు సపోర్టు చేయడం నేరమూ కాదు.. అంటుంది. కానీ నువ్వు తీసుకున్న నిర్ణయమే ఘోరం అంటున్నాము.. నువ్వు మనసు మార్చుకుని మేము చెప్పినట్టు వినేదాకా నీ చేతితో పచ్చి మంచినీళ్లు కూడా ముట్టము అని ఇంద్రాదేవి చెప్తుంది. దీంతో కావ్య పెద్ద నిర్ణయమే అంటుంది. అపర్ణ చాలా ఆలోచించి తీసుకున్నాము అంటుంది. అంటే ఈ ప్రసాదం తీసుకోరు.. నేను చేసిన టిఫిన్స్‌ తినరు అనగానే.. అంతే కదా అంటుంది అపర్ణ.. వేరే చెప్పాలా..? అంటుంది ఇంద్రాదేవి.. దీంతో కావ్య మరి ఈరోజు నేను చేసిన పెసరట్టు ఉప్మా సంగతేంటి అనగానే.. ఇంద్రాదేవి ఆ పెసరట్టు ఉప్మానా..? అంటుంది. అంతేనా.. వడలు కూడా చేశాను.. అంటుంది కావ్య. వడలా..? ఆంటూ ఆశగా చూస్తుంది ఇంద్రాదేవి..

Advertisement

అపర్ణ మాత్రం అత్తయ్యా కంట్రోల్‌.. అంటుంది. అంతేకాదు.. ఇంటిల్లిపాదికి ఇష్టమని పూరీలు కూడా చేద్దాం అనుకుంటున్నాను అని కావ్య చెప్పగానే.. పూరీ కూడా.. భగవంతుడా ఇంత పరీక్ష పెట్టావేంటయ్యా నువ్వు అనుకుంటుంది ఇంద్రాదేవి.. నువ్వెంత చెప్పినా ఇక్కడ ఎవ్వరూ లొంగేవాళ్లు లేరు అంతే కదా అత్తయ్యా… అని అపర్ణ అడగ్గానే… ఇంద్రాదేవి అవును .. అవును.. చూడు కావ్య నువ్వు మారేదాకా..? నీ మనసు మార్చుకునేదాకా మా ఈ నిర్ణయం మారదు అని చెప్తుంది. అయితే సరే మీకే అంత పట్టుదల ఉంటే నేను మీ కన్నా మొండి దాన్ని.. నేను మీ కన్నా పట్టుదలగా ఉంటాను. నేను ఉదయం పెసరట్టు తింటాను.. మధ్యాహ్నం వడలు తింటాను.. రాత్రికి పూరీలు తింటాను.. మళ్లీ అడుగుతున్నాను.. చిన్న మామయ్య టిఫిన్లు ఎవ్వరికీ అక్కర్లేదా.? అని అడగ్గానే.. అపర్ణ మా మాటే శాసనం అంటుంది. కావ్య మళ్లీ ఆఖరిసారిగా అడుగుతున్నాను ఆలోచించుకోండి మరి అంటుంది.

ఇంతలో ఇంద్రాదేవి.. నేను ఒక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్టే అంటుంది. దీంతో కావ్య అంతేనా చిన్న మామయ్యా.. అని అడగ్గానే.. ప్రకాష్ తగ్గేదేలేదు అంటాడు. అయితే నేను తగ్గేదేలేదు అనుకుంటూ కావ్య లోపలికి వెళ్లిపోతూ.. కళ్లు తిరిగి కింద పడిపోతుంది కావ్య.. రుద్రాణి చూసి కావ్య కింద పడిపోయింది అని చెప్పినా ఎవ్వరూ నమ్మరు.. ఆడిన నాటకం చాలులే కావ్య ఇక లేవు అంటారు.. కావ్య లేవదు.. అప్పు దగ్గరకు వెళ్లి చూసి అక్క నిజంగానే పడిపోయింది అని చెప్తుంది. వెంటనే అందరూ కంగారుగా దగ్గరకు వెళ్లి చూసి కావ్యను హాస్పిటల్‌కు తీసుకెళ్తారు.  డాక్టర్‌ లోపల కావ్యను చెక్‌ చేస్తుంటే.. రాజ్‌ అప్పుడే తన నిర్ణయం చెప్తాడు. కావ్యకు తెలియకుండా ఇప్పుడే అబార్షన్‌ చేయిస్తే బాగుంటుంది అని అందరూ నిర్ణయం తీసుకుంటారు. రుద్రాణి వద్దని తిడుతుంది. రుద్రాణి ని అందరూ తిడతారు.

Advertisement

అందరూ డాక్టర్‌ దగ్గరకు వెళ్లి తను స్పృహలో లేదు కదా ఇప్పుడే అబార్సణ్‌ చేయండి అని చెప్తారు. డాక్టర్‌ వద్దని చెప్తుంది. మళ్లీ ఒకసారి టెస్టు చేసి చూద్దాం అని చెప్పి టెస్టులు చేస్తుంది. టెస్టులు చూసి మీకో గుడ్‌ న్యూస్‌ అంటూ కావ్యకు అబార్షన్‌ అవసరం లేదని గర్భసంచిలో చేంజెస్‌ కనిపిస్తున్నాయి. తను ఇప్పుడు బిడ్డను క్యారీ చేయోచ్చు ఎటువంటి ప్రాబ్లెమ్‌ లేదు అని చెప్పగానే.. రాజ్‌, అపర్ణ, ఇంద్రాదేవి అందరూ ఎమోషనల్‌ అవుతారు. తర్వాత అందరూ ఇంటికి వెళ్లి హ్యాపీగా ఉంటారు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×